S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/22/2019 - 01:48

ముంబయి, డిసెంబర్ 21: భారత స్టాక్ మార్కెట్లలో ఈవారం బుల్న్ కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 671.83 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 117 పాయింట్ల చొప్పున పెరిగింది. ఐదు రోజుల ట్రేడింగ్‌లో ఒక రోజును మినహాయిస్తే, మిగతా రోజుల్లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి.

12/22/2019 - 01:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఎల్పీజీ వినియోగం పెరిగిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకకారం, సెప్టెంబర్ మాసంతో పోలిస్తే, అక్టోబర్‌లో వినియోగం పెరిగింది. అయితే, ఆగస్టు కంటే తక్కువ కావడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకూ గల మధ్యకాలంలో ఎల్పీజీ వినియోగ గణాంకాలను ప్రభుత్వం ప్రకటించింది.

12/20/2019 - 05:56

ముంబయి: దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటామోటార్స్ తొలి విద్యుత్ ‘ఎస్‌యూవీ నెక్సన్ ఈవీ’ కారును గురువారం విడుదల చేసింది. ఈవాహనాన్ని కొన్ని వారాల వ్యవధిలోనే వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.

12/20/2019 - 05:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశంలో అన్ని రంగాల్లోకి ఐటీ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగులు పనిచేస్తుండగా, బెంగళూరు అత్యధిక వేతానాలు చెల్లిస్తున్న నగరంగా అగ్ర స్థానం లో కొనసాగుతోంది. ఈమేరకు ‘రాండ్‌స్టాడ్ ఇన్‌సైట్స్ సేలరీ ట్రెండ్స్ 2019’ పేరిట అధ్యయన నివేదిక గురువారం వెలువడింది. ఈ నగరంలో కంపెనీలు జూనియర్ స్థాయిలోనే నైపుణ్యానికి వెచ్చిస్తున్న వార్షిక ఖర్చు రూ.

12/20/2019 - 05:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయ జీవిత బీమా రంగానికి నేరుగా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది. అలాచేస్తే రూ. 40 వేల నుంచి 60 వేల కోట్ల మూలధనం సమకూరే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు మనదేశానికి చెందిన ప్రైవేటు రంగ బీమా సంస్థలకు రూ.

12/20/2019 - 05:50

ముంబయి, డిసెంబర్ 19: వరుసగా మూడోరోజైన గురువారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయి లాభాలను నమోదు చేశాయి. విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన, ఐటీ, వాహన కౌంటర్లలో భారీగా వాటాల కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి.

12/19/2019 - 05:11

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం కారణంగా పన్నుల రాబడిలో తగ్గుదల చోటుచేసుకున్న క్రమంలో వార్షిక లోటు లక్ష్యాలను సరళతరం చేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం నాడిక్కడ సూచించాయి. ప్రత్యేకించి ఈ లోటు లక్ష్యాన్ని 4 శాతానికి పెంచాలని కోరాయి.

12/19/2019 - 05:09

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఎటువంటి ప్రయా స లేకుండా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (ఎస్‌ఈజెడ్) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి (వీఎస్‌ఈజెడ్) డెవలప్‌మెంట్ కమిషనర్ రామ్మోహన రెడ్డి పిలుపునిచ్చారు.

12/19/2019 - 04:17

*చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం జీరో వాటర్ వేస్టేజి టెక్నాలజీతో తయారుచేసిన కెంట్ ఆర్వో వాటర్ ప్యూరిఫయర్‌ను ఆ సంస్థ సీఎండీ మహేష్ గుప్తాతో కలసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని

12/19/2019 - 01:19

ముంబయి, డిసెంబర్ 18: విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు సాగుతోంది. సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ బుధవారం సైతం సరికొత్త రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐటీసీ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల పరుగుతీసింది.

Pages