S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/01/2019 - 00:53

ముంబయి, నవంబర్ 30: గతం వారంతో పోలిస్తే, ఈవారం పరిస్థితులు స్టాక్ మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. లావాదేవీలు జరిగిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్టాక్ మార్కెట్ల లాభాలను ఆర్జించగా, రెండు రోజులు స్వల్ప నష్టాలు ఎదురయ్యాయి. స్థూలంగా చూస్తే మాత్రం, గత వారం కంటే ఈసారి పరిస్థితి చాలా వరకు మెరుగైందనే చెప్పాలి. వాస్తవానికి ఈవారం కూడా లాభనష్టాల దాగుడుమూతలు కొనసాగాయి. అయితే, రికార్డు స్థాయి పతనాలు మాత్రం లేవు.

12/01/2019 - 00:51

కోల్‌కతాలోని హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లిగడ్డ కొంటున్న ఓ మహిళ. ఉల్లిగడ్డ కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనితో స్థానిక మార్కెట్లకే ఉల్లిగడ్డలు తరలివస్తాయని అంచనా వేసింది. కానీ, ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డ కొరత కొనసాగుతునే ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతునే ఉన్నాయి.

12/01/2019 - 00:48

న్యూఢిల్లీ, నవంబర్ 30: హ్యుందయ్ ఇండి యా తన ఎస్‌యూవీ వెన్యూ మోటల్ వాహన మార్కెట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆఫ్రియా, లాటిన్ అమెరికాలో ఉన్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

12/01/2019 - 00:46

తిరువనంతపురం, నవంబర్ 30: కేరళ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు సహకార శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకులన్నింటినీ విలీనం చేసి, రాష్ట్రానికి ఓ కొత్త బ్యాంకును తీసుకొస్తామని ఆయన ట్వీట్ చేశారు.

11/29/2019 - 06:19

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించి వృత్తిపరమైన సమున్నత సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభకు తెలిపారు.

11/28/2019 - 23:47

విశాఖపట్నం, నవంబర్ 28: విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నిర్యత్ బంధు’ పథకం మంచి ఫలితాలిస్తోందని విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ కార్యాలయం సంయుక్త సంచాలకులు బీఎన్ రమేష్ తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వాణిజ్య విభాగంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు.

11/28/2019 - 23:18

ముంబయి, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం సైతం తాజా ముగింపు గరిష్టాలను నమోదు చేశాయి. హెవీవెయిట్స్ సూచీలతోబాటు, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) భారీ లాభాలను సంతరించుకున్నాయి. 10 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన తొలి కంపెనీగా ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది.

11/28/2019 - 23:16

న్యూఢిల్లీ, నవంబర్ 28: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు రికార్డు స్థాయి గరిష్ట లాభాలను నమోదు చేసిన క్రమంలో మదుపర్ల సంపద ఈ వ్యవధిలో 1.87 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ విలువ రూ. 1,87,370.56 కోట్లు అదనంగా పెరిగి మొత్తం విలువ రూ. 1,55,57,484.15 కోట్ల రూపాయలకు ఎగబాకింది.

11/28/2019 - 23:15

న్యూఢిల్లీ, నవంబర్ 28: న్యూఢిల్లీ, నవంబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) రూ. 10 లక్షల కోట్లకు పైబడిన మార్కెట్ విలువను సంతరించుకున్న తొలి భారతీయ సంస్ధగా రికార్డు సృ ష్టించగా, ఆ కంపెనీ వాటాలు సైతం ఆల్‌టైం రికా ర్డు స్థాయిలో లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఈ స్టాక్ 0.65 శాతం వృద్ధితో రూ. 1,579.9గా ట్రేడవ గా, ఇంట్రాడేలో ఒక దశలో 0.90 శాతం వృద్ధితో ఆల్ టైం గరిష్టం రూ.1,584ను తాకింది.

11/28/2019 - 06:25

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తాజా ముగింపు గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో బ్యాంకింగ్, ఐటీ, వాహన స్టాక్స్‌లో విదేశీ మదుపర్లు పెద్దయెత్తున వాటాలు కొనుగోళ్లు చేయడంతో మళ్లీ లాభాల ర్యాలీని అందుకున్నాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 199.31 పాయింట్లు (0.49 శాతం) ఎగబాకి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 41,020.61 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

Pages