S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/14/2016 - 01:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: రిటైల్ ద్రవ్యోలబణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టస్థాయి అయిన 4.31 శాతానికి పడిపోయింది. ప్రధానంగా సామాన్యుడినుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ నిత్యావసర వస్తువుల్లో ఒకటైన కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం. ఫలితంగా ఆగస్టు నెలలో 5.05 శాతంగా ఉండిన ద్రవ్యోల్బణం 0.74 శాతం తగ్గింది.

10/14/2016 - 02:55

ముంబయి, అక్టోబర్ 13: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలతో పాటుగా చైనా వృద్ధి వేగం మందగించడం లాంటి పలు అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. దీనికి తోడు గురువారం సాయత్రం రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ప్రకటించనుండడంతో మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంనుంచే నష్టాల్లో కొనసాగాయి.

10/14/2016 - 00:57

భీమవరం, అక్టోబర్ 13: దక్షిణ భారతదేశంలో ఎంతో ఖ్యాతిని ఆర్జించిన అంజనీ గ్రూపు సంస్థ, ఉత్తర భారత దేశంలో ప్రాచుర్యం పొందిన సెరా శానిటరీ లిమిటెడ్‌తో సంయుక్తంగా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో టైల్స్ ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. అంజనీ గ్రూపునకు చెందిన కెవి విష్ణురాజును సెరా శానిటరీ లిమిటెడ్ ఛైర్మన్‌గా ప్రకటించింది.

10/14/2016 - 00:55

ముంబయి, అక్టోబర్ 13: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ అంచనాలను మంచి లాభాలను ఆర్జించింది. గురువారం సాయంత్రం టిసిఎస్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆ సంస్థ నికర లాభం అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 8.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.

10/14/2016 - 00:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రపంచ వాణిజ్యంలో వర్థమాన దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు పనే్నతర అవరోధాలను తొలగించుకోవడంతో పాటు ఇ-కామర్స్ రంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్య మంత్రులు ఉద్ఘాటించారు.

10/14/2016 - 00:52

హైదరాబాద్, అక్టోబర్ 13: భారతదేశపు ఇన్నోవేటివ్ టెలికామ్ ప్లేయర్‌లో ఒకరైన ఎయిర్ సెల్ డాటా వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తున్నట్లు ఆ సంస్ధ ఏపి తెలంగాణ సర్కిల్ హెడ్ వెంకటేశన్ తెలిపారు. ప్రస్తుత, నూతన వినియోగదారులకు కేవలం 36 రూపాయలకే ఒక జిబి డాటాను వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నటుల్చెప్పారు. ఈ పండగ సీజన్‌లో ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు.

10/14/2016 - 00:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దీపావళి పండగ సీజన్‌తో పాటుగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడంతో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పెరగడంతో గురువారం ఒక్కరోజే బంగారం ధర పది గ్రాములకు 250 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

10/14/2016 - 00:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రభుత్వ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో బాండ్లను జారీ చేయడం ద్వారా రానున్న ఏడాది కాలంలో 4,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు వాటాదారుల నుంచి అనుమతి పొందింది.

10/13/2016 - 05:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: స్టాక్స్‌పై పెట్టుబడుల కంటే బంగారం, వెండిపై పెట్టిన పెట్టుబడులే మదుపరులకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పసిడి, వెండి పెట్టుబడులు మదుపరులకు 28 శాతం వరకు లాభాలను తెస్తే, స్టాక్స్‌పై పెట్టిన పెట్టుబడుల లాభాలు 8 శాతానికే పరిమితమయ్యాయి మరి. పుత్తడి ధర ఈ ఏడాది ఆరంభం నుంచి అక్టోబర్ 10 వరకు గమనిస్తే 19.77 శాతం పెరిగింది.

10/13/2016 - 05:17

లండన్, అక్టోబర్ 12: పదహారవ శతాబ్దానికి చెందిన అరుదైన ఇజ్నిక్ పింగాణీ ఫలకం ఒకటి లండన్‌లోని బోన్‌హామ్స్ సంస్థ ఈ నెల 18న వేలం వేయనున్న ఇస్లామిక్, భారతీయ కళాఖండాల్లో ఉంది.

Pages