S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/16/2016 - 00:40

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే స్టాక్ మార్కెట్ షేర్లపై పెట్టిన పెట్టుబడుల కంటే వెండి, బంగారంపై పెట్టిన పెట్టుబడులకే మదుపరులు అధిక లాభాలను అందుకున్నారు. బంగారం ధర 22.29 శాతం పెరిగితే, వెండి ధర 40.69 శాతం పెరిగింది మరి. ఇదే వ్యవధిలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి సెనె్సక్స్ కేవలం 7.79 శాతం మాత్రమే పుంజుకుంది.

08/16/2016 - 06:01

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని 6 శాతాన్ని మించనివ్వబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి నూతన లక్ష్యాన్ని 4 శాతంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పేదవాడి కంచాన్ని ఖరీదు కానివ్వబోమని చారిత్రక ఎర్రకోట సాక్షిగా మోదీ హామీ ఇచ్చారు.

08/16/2016 - 00:37

కాకినాడ, ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్) ఓ వరంగా మారింది. ఇక్కడి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకున్న పక్షంలో ఆంధ్రప్రదేశ్ నిజంగానే స్వర్ణాంధ్రగా మారే అవకాశాలున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

08/16/2016 - 06:01

కొత్తగూడెం, ఆగస్టు 15: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్.. చరిత్రలోనే అపూర్వ ఘట్టమని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ అన్నారు. 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సోమవారం కంపెనీ స్థాయి స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

08/16/2016 - 00:32

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ద్రవ్యోల్బణం గణాంకాలు, వర్ష సమాచారం ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

08/16/2016 - 00:30

విశాఖపట్నం, ఆగస్టు 15: కోస్తా తీరంలో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కాకినాడ-విశాఖల మధ్య ఏర్పాటు చేయనున్న సీ క్రూయిజ్(పర్యాటక ప్రాంతాలను చూపించే ప్రత్యేక నౌక) ప్రారంభానికి నోచుకోలేదు. విశాఖలో నౌకను నిలిపి ఉంచేందుకు కేటాయించిన జెట్టీ వివాదంలో చిక్కుకోవడంతో సీ క్రూయిజ్ ముందుకు సాగడం లేదు.

08/16/2016 - 00:28

విజయవాడ, ఆగస్టు 15: విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో చైనా నిర్మాణ రంగ మెటీరియల్ కంపెనీల బృందం సమావేశమైంది.

08/16/2016 - 00:28

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్య విధానాన్ని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రశంసించింది. ఆయన నిర్ణయాలను ఇకముందూ ఆర్‌బిఐ తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ దిగిపోతున్నది తెలిసిందే.

08/15/2016 - 07:52

న్యూఢిల్లీ, ఆగస్టు 14: విదేశీ మదుపరులు ఈ నెల ప్రథమార్ధంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 5,400 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు.

08/15/2016 - 07:49

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఇపిఎఫ్‌ఒ.. త్వరలో తమ 4 కోట్ల ఖాతాదారుల సొంతింటి కలను సాకరం చేసే అవకాశం కనిపిస్తోంది. చౌక ధరల గృహాలను కొనుగోలు చేయడానికి తమ ప్రావిడెంట్ ఫండ్‌ను తాకట్టు పెట్టే వీలును ఖాతాదారులకు కల్పించాలని ఇపిఎఫ్‌ఒ యోచిస్తున్నది తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పథకాన్ని త్వరలో అమల్లోకి తేవాలని ఇపిఎఫ్‌ఒ భావిస్తోంది.

Pages