S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/18/2016 - 04:48

న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్ 17: అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 25 శాతం పెరిగి 613.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 490.59 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఏకీకృత ఆదాయం ఈసారి 6,508.62 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,669.45 కోట్ల రూపాయలుగా ఉంది.

10/18/2016 - 04:45

ఒంగోలు, అక్టోబర్ 17: రాష్ట్రంలో వాహనదారులు ఇంటి వద్ద నుంచే రవాణా శాఖ సేవలు పొందేలా ఇ-ప్రగతిని అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం ఒంగోలులోని ఉడ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తిరుమల ఆటోమోటివ్ షోరూంలో ఇ-ప్రగతి, ప్రజల ముంగిట రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలు, డీలర్ల వద్ద వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

10/18/2016 - 04:44

ముంబయి, అక్టోబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాల్లో కదలాడినప్పటికీ, చివర్లో మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 143.63 పాయింట్లు కోల్పోయి 27,529.97 వద్ద స్థిరపడి 3 నెలలకుపైగా కనిష్ట స్థాయికి దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 63 పాయింట్లు పడిపోయి 8,520.40 వద్ద నిలిచింది.

10/18/2016 - 04:43

దేవరపల్లి, అక్టోబర్ 17: పొగాకు సాగుపై అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టు పద్ధతి ప్రతిపాదన తెరపైకి వస్తోందని కేంద్ర పొగాకు బోర్డు వేలం నిర్వాహకుడు బిఎన్ మిత్రా తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో పొగాకు ఉత్పత్తిని కాంట్రాక్టు పద్ధతిలో చేసేందుకు కొన్ని దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారన్నారు.

10/18/2016 - 04:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ ట్విట్టర్ ఖాతా సోమవారం హ్యాకింగ్‌కు గురైంది. గుర్తుతెలియని కొందరు హ్యాకర్లు.. సుబ్రమణ్యన్ ట్విటర్ ఖాతా నుంచి కొన్ని అసభ్యకర కామెంట్లు చేశారు. అయితే ఖాతాను తిరిగి పునఃప్రారంభించగా, అందులోని అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించారు. ‘నా ట్విట్టర్ ఖాతాను హ్యాకింగ్ చేశారు.

10/18/2016 - 04:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిల భారత వాణిజ్య పన్నుల శాఖ అధికారుల, ఉద్యోగుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

10/18/2016 - 04:41

విశాఖపట్నం, అక్టోబర్ 17: రాష్ట్ర విభజన తరువాత కేంద్రం.. ఏపికి కేటాయించిన, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో భాగంగా మంజూరైన పెట్రోలియం యూనివర్శిటీని విశాఖలో నెలకొల్పనున్నారు. విశాఖకు సమీపంలోని సబ్బవరం దగ్గర సుమారు 300 ఎకరాల్లో యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయనున్నారు.

10/17/2016 - 00:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: మలేషియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా.. తమ విమానాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను నిషేధించింది. భద్రతా కారణాల దృష్ట్యా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను విమానాల్లోకి అనుమతించడం లేదంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రీకాల్ చేసినవైనా, మార్చుకున్నవైనా వ్యక్తుల వద్దగానీ, క్యాబిన్ బ్యాగుల్లో, కార్గోలోగానీ నోట్ 7లను ఉంచబోమంది.

10/17/2016 - 00:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: రోజుకు 550 ఉద్యోగాలు పోతున్నాయని మీకు తెలుసా? గత నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అంటే మీరు నమ్మగలరా? ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగావకాశాలు చేజారుతాయని ఊహించగలరా?.. వినడానికి ఒకింత ఆశ్చర్యకరంగా, మరింత ఆందోళనకరంగా ఉన్నా.. ఇదంతా నిజమని చెప్పక తప్పదు. మరో మూడున్నర దశాబ్దాల్లో నిరుద్యోగం భారత భావి పౌరులను వేధిస్తుందన్నది ముమ్మాటికి నిజం మరి.

10/17/2016 - 00:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఐరోపాకు చెందిన మూడో అతిపెద్ద చమురు సంస్థ బ్రిటీష్ పెట్రోలియంకు దేశవ్యాప్తంగా 3,500 పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సును మంజూరు చేసింది. దీంతో భారత్‌లో పెట్రోల్ పంపుల నిర్వహణ సంస్థల సంఖ్య పదికి చేరింది.

Pages