S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/13/2016 - 05:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: భారతీయ ఐపిఒ మార్కెట్‌కు 2016 సంవత్సరం రికార్డులు సృష్టించే సంవత్సరం కానుంది. ఇప్పటికే దాదాపు 50 కంపెనీలు 293 కోట్ల డాలర్ల నిధులను సమీకరించడం కోసం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించగా, రాబోయే రెండు నెలల కాలంలో మరిన్ని సంస్థలు ఐపిఒలతో రానున్నాయి. మరో 22 కంపెనీలు 2016 సంవత్సరంలో ఐపిఒలతో రానుండడంతో ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ఐపిఒల విలువ 580 కోట్ల డాలర్లకు చేరుకోనుంది.

10/13/2016 - 05:16

విశాఖపట్నం, అక్టోబర్ 12: వెనుక బడిన తరగతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత బ్యాంకర్లకు లబ్ధి చేకూరుస్తోంది. రుణాలిస్తాం అయితే కార్పొరేషన్లు, ఫెడరేషన్ల నుంచి వచ్చే సబ్సిడీలను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటూ షరతులు విధిస్తున్నారు. టిడిపి అధికారం చేపట్టిన తరువాత బిసిలను ఆకట్టుకునేందుకు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేసింది. బిసి కార్పొరేషన్‌తోపాటు పలు ఫెడరేషన్‌లను ఏర్పాటు చేసింది.

10/13/2016 - 05:15

కాకినాడ, అక్టోబర్ 12: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సాగర తీరాన్ని కాలుష్య రహిత జోన్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. 2017 సంక్రాంతి నాటికి బీచ్‌కు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నారు.

10/11/2016 - 00:51

హైదరాబాద్, అక్టోబర్ 10: అభివృద్ధి దిశగా పయనిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం దేశ, విదేశాల ఇనె్వస్టర్లను ఆకర్షిస్తున్న తరుణంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అవసరమైన పెట్టుబడులను అందించేం దుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్ తెలిపింది.

10/11/2016 - 00:48

సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బొప్పాసి కాయలో
దాదాపు 78 లక్షల రూపాయల విలువైన బంగారం బిస్కెట్లను తరలిస్తూ ఇద్దరు స్మగ్లర్లు అధికారులకు పట్టుబడ్డారు

10/11/2016 - 00:46

స్టాక్‌హోమ్ (స్వీడన్), అక్టోబర్ 10: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని వరించింది. బ్రిటిష్-అమెరికా ఆర్థికవేత్త ఆలివర్ హార్ట్, ఫిన్లాండ్‌కు చెందిన బెంట్ హామ్‌స్ట్రోమ్ సోమవారం ఈ అవార్డును గెలుచుకున్నారు. ‘కాంట్రాక్టు థియరీ’లో చేసిన కృషికి గాను వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ పురస్కార న్యాయ నిర్ణేతల మండలి ప్రకటించింది.

10/11/2016 - 00:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల సెప్టెంబర్‌లో 5.35 శాతం పెరిగాయి. 1,02,289 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు సోమవారం టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో టాటా మోటార్స్ లగ్జరీ కార్లు జాగ్వార్ లాండ్ రోడర్ (జెఎల్‌ఆర్) విక్రయాలు కూడా ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో 97,102 యూనిట్ల అమ్మకాలు జరిగాయని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది.

10/11/2016 - 00:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) వరుసగా రెండో నెలా నెగెటివ్ జోన్‌కే పరిమితమైంది. ఆగస్టులో -0.7 శాతంగా నమోదైంది. అయితే జూలైలో ఇది -2.5 శాతంగా ఉన్న నేపథ్యంలో ఆగస్టులో కొంత పురోగతి కనిపించినట్లైంది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల ఉత్పాదక రేటు జూలైలో పడిపోగా, ఆగస్టులోనూ ఈ రెండు రంగాలు కోలుకోలేదు. వీటికితోడు గనుల రంగంలోనూ ఉత్పత్తి మందగించింది.

10/11/2016 - 00:43

ఇస్లామాబాద్, అక్టోబర్ 10: కాశ్మీరు విషయంలో భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. కాశ్మీరులో జరుగుతున్నది ‘స్వాతంత్య్ర పోరాటమని’, దీనిని ఉగ్రవాదంతో ముడిపెడితే భారత్ ‘పొరపాటు’ చేసినట్టే అవుతుందని అన్నాడు. ఇస్లామాబాద్‌లో సోమవారం జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

10/11/2016 - 00:42

లాస్ ఏంజిలిస్, అక్టోబర్ 10: హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని పొందిన అమెరికా వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ వీరుడు ఆరోన్ ప్రియర్ (60) మృతి చెందాడు. ప్రపంచ జూనియర్ వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తర్వాత అమెరికాలో మహమ్మద్ అలీకి అసలైన వారసుడిగా పేరు సంపాదించిన ప్రియర్.. కెరీర్‌లో 40 బౌట్స్‌లో పాల్గొని, 39 విజయాలు సాధించాడు. వీటిలో 35 నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం.

Pages