S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/22/2019 - 13:07

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే ఆ కంపెనీకి చెందిన షేర్లు 16శాతం పతనమయ్యాయి. కంపెనీ సీఈవో స‌లీల్ ప‌రేక్ అనైతిక విధానాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కొంద‌రు ఉద్యోగులు చేసిన ఆరోప‌ణ‌ల‌ను విచారించేందుకు కంపెనీ ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు త‌ర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు ప‌డిపోవ‌డం ప్రారంభ‌మైంది.

10/22/2019 - 04:59

న్యూఢిల్లీ: చిన్న పట్టణాలు, నగరాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతస్థాయి పరివర్తన తీసుకురావడానికి డిజిటల్ ఇండియాను వినియోగించుకోవాలని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. చిన్న పట్టణాలు, నగరాల్లో మరిన్ని అవకాశాలను, ఉపాధి మార్గాలను తెరిచే విధంగా డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలునిచ్చారు.

10/22/2019 - 04:17

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్ జంటనగరాల్లో తిరుగుతున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ కోసం యూనిట్ ధరలను ఈఆర్‌సీ ప్రకటించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త విద్యుత్ ధరలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసే కేటగిరిని విద్యుత్ శాఖ 9వ కేటగిరిలో చేర్చింది. విద్యుత్ చార్జీలను పగలు, రాత్రి సమయాల్లో మూడు కేటగిరిలుగా నిర్ణయించారు.

10/21/2019 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించిన పథకాలను హేతుబద్ధీకరించడం, సరళతరం చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా 3ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కేపిటల్ గూడ్స్2 (ఈపీసీజీ) వంటి పథకాలకు వచ్చే విదేశీ వాణిజ్య విధానంలో సరళతరం చేసి సమగ్రంగా రూపొందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది.

10/21/2019 - 23:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఈవారం వెలువడనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలతోబాటు, అంతర్జాతీయ వాణిజ్య రంగ తీరు మన దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయంటున్నారు విశే్లషకులు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, ఇప్పటి వరకు వెలువడిన కంపెనీల సంతృప్తికర ఫలితాల కారణంగా మార్కెట్లు ప్రస్తుత లాభదాయక ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలున్నాయంటున్నారు.

10/21/2019 - 23:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ధన్‌తేరస్‌కు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపే భారతీ య సెంటిమెంటును క్యాష్ చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఆరో ట్రాంచేగా ‘సా ర్వభౌమ బంగారు బాండ్ల’ను ప్రభుత్వం విడుదల చేసింది. సరిగ్గా ఈనెల 25న థన్‌తేరస్ పర్వదినాన ఈ సార్వభౌమ బంగారు బాండ్ల (ఎస్‌జీపీ) పథకంపై సబ్‌స్క్రిప్షన్ ము గిసేలా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఇస్యూ ధరను గ్రాముకు రూ.

10/21/2019 - 05:25

విజయవాడ, అక్టోబర్ 20: దశలవారీ సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ మద్యం దుకాణాలన్నింటినీ ఎత్తివేసి, ఆ సంఖ్యలో 20శాతం తగ్గించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించింది. దీనివల్ల బెల్ట్‌షాపులన్నీ మూడబడ్డాయి కానీ రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి.

10/21/2019 - 00:00

న్యూఢిల్లీ: విమాన యాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’లోని 100 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెలలో ప్రాథమిక బిడ్స్ ఆహ్వానించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై ఇప్పటికే కొన్ని సంస్థలు ఆసక్తిని తెలియజేశాయని ఆదివారం నాడిక్కడ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకు రూ. 58 వేల కోట్ల అప్పులున్నాయి.

10/20/2019 - 23:31

ముంబయి, అక్టోబర్ 20: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన వెబ్‌సైట్‌ను ఆరు ప్రధాన భారతీయ భాషల్లోకి మార్చి లోకలైజ్ చేసింది. ఆంగ్ల మాధ్యమానికి ఇది అదనపుసౌకర్యమని, గృహ కొనుగోలు దారులకు అందుకు సంబంధించిన రుణ సదుపాయాలపై సమాచారం అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఆదివారం నాడిక్కడ ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

10/20/2019 - 23:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఈనెలలో మనదేశ ప్రధాన మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 5,072 కోట్ల మొత్తాన్ని మన దేశీయ కేపిటల్ మార్కెట్లలో మదుపు చేశారు.

Pages