S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/25/2019 - 21:57

ముంబయి, అక్టోబర్ 25: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తాజా త్రైమాసికంలో ఆరురెట్ల అదనపు లాభాలను నమోదు చేసింది. అనుబంధ సంస్థలో వాటాల విక్రయాల ద్వారా సమకూరిన భారీ లాభాలు, గణనీయంగా పెరిగిన ఆస్తుల విలువలే ఇందుకు దోహదం చేశాయి. ఈమేరకు త్రైమాసిక ఫలితాల నివేదికను ఆ బ్యాంకు శుక్రవారం నాడిక్కడ విడుదల చేసింది. గడచిన సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం రూ.

10/25/2019 - 21:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ధన్‌తేరస్ పర్వదినాన దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆభరణాల స్టాక్స్ 6.6 శాతం నష్టపోయాయి. అనూహ్యంగా మదుపర్లు వాటాల విక్రయాలకు, లాభాల స్వీకరణకు పాల్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో బీఎస్‌ఈలో ‘త్రిభువన్ దాస్ భీజీ జవేరీ’ వాటాలు 6.65 శాతం నష్టపోయాయి.

10/25/2019 - 05:29

న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్‌లో ఇద్దరు అత్యున్నతాధికారులపై వచ్చిన ‘విజిల్‌బ్లోయర్స్’ పేరిట వచ్చిన లేఖలోని ఆరోపణలపై స్టాక్ ఎక్చేంజ్ సంధించిన ప్రశ్నలపై ఆ సంస్థ గురువారం స్పందించింది.

10/25/2019 - 00:59

ముంబయి, అక్టోబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడంతోబాటు ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న ఉన్నతాధికారుల కారణంగా ఇన్ఫోసిస్ తాజా రెండు శాతం నష్టపోవడం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలం మారింది. ఈక్రమంలో ఐటీ, బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

10/25/2019 - 00:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఓవైపు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అస్థిరతలున్నా గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోప్రైవేటు ఈక్విటీ నిధులు ఆల్‌టైం రికార్డు స్థాయిలో సమకూరాయి. మొత్తం 9.4 బిలియన్ డాలర్ల నిధులు ఈ మూడు నెలల కాలంలో పెట్టుబడులుగా వచ్చాయి. ప్రధాన కార్పొరేట్ కంపెనీల్లోకే అధికంగా పెట్టుబడులు వచ్చాయి.

10/25/2019 - 00:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రైవేటు విమానయాన దిగ్గజం ఇండిగో మాతృ సంస్థ ‘ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్’ గురువారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మొత్తం రూ. 1,062 కోట్లమేర తమ సంస్థకు నష్టాలు వచ్చినట్టు ఆ సంస్థ తెలిపింది.

10/25/2019 - 00:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: టోరెంట్ పార్మాస్యూటికల్స్ వాటాలు గురువారం 5 శాతం లాభపడ్డాయి. ఈకంపెనీ తాజా త్రైమాసిక ఫలితాల్లో 36.3 శాతం అదనపునికర లాభాన్ని నమోదు చేయడమే ఇం దుకు కారణం. సెప్టెంబర్‌తో ముగిసిన తాజా త్రైమాసిక సానుకూల ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ వాటా 5.13 శాతం లాభపడి రూ. 1,766.95గా ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 5.22 శా తం లాభపడి రూ. 1,768గా ట్రేడైంది.

10/24/2019 - 23:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశంలో ఏ పండగలు వచ్చినా భారత మార్కెట్‌ను ముంచెత్తే చైనా ఉత్పత్తుల అమ్మకాలు ఈసారి దీపావళి సందర్భంగా దారుణంగా పడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో చైనా నుంచి దిగుమతి అయ్యే విగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యేవి. గణేషుడు, లక్ష్మి, దుర్గా, సరస్వతి, శివ తదితర దేవతామూర్తుల విగ్రహాలు చైనా నుంచే దిగుమతి అయ్యేవి. మార్కెట్‌లో ఒకప్పుడు సుమారు 80 శాతం వరకు ఈ ఉత్పత్తులే కనిపించేవి.

10/24/2019 - 05:16

న్యూఢిల్లీ: ఈ- సిగరెట్లను నిషేధిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అమ్మకాలు ఆగలేదు. ఆన్‌లైన్ అలాగే షాపుల్లోనూ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ-సిగరెట్లను నిషేధిస్తూ గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై వ్యాపారులు, వినియోగదారుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే తప్ప ఫలితం ఉండదని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.

10/23/2019 - 23:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఇండియన్ బ్యాంకు వాటాలు తాజా బుధవారం 13 శాతం అదనంగా లాభపడ్డాయి. తాజాగా వెలువడిన త్రైమాసిక ఫలితాల్లో ఈ కంపెనీ ద్విగుణీకృత లాభాలను నమోదు చేయడంతో ఆ ప్రభావం స్టాక్‌మార్కెట్లోని ఆ బ్యాంకు వాటాలకు సానుకూలంగా మారిం ది. ఈక్రమంలో బీఎస్‌ఈలో13.23 శాతం లాభపడిన వాటా ధర రూ. 142.90కు చేరిం ది. ఒక దశలో ఈవాటా 17.67 శాతం లాభపడి విలువ 148.50 రూపాయలకు చేరింది.

Pages