S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/03/2019 - 06:24

ముంబయి: భారత్ స్టాక్ మార్కెట్లలో సోమవారం జరిగిన లావాదేవీల్లో టెలికాం కంపెనీల షేర్లు భారీగా రాణించాయి. ప్రైవేటు బ్యాంకులు, ఆటో మొబైల్ రంగం షేర్లు దెబ్బతిన్నాయి. స్థూల జాతీయోత్పత్తి బలహీనపడిందన్న నివేదికల నేపథ్యంలో ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగువేశారు. ఫలితంగా బ్యాంకింగ్ ఆటోమొబైల్ షేర్లు తీవ్ర వత్తిడికి లోనయ్యాయి.

12/03/2019 - 06:18

*చిత్రం... రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఒప్పందాలపై సంతకాల సందర్భంగా స్వీడన్ రాజు కార్ల్ గుస్త్ఫాతో కరచాలనం చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పక్కన విదేశాంగ మంత్రి జైశంకర్

12/03/2019 - 06:15

ముంబయి, డిసెంబర్ 2: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎల్‌ఐసీ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డుతో జరిపే చెల్లింపులపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రిమీయం రెన్యూవల్, కొత్త ప్రిమీయం, లేదా రుణాల చెల్లింపు, వడ్డీల చెల్లింపులను క్రెడిట్ కార్డులతో చేస్తే సర్వీసు ఛార్జీలు ఉండవని తెలిపింది.

12/03/2019 - 06:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలో ఉక్కు పరిశ్రమలు బలమైన వృద్ధి రేటును సాధిస్తున్నాయని, మాంద్యం తర్వాత వీటి పురోగతి పుంజుకున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ఉక్కు ఎగుమతి దేశంగా గుర్తింపు పొందిందని అన్నారు.

12/03/2019 - 01:08

అమరావతి: దేశవ్యాప్తంగా ఉల్లి కొరతను అధిగమించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వెల్లడించారు. దిగుమతులతో పాటు స్థానికంగా లభ్యమయ్యే ఉల్లిని కొనుగోలు చేసి పంపిణీ పాయింట్లు, రైతు బజార్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

12/02/2019 - 06:49

న్యూఢిల్లీ: దేశ ఆర్ధికాభివృద్ధి గణాంకాలు, వాహన విక్రయాల శాతం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్ల నిర్ణయం, అంతర్జాతీయంగా మార్కెట్ల స్థితిగతులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటితోబాటు హాంగ్‌కాంగ్‌లో ఆందోళనలపై అమెరికా-చైనా మధ్య నెలకొన్న రాజకీయ వైరుద్ధ్యాలు సైతం గణనీయంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాణిజ్య విశే్లషకులు చెబుతున్నారు.

12/01/2019 - 23:00

న్యూఢిల్లీ, నవంబర్ 1: టెలికాం రంగంలో నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా మొబైల్ కాల్ రేట్లను వొడాఫోన్ ఐడియా మంగళవారం (3వ తేదీ) నుంచి పెంచనుంది. ఈమేరకు ప్రీ పెయిడ్ సేవలకు 42 శాతం అదనంగా కాల్ డేటా చార్టీలను పెంచుతున్నట్టు ఆ కంపెనీ ఆదివారం నాడిక్కడ ప్రకటించింది. అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల వంతున చార్జి చేయడం జరుగుతుందని తెలిపింది.

12/01/2019 - 22:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ప్రధాన మార్కెట్లలో గడచిన నవంబర్ మాసంలో విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) రూ. 22,872 కోట్ల నికర నిధులను మదుపు చేశారు. ఇలా వరుసగా మూడో నెలలోనూ దేశీయ పెట్టుబడుల్లో ఎఫ్‌పీఐలదే పైచేయిగా నిలిచింది.

12/01/2019 - 22:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మూడు నెలల తర్వాత తాజాగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఊపందుకున్నాయి. గడచిన నవంబర్‌లో ఈ వసూళ్లు 6 శాతం పెరిగి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1.03 లక్షల కోట్లు వసూలయ్యాయని, ఇటీవలి పండుగ సీజన్ ఇందుకు ప్రధానంగా దోహదం చేసిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే నెలలో రూ. 97.637 కోట్లు వసూలయ్యాయి.

12/01/2019 - 05:59

న్యూఢిల్లీ: పెన్షన్ పథకంలో చేరడం ఇప్పుడు చాలా సులభమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ అన్నారు. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్‌ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకంలో కోటి మందిని, జాతీయ భవిష్య నిధి పథకం (ఎన్‌పీఎస్)లో 50 లక్షల మంది పేర్ల నమో దు కార్యక్రమంతోపాటు వారోత్సవాలను ఆయన శనివారం ఇక్కడ ప్రారంభించారు. పీఎంఎస్‌వైఎం పథకం కార్మికులకు, ఎన్‌పీఎస్ పథకం వ్యాపారులకు సంబంధించిందని ఆయన వివరించారు.

Pages