S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/30/2019 - 01:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం వాటి ఎగుమతిపై నిషేధం విధించింది. వ్యాపారులు తమ వద్ద ఉంచుకునే ఉల్లి నిల్వలపై పరిమితి విధించింది. ఈ రెండు చర్యల ద్వారా దేశంలో ఉల్లి లభ్యతను పెంచడంతో పాటు వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని కేంద్రం భావిస్తోంది.

09/29/2019 - 05:22

న్యూఢిల్లీ : ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తన ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) విక్రేతలకు కాలాతీతమయిన చెల్లింపులను అక్టోబర్ 15వ తేదీలోగా చెల్లించాలని శనివారం ఆదేశించింది. వృద్ధి రేటుకు ఊతమివ్వడానికి కృషి చేస్తున్నందున అందుకు అనుగుణంగా మూలధన వ్యయం కేటాయింపులను పెంచాలని పీఎస్‌యూలను ఆదేశించింది.

09/29/2019 - 02:29

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రైతు బజారులో రూ.25లకే కేజీ ఉల్లిపాయల అమ్మకాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉల్లి కొరత, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రైతు బజార్లలో రూ.25లకే కేజీ ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని రైతు బజారులో ఉల్లి విక్రయాలను మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా ప్రారంభించారు.

09/29/2019 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్య పరిశ్రమలకు మంచి రోజులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు అన్ని రకాలుగా ఆదుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఇండియా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఫోరం సదస్సును నిర్వహించింది.

09/28/2019 - 23:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ఆధారంగా నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు జారీ చేయడం ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులు సేకరించేందుకు వాటాదారుల ఆమోదం పొందినట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ శనివారం తెలిపింది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్..బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన పత్రాలలో ఈ విషయం వెల్లడించింది.

09/28/2019 - 23:24

తిరుపతి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిన కారణంగా దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

09/28/2019 - 23:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసింది. జాయింట్ వెంచర్ భాగస్వామి జపాన్‌కు చెందిన నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు రూ. 3,030 కోట్లకు 21.54 శాతం వాటాను విక్రయించినట్టు రిలయన్స్ క్యాపిటల్ ప్రకటించింది. ఆర్‌నామ్‌లో తనకు మిగి లిన రూ.

09/28/2019 - 22:59

హైదరాబాద్, సెప్టెంబర్ 28: పండుగలు వచ్చాయంటే రైల్వేకి కాసులే కాసులు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణీకులు క్యూలు కడతారు. దీన్ని రైల్వేశాఖ సొమ్ము చేసుకుంటోంది. దసరా రద్దీని సాకుగా తీసుకుని ఏపీలో ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే అమాంతంగా పెంచేసింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరను రూ. 10 నుంచి ఏకంగా రూ.30కి పెంచేసింది.

09/27/2019 - 22:09

ముంబయి, సెప్టెంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్యవారం చివరి రోజైన శుక్రవారం మళ్లీ నష్టాల్లోకి జారాయి. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు విఘాతం ఏలకడంతో ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడిందని విశే్లషకుల అంచనా. ఈక్రమంలో రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు చివరికి నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా లోహ, వాహన, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

09/27/2019 - 22:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బంగారం డాలర్లు, పెండెట్లు, నాణేల ఎగుమతిదారులకు ఇస్తున్న రాయితీలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే బంగారు నాణేలు, డాలర్ల తయారీకి అవసరమైన మెటీరియల్ దిగుమతిపై సైతం రాయితీలను సైతం ఉపసంహరించుకుంది.

Pages