S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/19/2019 - 01:18

ముంబయిలో 2015లో జరిగిన టీసీఎస్ 20వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సైప్రస్ మిస్రీ. వివిధ నాటకీయ పరిణామాల నేపథ్యంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని కోల్పోయిన అతడిని తిరిగి అదే స్థానంలో నియమిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది

12/19/2019 - 01:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ మార్పుచేయలేని ప్రాధాన్యతా వాటాలను బుధవారం విడుదల చేసింది. ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంతో విడుదలైన ఈ వాటాల ద్వారా రూ. 300 కోట్ల నిధులను సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మొత్తం మూడు కోట్ల వాటాలను విడుదల చేయగా, ఇందులో ఒక్కో వాటా ధర రూ. 100 ముఖ విలువతో కూడుకుని ఉంది.

12/19/2019 - 01:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భారత్‌కు చెందిన ‘ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా’ (ఏఆర్‌ఏఐ)తో తమ సంస్థకు ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్‌కు చెందిన టైర్ల దిగ్గజ కంపెనీ ‘మిచెలిన్’ బుధవారం నాడిక్కడ ప్రకటించింది. రవాణా రంగంపై అవగాహనను పెంపొందించడంతోబాటు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది.

12/18/2019 - 05:03

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో ఉగ్రవాద మిలిటెంట్ల దాడుల్లో బాధితులైన కుటుంబాలవా రు తయారు చేసిన రుమాళ్లతో ‘ఖాదీ రుమాల్’ పేరిట ఏర్పాటైన ప్రదర్శన, విక్రయాలను కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం నా డిక్కడ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను కేంద్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వినయ్‌కుమార్ సక్సేనా విలేఖరులకు వివరించారు.

12/17/2019 - 23:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆర్థిక మాంద్యం కారణంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో నెలకొన్న మాంద్యాన్ని చక్కదిద్దే చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈక్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల్లో ఈ వసూళ్లు ఊపందుకునేలా చేసేందుకు కృషి జరుగుతోంది. ప్రతి నెలా ఈ వసూళ్లు కనీసం 1.1 లక్షల కోట్లకు తగ్గకుండా చూడాలని సంబంధిత అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది.

12/17/2019 - 23:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నియంత్రణ విభాగాల తీరుతెన్నులతో ప్రైవేటు పెట్టుబడులకు ఇబ్బందులేవైనా ఎదురవుతున్నాయా? అన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అధ్యయనం చేశారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన నిమత్తం ఆమె వివిధ వర్గాలతో సంప్రదింపులను చేపట్టిన సంగతి తెలిసిందే.

12/17/2019 - 23:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: వచ్చే 2020 జనవరి 31తో ముగిసే బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం అమలైతే సంస్థకు రూ. 1,300 కో ట్లు ఆదా అవుతుందని ఆ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ మంగళవారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. సంస్థలో పనిచేసే 78,569 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు.

12/17/2019 - 04:49

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే వివిధ శాఖల్లో ఖర్చులు తగ్గించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ బస్ టికెట్‌ల రేట్లను పెంచిన ప్రభుత్వం తాజాగా మద్యం రేట్లను పది శాతం పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. పాత మద్యం నిల్వలకు కొత్త ధర లు వర్తించవని రాష్ట్ర ఎక్సైజ్

12/16/2019 - 23:43

ముంబయి, డిసెంబర్ 16: గత ఫిబ్రవరి నెల నుంచి దేశ ఆర్థికాభివృద్థి మందగమనాన్ని రిజర్వుబ్యాంకు గుర్తించిందని, అందుకు అనుగుణంగానే రెపోరేట్లలో కోత విధించి తమవంతు సహాకారాన్ని ప్రభుత్వానికి అందజేశామని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

12/16/2019 - 23:40

ముంబయి, డిసెంబర్ 16: బలహీన స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాల కారణంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా ఇందన, ఎఫ్‌ఎంసీజీ, వాహన స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచి సానుకూలంగా ఆరంభమై తాజా జీవనకాల గరిష్ట స్థాయి 41,185.03 పాయింట్లను తాకింది.

Pages