S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/28/2019 - 02:24

*చిత్రం...న్యూఢిల్లీలో సేంద్రియ ఎరువు తయారీ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజార్

11/27/2019 - 23:34

ప్రభుత్వ విధానాల కారణంగా తమకు గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ లియాన్‌లో ఫ్రెంచ్ వ్యవసాయదారులు చేసిన నిరసన కార్యక్రమంలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు

11/27/2019 - 23:32

న్యూఢిల్లీ, నవంబర్ 27: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ బుధవారం టెలికాం రంగానికి చెందిన వివిధ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెలికాం రంగంలో కల్లోలం నెలకొన్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వొడాఫోన్ ఐడియా నుంచి ఆ సంస్థ సీఈవో ఈ సమావేశానికి హాజరయ్యారు.

11/27/2019 - 23:31

న్యూఢిల్లీ, నవంబర్ 27: వౌలిక వసతుల రంగాన్ని వచ్చే ఐదేళ్ల కాలంలో రూ. 100 లక్షల కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందని రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నాడిక్కడ తెలిపారు. ‘అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన’లో బుధవారం నాడిక్కడ ఆయన పాల్గొని ప్రసంగించారు.

11/27/2019 - 23:30

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఎస్సెల్ గ్రూప్ నుంచి రూ. 167 కోట్ల ఆర్థిక చేయూతను అందుకున్న హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తుల నిర్వహణ కంపెనీ (హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ) వాటాలు బుధవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సూచీ నిర్వహణ సంస్థ ఎంఎస్‌సీఐ సైతం తమ కంపెనీ భారత విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించడం సానుకూలంగా మారింది.

11/27/2019 - 06:34

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కెనరా బ్యాంక్ ఎండీ ఆర్‌ఏ శంకర్ నారాయణన్ కలుసుకున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయన్ను సత్కరించారు.

11/27/2019 - 06:32

న్యూఢిల్లీ, నవంబర్ 26: బంగా రు ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 68 తగ్గి మొత్తం ధర 38,547కు చేరింది. ఇందుకు ప్రధాన కారణం రూపా యి మారకం విలువ పెరగడమేనని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే స్పాట్ రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 16 పైసలు బలపడిందని సీనియర్ విశే్లషకుడు తపన్ పటేల్ తెలిపారు.

11/27/2019 - 04:52

ముంబయి, నవంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల నుంచి మంగళవారం ఒక్కసారిగా నష్టాల్లోకి జారాయి. టెలికం, ఐటీ, వాహన స్టాక్స్‌లో మదుపర్లు పెద్దయెత్తున లాభాల స్వీకరణకు దిగడం ఇందుకు ప్రధాన కారణం.

11/27/2019 - 04:56

న్యూఢిల్లీ, నవంబర్ 26: ఎస్‌బీఐ కార్డ్, విమానయాన సంస్థ ‘విస్టారా’ సంయుక్తంగా మంగళవారం రెండు ప్రీమియం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేశాయి. ప్రయాణికులు ఉచితంగా టికెట్ రద్దు చేసుకునేందుకు, కావలసిన భాషను ఎంపిక చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉండే ఈ కార్డులు అదనపుఫ్రీక్వెంట్ ఫ్లైయర్ పాయింట్ల సదుపాయాలతో ఉంటాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

11/27/2019 - 04:47

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వరుసగా ఆరోత్రైమాసికంలోనూ మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ అనుబంధ విభాగం ‘ఇండి యా రేటింగ్స్ అండ్ రీసెర్స్’ మంగళవారం నాడిక్క డ విడుదల చేసిన అధ్యయన నివేదిక హెచ్చరించింది. గడచిన జూలై నుంచి సెప్టెంబర్ మాసం వర కు గల త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 4.7 శాతానికి పడిపోతుందని ఆ సంస్థ అంచనా వేసింది.

Pages