S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/27/2017 - 00:24

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రెండో విడత మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 10 రూపాయల ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్‌కు 1.15 రూపాయల చొప్పున డివిడెండ్‌ను ఇచ్చింది. ఆదివారం సమావేశమైన సంస్థ బోర్డు దీనికి అంగీకారం తెలిపింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికిపైగా వాటా కోల్ ఇండియాదే.

03/27/2017 - 00:24

హైదరాబాద్, మార్చి 26: వరంగల్ గ్రామీణ జిల్లా పాకాల చెరువు పర్యావరణ ప్రాజెక్టు అభివృద్ధికి 1.50 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 12 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును సంరక్షించి పర్యావరణ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

03/27/2017 - 00:23

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. భారతీయ మార్కెట్‌లో తమ వాహన ధరలను పెంచాలని యోచిస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి అన్ని రకాల మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఉత్పాదక వ్యయమే ధరల పెంపునకు కారణమని ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి పిటిఐతో అన్నారు.

03/27/2017 - 00:23

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఉద్యోగులను తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎస్‌బిఐ ఉద్యోగులు 2 లక్షల వరకు ఉన్నారు. భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి)తోపాటు మరో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మొత్తం 2,77,000లకు పెరగనుంది.

03/27/2017 - 00:22

ముంబయి, మార్చి 26: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పురి.. ప్రపంచ అత్యుత్తమ 30 మంది సిఇఒల్లో ఒకరిగా నిలిచారు. అమెరికన్ ఫైనాన్షియల్ మ్యాగజైన్ బారోన్స్ ఈ జాబితాను ప్రచురించింది. 66 ఏళ్ల పురి.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను ప్రపంచ శ్రేణి బ్యాంక్‌గా మలచడంలో విశేషంగా శ్రమించారు.

03/26/2017 - 08:00

న్యూఢిల్లీ, మార్చి 25: భారతీయ ఆటో రంగంలో బజాజ్-కవాసాకి బంధానికి తెరపడుతోంది. దశాబ్దకాలం దోస్తీకి ఈ ఆటో దిగ్గజాలు వచ్చే నెలతో గుడ్‌బై చెబుతున్నాయి. దేశీయంగా అమ్మకాలు, సేవలకు సంబంధించి జపాన్‌కు చెందిన కవాసాకితో బజాజ్ భాగస్వామ్యం ఏప్రిల్ 1 నుంచి రద్దయిపోతోంది. పరస్పర అంగీకారంతో ఇందుకు ఇరు సంస్థలు సమ్మతించాయని శనివారం ఓ ప్రకటనలో బజాజ్ ఆటో అధ్యక్షుడు (ప్రోబైకింగ్) అమిత్ నంది స్పష్టం చేశారు.

03/26/2017 - 07:58

విజయనగరం, మార్చి 25: దేశంలో ఎయిర్ కార్గో సేవలను విస్తృతం చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. శనివారం ఇక్కడ తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఎయిర్ కార్గోను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచ ఎయిర్ కార్గో సేవల్లో భారత్ వెనుకంజలో ఉందన్నారు. అందుకే రానున్న కాలంలో ఈ సేవలను విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

03/26/2017 - 07:58

గుంటూరు, మార్చి 25: ‘పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మిర్చ్ధిర నిలకడగానే ఉంది.’ అని ఏపి మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. ఆంధ్రభూమితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ నిరుడు అత్యధికంగా ధర పలికిందని దీన్నిబట్టి కొందరు రైతులు ధర పెరిగిందని అపోహ పడుతున్నారన్నారు. కానీ కర్నాటక, మహారాష్టల్రో సంక్షోభం దృష్ట్యా రాష్ట్రంలో మిర్చికి గిరాకీ పెరిగిందని, ఇదే ధర కొనసాగింపు కాదన్నారు.

03/26/2017 - 07:57

విజయవాడ, మార్చి 25: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిం డియా.. విశాఖ నుంచి కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది. ఏప్రిల్ 1 నుంచి ఎటిఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా విశాఖ కేంద్రంగా ఈ సర్వీసులు నడపనున్నారు. ఒక్క బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఈ నూతన విమాన సర్వీసులు నడుస్తాయి. విశాఖపట్నంలో ఉదయం 6.30 గంటలకు బయలుదేరే ఎఐ 9527 విమాన సర్వీసు.. విజయవాడ మీదుగా ఉదయం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

03/26/2017 - 07:57

నల్లగొండ, మార్చి 25: స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణ పనులు జోరందుకున్నాయి.

Pages