S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/01/2019 - 06:40

ముంబయి : మదుపర్లు వాటాల విక్రయాలకు దిగడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించి ప్రతికూల వార్తలు వెలువడడంతో ఆందోళనకు గురైన మదుపర్లు ఈ రెండు రంగాల్లో అధికంగా వాటాల విక్రయాలకు పాల్పడ్డారు. ఈక్రమంలో బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 155.24 పాయింట్లు కోల్పోయి 0.40 శాతం నష్టాలతో 38,667.33 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది.

10/01/2019 - 06:36

విజయవాడ, సెప్టెంబర్ 30: దసరా పండుగ రద్దీ దృష్యా ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను 30 రూపాయలు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని జనం తమ తెలివితేటలతో తిప్పికొడుతున్నారు. పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లే బంధు మిత్రులకు వీడ్కోలు చేప్పేందుకు వచ్చే వారి రద్దీని తగ్గించే ఉద్దేశంతో కొన్నిరోజుల పాటు ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

10/01/2019 - 06:27

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఆ దుకాణాలకు సరఫరా చేసే మద్యంపై పన్ను విధింపు వ్యవహారంపై ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 3500 దుకాణాలకు సంబంధించి అద్దె, రవాణా, సిబ్బంది జీత భత్యాలు, తదితర నిర్వహణ ఖర్చులకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

10/01/2019 - 05:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం విధించిన కార్పొరేట్ పన్నుల కోత విద్యుత్ రంగాభివృద్ధికి దోహదం చేస్తుందని, అంతేకాకుండా ఏడాదికి రూ. 2,500 కోట్ల వంతున విద్యుత్ సరఫరా విభాగానికి ఆదా అవుతుందని సోమవారం నాడిక్కడ విడుదలైన ఇక్రా అధ్యయన నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఆదాయ పన్నులో 10శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.

10/01/2019 - 00:22

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో మంగళవారం నుంచి మద్య విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి, పని వేళలను కూడా తగ్గించింది. మద్య మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మద్యం దుకాణాల తగ్గింపుపై దృష్టి సారించింది.

09/30/2019 - 06:04

న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల నిర్ణయం, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ల స్థితిగతులను ప్రధానంగా నిర్దేశిస్తాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక అంతర్జాతీయంగా వాణిజ్య రంగంపై నెలకొన్న ప్రభావం సైతం మన మార్కెట్లపై కీలకంగా పనిచేస్తుందంటున్నారు. వచ్చే నెల 2న బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవుదినం.

09/30/2019 - 05:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా రిజర్వు బ్యాంకు నుంచి మధ్యంతర డివిడెండ్‌గా రూ. 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కోరనుందని విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.3 శాతం లోటుతో నెలకొన్న వృద్ధిరేటును గాడిలో పెట్టేందుకే ప్రభుత్వం ఈ మధ్యంతర డివెండెంట్ సమీకరణపై దృష్టి పెట్టిందని ఆ వర్గాలు తెలిపాయి.

09/30/2019 - 05:25

ముంబయి, సెప్టెంబర్ 29: వచ్చే శుక్రవారం జరిగే రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ విధాన సమీక్షా కమిటీ (ఎంపీసీ) సమావేశంలో మరోదఫా రెపోరేట్ల కోత జరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే వరుసగా ఐదోసారి ఈ రేట్ల కోత జరిగినట్టవుతుంది.

09/30/2019 - 05:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: గడచిన రెండు నెలల కాలంగా కేవలం వాటాల విక్రయాలకే పరిమితమైన విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత సెప్టెంబర్ మాసంలో మాత్రం మన దేశీయ మార్కెట్లలో నికర మదుపర్లుగా మారారు. మన ప్రధాన మార్కెట్లలోకి విదేశీయులు మొత్తం రూ.7,714 కోట్ల మొత్తాన్ని పెట్టుబడులుగా జొప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక ఉద్దీపన చర్యలు సత్ఫలితాలివ్వడమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

09/30/2019 - 04:31

కడప, సెప్టెంబర్ 29 : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రోజుకు 1,650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా 510 మెగావాట్లకు పడిపోయింది. బొగ్గు కొరత థర్మల్ కేంద్రాన్ని పట్టిపీడిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. థర్మల్ కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు ఒకొక్కటి 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి.

Pages