S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/16/2019 - 23:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వ్యక్తిగత డేటా పరిరక్షణ విధాన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ విధానానికి తుదిరూపం ఇస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు మార్గదర్శకాలను అనుసరించే ఈ-కామర్స్ విధానాన్ని రూపొందిచాల్సివుందని ఆ అధికారి స్పష్టం చేశారు.

12/16/2019 - 04:35

న్యూఢిల్లీ: బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి సంప్రదింపులను ఆరంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సంబంధిన వివరాలను వివిధ వర్గాల నుంచి సమీకరించనున్నారు. ప్రధానంగా పారిశ్రామిక రంగ ప్రముఖులతోబాటు, మాజీ సంస్థల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో ఆమె చర్చలు జరుపనున్నారని అధికావర్గాలు తెలిపాయి.

12/16/2019 - 04:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈ ఏడాది ముగిసేలోగా అందరూ ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ఆదాయ పన్ను శాఖ ఆదివారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఆదేశించింది. ఈ మేరకు ఖచ్చితమైన నిబంధనను అమలులోకి తెస్తున్నట్టు తెలిపింది. ‘భవిష్యత్తు పన్ను ప్రయోజనాలకోసం ఈ అనుసంధానాన్ని డిసెంబర్ 31లోగా పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించింది.

12/16/2019 - 04:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గడచిన వాణిజ్య వారం ముగింపు రోజున నమోదైన భారీ లాభాల ట్రెండ్‌ను భారత స్టాక్‌మార్కెట్లు ఈ వారం కూడా కొనసాగించే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఓ దశ సానుకూల ఒప్పందానికి దారితీయడం ప్రపంచ మార్కెట్లన్నింటికీ ఊతమిచ్చిన సంగతి తెలిసిందే.

12/16/2019 - 04:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ త్వరలో షియోమీ, మోటొరోలా, ఒన్‌ప్లస్ తరహాలో స్మార్ట్ టెలివిజన్ల తయారీని చేపట్టనుంది. 2020 ప్రథమార్థంలో ఈ టెలివిజన్లు భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

12/16/2019 - 04:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈ ఏడాది గృహ నిర్మాణ రంగ విక్రయాల్లో 4 శాతం వృద్ధి చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మొత్తం 2.58 లక్షల యూనిట్ల యూనిట్లు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జరిగే అవకాశాలున్నాయి. ఒక వైపు ద్రవ్యలోటు, డిమాండ్ తగ్గుదల, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్య ఇక్కట్లున్నా ఇలా పెరుగుదల నమోదవడం విశేషమని ఆదివారం నాడిక్కడ విడుదలైన స్థిరాస్తి బ్రోకరేజ్ సంస్థ ‘అనారోక్’ అధ్యయన నివేదిక పేర్కొంది.

12/16/2019 - 04:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: సున్నిత, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడుల తీరుపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ప్రధానంగా టెలికాం, భౌతిక వౌలిక సదుపాయాల రంగాల్లో దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో వ్యయం చేసేందుకు సంబంధించిన నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల విషయంపై సైతం ప్రభుత్వం క్షుణ్ణంగా సమీక్షించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

12/16/2019 - 01:21

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలోని ‘విజయ’ పాల ధరను పెంచారు. పెరిగిన పాల ధర సోమవారం నుండి అమల్లోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దీని ప్రకారం ఒక లీటర్ పాల ధర రెండు రూపాయలు పెరుగుతోంది. డైట్ మిల్క్ లీటర్ 36 రూపాయల నుండి 38 రూపాయలకు పెరిగింది.

12/15/2019 - 02:12

రాజమహేంద్రవరం: ఆదివాసీలు సేకరించిన తేనెకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా శుద్ధిచేసిన తేనెకు ఇటీవల కాలంలో విపరీతమైన మార్కెట్ విస్తరణ జరిగింది. ఒక్క ఏపీలోనే ఏడాదికి రూ.4.50 కోట్ల విలువైన తేనె విక్రయం జరుగుతోంది. ఆదివాసీ ప్రాంతానికి సమీపంలో వున్న రాజమహేంద్రవరంలో నెలకొల్పిన జీసీసీ తేనె శుద్ధి కర్మాగారం నుంచి నిత్యం రూ.లక్షల విలువైన తేనె ఎగుమతి జరుగుతోంది.

12/15/2019 - 02:08

ముంబయి, డిసెంబర్ 14: ఈవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ)లో సెస్సెక్స్ 564.56 పాయింట్లు, ఇటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 334.34 పాయింట్లు మెరుగుపడ్డాయి. 40,445.15 పాయింట్లతో ఈవారం ట్రేడింగ్‌కు తొలిరోజైన సోమవారం ప్రారంభమైన మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.

Pages