S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/16/2016 - 06:49

కాకినాడ, అక్టోబర్ 15: మామిడి తాండ్ర తయారీదారులను ప్రోత్సహించి, పెద్ద ఎత్తున మామిడి తాండ్రను ఉత్పత్తి చేసి, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మామిడి తాండ్ర తయారీలో ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అగ్ర స్థానంలో ఉంది. జిల్లాలో పలు గ్రామాల్లో మామిడి తాండ్ర కుటీర పరిశ్రమలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.

10/16/2016 - 06:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: మహీంద్ర రిటైల్ పర్యవేక్షణలోని ఫ్రాంచైజీ వ్యాపారాన్ని బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలోని కిడ్స్‌కేర్ విభాగం ఫస్ట్‌క్రై కొనుగోలు చేస్తోంది. వ్యాపార ఏకీకృత ఒప్పందంలో భాగంగా 362.1 కోట్ల రూపాయలకు మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్‌నకు చెందిన ఆన్‌లైన్ మెటర్నిటి, చైల్డ్‌కేర్ బ్రాండైన ‘బేబీఓయ్’ను ఫస్ట్‌క్రై హస్తగతం చేసుకుంటోంది.

10/15/2016 - 07:21

విశాఖపట్నం, అక్టోబర్ 14: విశాఖ జిల్లా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రపంచ దేశాలకు దీని రుచి చూపిస్తోంది. ఇటలీ, దుబాయి దేశాలకు కాఫీ గింజలను ఎగుమతి చేస్తున్నారు. రెండు ప్రధానమైన లక్ష్యాలతో పనిచేస్తున్న జిసిసి...

10/15/2016 - 07:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రస్తుతమున్న సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచానికి ‘ఆశాదీపం’ భారత దేశమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త వౌరిస్ అబ్స్‌ఫెల్డ్ కితాబిచ్చారు. అయితే ఆర్థికంగా భారత్ ఎంత పురోగతి సాధించినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు ఇప్పటికీ పెను సవాలుగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

10/15/2016 - 07:06

అగ్వాడా (గోవా), అక్టోబర్ 14: దేశంలో వాతావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోందని, కనుక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత ఇతర ఉత్పత్తులపై వసూలు చేసే పన్ను కంటే పర్యావరణానికి మేలు చేయని కాలుష్య కారక ఉత్పత్తులపై వసూలు చేసే పన్ను ఎక్కువగా ఉండవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

10/15/2016 - 07:05

ముంబయి, అక్టోబర్ 14: ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాల కారణంగా గురువారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ల కారణంగా సెనె్సక్స్ తిరిగి పుంజుకుని 30 పాయింట్ల లాభంతో ముగిసింది.

10/15/2016 - 07:05

న్యూయార్క్, అక్టోబర్ 14: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం నుంచి హాంకాగ్ వరకు సముద్ర అంతర్భాగంలో దాదాపు 8 వేల కిలోమీటర్ల పొడవైన సూపర్ హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్ కలసికట్టుగా కృషి చేస్తున్నాయి.

10/15/2016 - 07:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఆగస్టులో 3.74 శాతంగా ఉండిన టోకు ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో .57 శాతానికి తగ్గింది. ఆహార సరకులతో పాటుగా, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం మైనస్ 4.59 శాతంగా ఉండిన విషయం తెలిసిందే.

10/15/2016 - 07:04

బెంగళూరు, అక్టోబర్ 14: దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటి సంస్థ అయిన ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 6.1 శాతం, నికర రాబడి 3 శాతం పెరిగినప్పటికీ ఏడాది అమ్మకాల వృద్ధి అంచనాలను మరోసారి తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం షేరు మార్కెట్లో ఆ కంపెనీ షేరు 2 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.

10/14/2016 - 01:03

ముంబయి, అక్టోబర్ 13: ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని పెంపొందించి దేశంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం విధానపరమైన తోడ్పాటును అందిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం భరోసా ఇచ్చారు.

Pages