S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/25/2017 - 00:44

ముంబయి, మార్చి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్ రంగాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న మొండి బకాయిల సమస్యకు పరిష్కారాన్ని చూపుతామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భరోసాను మదుపరులు విశ్వసించారు.

03/25/2017 - 00:43

న్యూఢిల్లీ, మార్చి 24: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని ఎగవేసి లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాను అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తికి బ్రిటన్ స్పందించింది. మాల్యా అప్పగింత విజ్ఞప్తిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ధ్రువీకరించగా, దీనికి సంబంధించి వారెంట్ జారీని పరిశీలించాలని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జీకి సూచించింది.

03/25/2017 - 00:42

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. తమ బీమా వెంచర్ ఎస్‌బిఐ లైఫ్‌లో పబ్లిక్ ఇష్యూ ద్వారా 10 శాతం వాటాను అమ్మేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఎస్‌బిఐ లైఫ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు ఎస్‌బిఐ తెలిపింది.

03/25/2017 - 00:42

న్యూఢిల్లీ, మార్చి 24: కొత్తగా 5,000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లను తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)తో సంప్రదింపుల్లో ఈ అంశం పరిశీలనకు వచ్చిందని, అయితే దీని అమలు సాధ్యపడలేదని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

03/25/2017 - 00:41

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ నాన్ ఇంటర్నెట్ యూజర్లకు ఉచితంగా 1 జిబి డేటాను ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లే అయినప్పటికీ, సంస్థ డేటా సేవలను ఉపయోగించుకోని స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఈ 1 జిబి ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

03/24/2017 - 01:19

న్యూఢిల్లీ, మార్చి 23: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాలను ఎందుకు ఆమోదించాలో.. వివరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని మోదీ సర్కారు భావిస్తున్నది తెలిసిందే.

03/24/2017 - 01:17

ముంబయి, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు గురువారం లాభాలను అందుకున్నాయి. వరుసగా గత మూడు రోజులు నష్టాలపాలైన నేపథ్యంలో చమురు, గ్యాస్, ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీలు కోలుకున్నాయి.

03/24/2017 - 01:17

న్యూఢిల్లీ, మార్చి 23: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. టికోనా నెట్‌వర్క్స్ 4జి వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. దాదాపు 1,600 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా, దేశవ్యాప్తంగా 5 సర్కిళ్లలోగల 350 సైట్లు, బ్రాడ్‌బాండ్ స్పెక్ట్రమ్‌ను కూడా దక్కించుకుంది. ఈ మేరకు గురువారం ఎయిర్‌టెల్ ప్రకటించింది.

03/24/2017 - 01:16

స్మార్ట్ఫోన్ తయారీ, ఇంటిగ్రేటెడ్ వైర్‌లెస్ డేటా సొల్యూషన్స్‌లో అంతర్జాతీయ స్థాయలో అగ్రగామి సంస్థ అయన కూల్‌ప్యాడ్.. హైదరాబాద్‌లో తమ అత్యుత్తమ స్మార్ట్ఫోన్లను గురువారం ప్రదర్శించింది. ఇందులో భాగంగా
ఫింగర్ ప్రింట్ స్మార్ట్ఫోన్, నోట్ 5 లైట్ మోడళ్లను చూపిస్తున్న సంస్థ ప్రతినిధి. దేశంలో తమ సంస్థ ప్రాధాన్యతనిస్తున్న తొలి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఈ సందర్భంగా కూల్‌ప్యాడ్ తెలియజేసింది

03/24/2017 - 01:14

జాతీయ స్థాయలో ప్రాచుర్యం పొందిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్.. ఇప్పుడు ప్రాంతీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఐపిఎల్-10 సీజన్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రసారాలను తెలుగులో చేయనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో సోనీ ప్రకటించింది. నిరుడు సీజన్‌లో తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నామని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి తెలిపారు.

Pages