S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/09/2016 - 02:03

హైదరాబాద్, అక్టోబర్ 8: కార్మికుల సమష్టి కృషితో సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తోందని, ఇదే స్ఫూర్తితో సంస్థను ప్రగతిపథంలో నడుపుదామని సింగరేణి (కోల్ మూవ్‌మెంట్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) సింగరేణికి వచ్చిన 1066.13 కోట్ల రూపాయల నికర లాభాల్లో 23 శాతాన్ని వాటాగా ఉద్యోగులకు చెల్లించామని ఆయన తెలిపారు.

10/09/2016 - 02:02

హైదరాబాద్, అక్టోబర్ 8: ఉల్లి పండించే రైతు కళ్లలో కన్నీరు రాకుండా చూడాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. నిరుడు కన్నా ఉల్లి అధిక దిగుబడి రావడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, అయతే రైతులు నష్టపోకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

10/09/2016 - 02:00

గాజువాక/ఖైరతాబాద్ (హైదరాబాద్), అక్టోబర్ 8: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం తాజ్‌కృష్ణలో జరిగిన కార్యక్రమంలో బాడ్మింటన్ స్టార్ సింధుతో వైజాగ్ స్టీల్ కార్పొరేట్ సంస్థ అయన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.

10/09/2016 - 01:57

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో అమరావతితోపాటు ఇతర పట్టణాల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైటర్ రియల్టీ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఈ అంశంపై చర్చించారు.

10/09/2016 - 01:55

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో రానున్న రోజుల్లో నూతన హైబ్రిడ్ విధానంలో పవన, సౌర విద్యుదుత్పత్తి చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోనున్నట్టు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో చైనాకు చెందిన స్పిక్ (స్టేట్ పవర్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్), సానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు.

10/08/2016 - 02:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రస్తుత పండగ సీజన్‌లో పసిడి, వెండి ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. నానాటికి తగ్గుముఖం పడుతుండగా, గడచిన వారం రోజుల్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 1,205 రూపాయలు దిగజారితే, కిలో వెండి ధర 3,570 రూపాయలు క్షీణించింది. శుక్రవారం కూడా పుత్తడి ధర 170 రూపాయలు కోల్పోగా, వెండి ధర 920 రూపాయలు పడిపోయింది.

10/08/2016 - 02:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ డిసెంబర్ 31 వరకు ఉచిత 4జి సేవలతో ఇప్పటికే దేశీయ టెలికామ్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన జియో.. ఇప్పుడు ఐఫోన్ నూతన వినియోగదారులకు ఏకంగా 15 నెలలపాటు ఉచిత సేవలను అందిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ మొబైల్ ఫోన్లు శుక్రవారం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి.

10/08/2016 - 02:32

గుంటూరు, అక్టోబర్ 7: ఈ ఏడాది ఆర్థిక లోటు అంచనాలకు మూడింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 లో ఆర్థిక లోటు 4,858 కోట్ల రూపాయలుగా ఉంటుందని ప్రభు త్వం అంచనా వేసింది. అయితే అంచనాలు తారుమారై 13,673 కోట్ల రూపాయలకు చేరుకోనుంది.

10/08/2016 - 02:31

హైదరాబాద్, అక్టోబర్ 7: వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్లు, 8 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, విద్యుత్ శాఖ మంత్రి ఎ అచ్చెం నాయుడు తెలిపారు.

10/08/2016 - 02:28

హైదరాబాద్/కొత్తగూడెం, అక్టోబర్ 7: సింగరేణి కాలరీస్ సంస్థకు నిరుడు 1,066.13 కోట్ల రూపాయల నికర లాభాలు వచ్చినందువల్ల కార్మికులకు 560 కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటించామని ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం తెలిపారు. నిరుడు 21 శాతం బోనస్ చెల్లించామని, ఈ ఏడాది 23 శాతాన్ని చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో కార్మికుడికి రూ. 54 వేల వరకు బోనస్ లభిస్తుందన్నారు.

Pages