S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/11/2019 - 23:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓ వైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నా కూలింగ్ పరికరాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. 2019 నుంచి 2030 మధ్య కాలంలో 4.8 బిలియన్ల కొత్త కూలింగ్ యూనిట్లు, పరికరాల విక్రయం జరిగే అవకాశాలున్నాయని ఏకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అధ్యయన నివేదిక బుధవారం నాడిక్కడ వెల్లడించింది.

12/11/2019 - 23:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆటోమొబైల్ రీటెయిల్ ఫైనాన్సింగ్ సమస్యలకు వినియోగదారులకు పరిష్కారం చూపే విషయంలో ఫెడరల్ బ్యాంక్‌ను భాగస్వామిగా ఎంచుకున్నట్టు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. డీలర్ ఇనె్వంటరీ ఫండింగ్ విషయంలో ఫెడరల్ బ్యాంక్‌ను ఎంఎస్‌ఐఎల్ గత ఆగస్టులో భాగస్వామిగా చేర్చుకోవడం జరిగింది.

12/11/2019 - 04:38

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చాలా బ్యాం కుల మాదిరిగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనూ మొండి బకాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రుణదాత బ్యాంకైన ఎస్బీఐలో నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) విలువ 11,932 కోట్లు పెరిగింది. మొత్తం మీద బ్యాంకు ఎన్పీఏ మొత్తం 1,72,750 కోట్ల రూపాయలుకాగా, పెరిగిన మొత్తాలను కూడా చేరిస్తే 1,84,682 కోట్ల రూపాయలకు చేరుతుంది.

12/11/2019 - 04:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఔషధ పరిశ్రమలో పేరొందిన పనాసియా బయోటెక్ కంపెనీ మదుమేహానికి కొత్త జనరిక్ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది. విల్‌యాక్ట్ బ్రాండ్ పేరుతో తయారైన ఈ మం దును టైప్-2 డయాబెటిస్‌కు వాడతారు. ఇందులో విల్డాగ్లిప్టిన్ 50 ఎంజీ, విల్డాప్లిప్టిన్ 50 ఎంజీ, మెట్‌ఫార్మిన్ హెచ్‌సీఎల్ 850 ఎంజీ, విల్డాగ్లిప్టిన్ 50 ఎంజీ, మెటఫార్మిన్ హెచ్‌సీఎల్ 1000 ఎంజీ ఉంటాయి.

12/11/2019 - 04:35

వరదయ్యపాలెం, డిసెంబర్ 10: సుస్థిరత స్మార్ట్‌మొబిలిటీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆల్‌స్ట్రాం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో తమ పరిశ్రమలో ముంబయ్ మెట్రోరైలు కార్పొరేషన్ కోసం మెట్రో ట్రెయిన్ సెట్‌ల తయారీని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకలకు ఆల్‌స్ట్రాం ఇండియా, దక్షిణాసియా విభాగాల మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్పోర్ నేతృత్వం వహించారు.

12/11/2019 - 04:32

సియోల్ (దక్షిణ కొరియా)లోని కొరియా కాంపోజిట్ స్టాక్ ప్రైస్ ఇండెక్స్ (కేఓఎస్‌పీఐ) ముందు ఉన్న సూచీల బోర్డు. చైనా నుంచి దిగుమతి అవుతున్న వివిధ రకాలైన వస్తువులపై పన్నును అమెరికా పెంచనున్నట్టు వార్తలు రావడంతో, ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. ఫలితంగా ఫోరెక్స్ వ్యాపారం కూడా అటుపోట్లకు గురయింది.

12/11/2019 - 04:30

ముంబయి, డిసెంబర్ 10: రూపాయి మారకపు విలువ బలపడుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్స క్స్ ఉదయం 40,588.81 పాయింట్లతో బలంగా కనిపించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా పట్టు కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో, సెనె్సక్స్ 247.55 పాయింట్లు లేదా 0.61 శాతం పతనమై, 40,239.88 పాయింట్ల వద్ద ముగిసింది.

12/11/2019 - 04:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పీసీ జ్యుయెలర్ కంపె నీ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. షా ర్ట్, లాంగ్ టెర్మ్ లోన్ల విషయంలో ఈ బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా లేదని క్రిసిల్ తన రేటింగ్‌లో పేర్కోవడంతో పీసీకి నష్టాలు తప్పలేదు. గత 52 వారాల్లో ఎన్నడూ లేనంతగా 23.5 రూపాయలు లేదా 5.05 శాతం ఈ కంపెనీ షేర్లు పతనమయ్యా యి. క్రిసిల్ నివేదిక ఫలితంగానే నష్టాలు తప్పలేదని ఈ కంపెనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.

12/05/2019 - 13:29

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేపో రేటు 5.1ని మార్చలేదు. రివర్స్ రేపో రేటు 4.90గా ఉన్నది. బ్యాంకు రేటు 5.40 శాతంగా ఉన్నది. 2019-20 సంవ‌త్సరానికి జీడీపీ అంచ‌నాల‌ను త‌గ్గించారు.

12/05/2019 - 05:09

న్యూఢిల్లీ: బంగారం ధరలు బుధవారం మళ్లీ పరుగందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు (తులం) బంగారం ధర ఏకంగా రూ.332 ఎగబాకింది. మొత్తం ధర మళ్లీ 39వేల మార్కును దాటి రూ. 39,299గా ట్రేడైంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 38,967 పలికింది. స్పాట్‌గోల్డ్ ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి.

Pages