S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/07/2019 - 00:35

నందిపేట్, జనవరి 19: తెలంగాణాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ వెల్లడించారు.

09/06/2019 - 23:49

ఫరీదాబాద్‌లో శుక్రవారం ఇండస్ట్రీస్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తున్న
కేంద్ర మంత్రి స్మతి ఇరానీ. కేంద్ర మంత్రి విపుల్ గోయల్ కూడా చిత్రంలో ఉన్నారు.

09/06/2019 - 23:46

న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యయాల
కార్యదర్శి జీసీ ముర్మూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సీపీఎస్‌సీ, వౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రతినిధులు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులతోపాటు దీనికి సంబంధించిన పలు అంశాలను ఈ ప్రతినిధుల బృందం చర్చించింది. నివేదికను త్వరలోనే కేంద్రానికి అందజేయనుంది.

09/06/2019 - 23:43

ముంబయి, సెప్టెంబర్ 6: ఎయిర్ ఇండియాకు తాత్కాలిక ఊరట లభించింది. సకాలంలో బకాయిలు చెల్లించని కారణంగా ఏయిర్ ఇండియాకు హైదరాబాద్, రాయపూర్ నగరాల్లో ఇంధన సరఫరాను నిలిపి వేయాలన్న ప్రతిపాదనపై ఆయిల్ సప్లయి కంపెనీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో ఇంధన సరఫరా నిలిపి వేత నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది.

09/06/2019 - 23:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలని ఆటో ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని జీఎస్‌టీ మండలిలో భాగమయిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఆ ఇండస్ట్రీకి సూచించారు.

09/06/2019 - 23:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశం నుంచి తగ్గిన ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే రత్నాలు, ఆభరణాలు సహా కొన్ని రంగాలకు సంబంధించి చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ చర్యలకు సంబంధించి కేంద్ర ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపాయని అధికార వర్గాలు తెలిపాయి.

09/06/2019 - 23:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మహారాష్టల్రో రోడ్ల ఆధునీకరణ ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) 200 మిలియన్ డాలర్ల (సుమారు 1,400 కోట్ల రూపాయలు) సాయాన్ని అందించనున్నది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏడీబీ శుక్రవారం ఒక ఒప్పందానికి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 34 జిల్లాల్లో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు.

09/06/2019 - 23:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత స్టాక్ మార్కెట్‌లో ఆటో రంగం దూకుడు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన లావాదేవీల్లో ఆటో రంగ కంపెనీలకు చెందిన షేర్లు సుమారుగా 4.3 శాతం లాభపడ్డాయి. ఆటో రంగానికి జీఎస్‌టీ రేటును తగ్గించాల న్న డిమాండ్‌కు కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతు ప్రకటించడంతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

09/06/2019 - 23:36

ముంబయి, సెప్టెంబర్ 6: మహారాష్ట్ర ప్రభుత్వం నూతన ‘సాంస్కృతిక పర్యాటకం’ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా పురావస్తు శాఖ పరిధిలోకి ఇంతవరకు రాని అనేక కోటలను అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది.

09/06/2019 - 23:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కార్పొరేట్ మోసాలు రోజు రోజుకూ పెరగడం వివిధ చట్టాలకు సవాలుగా మారిందని కేంద్ర సహకార, ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు పెచ్చరిల్లుతున్నాయని అన్నారు. దీంతో చాలా చట్టాలకు ఎలాంటి విలువ లేకుండా పోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Pages