S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/31/2019 - 00:02

బ్యాంకింగ్ రంగంలో మరో బిగ్ బ్యాంగ్ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యంగా మరో అడుగు ముందుకేసింది. ఎస్‌బీఐలో ఐదు బ్యాంకులను విలీనం చేసిన కేంద్రం ఇప్పుడు మరి కొన్ని బ్యాంకులను సంఘటితం చేసింది. తాజా విలీన ప్రక్రియతో బ్యాంకింగ్ రంగం మరింత చేవను సంతరించుకుంది. మొత్తం జాతీయ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గాయి.

08/31/2019 - 00:00

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఇటు తయారీ రంగంలోనూ.. అటు వ్యవసాయ రంగంలోనూ నెలకొన్న మాంద్య పరిస్థితుల ప్రభావం స్థూల జాతీయోత్పత్తిపై తీవ్రంగా పడింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఐదు శాతం దిగువకు చేరుకొంది. ఈమేరకు ప్రభుత్వం అధికారిక వివరాలను శుక్రవారం వెల్లడించింది.

08/30/2019 - 23:18

ముంబయి, ఆగస్టు 30: బ్యాంకుల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు చివరి గంటల్లో ఊపందుకున్నాయి. అంతేకాకుండా రూపాయి మారకం విలువ సైతం మెరుగవడం మార్కెట్లకు ఊతమిచ్చింది.

08/30/2019 - 23:18

న్యూఢిల్లీ, ఆగస్టు 30: గడచిన జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక లోటు రూ. 5.47 లక్షల కోట్లకు చేరింది. 2019-20 వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఇది 77.8 శాతం. వాస్తవానికి జూలై మాసాంతానికి వార్షిక లోటు లేదా వ్యయానికి, ఆదాయానికి మధ్య తేడా రూ. 5,47.605 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (ఓసీజీ) శుక్రవారం ఇక్కడ ఈమేరకు గణాంకాలను విడుదల చేసింది.

08/30/2019 - 23:17

న్యూఢిల్లీ, ఆగస్టు 30: శీఘ్ర విక్రయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ) రంగ దిగ్గజం ‘డాబర్ ఇండియా’ సమకాలీన ఆయుర్వేద ఔషధాలతోబాటు సంప్రదాయ ఔషధాల తయారీపై దృష్టి సారించింది. అభివృద్ధి వ్యూహంలో భాగంగా సంప్రదాయ దృక్పథంతో కూడిన ఔషధాలను ప్రవేశపెట్టేందుకు పరిశోధనాత్మకంగా ముందడుగు వేస్తున్నట్టు ఆ కంపెనీ కొత్త చైర్మన్ అమిత్ బర్మన్ నాడిక్కడ తెలిపారు.

08/30/2019 - 23:17

ముంబయి, ఆగస్టు 30: వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణం దేశ ఆర్థికాభివృద్ధికి బాటలువేసే అవకాశాలు లేవని ఆదివారం ఇక్కడ విడుదలైన ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘్ఫట్చ్’లో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంతర్భాగం.

08/30/2019 - 22:46

హైదరాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో 150 ఎకరాల విస్తీర్ణంలో విత్తన పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా తెలంగాణ నుంచి విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న విత్తన పార్క్‌ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు.

08/30/2019 - 05:03

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులను ఆకర్షించేందుకు రైల్వే కోచ్‌లను ఆధునిక పద్ధతిలో శుభ్రపర్చడానికి ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ని రైల్వే జీఎం గజానన్ ప్రారంభించారు. ఇకపై స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే రైళ్ళ కోచ్‌లు పరిశుభ్రంగా మెరిసే విధంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మీదకు వస్తాయని రైల్వే జీఎం అన్నారు.

08/30/2019 - 04:34

విజయవాడ: రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి 500 మద్యం దుకాణాలను ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మిగిలిన 3000 దుకాణాలను అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయంలో కొత్త మద్యం పాలసీ అమలు తదితర అంశాలపై అధికారులతో గురువారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు.

08/30/2019 - 04:20

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలోని మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఇక నుంచి ఎక్కువ బరువు ఉన్న బ్యాగులను కూడా తీసికెళ్లవచ్చు. ప్రయాణికులు తీసికెళ్లే వస్తువుల బ్యాగు బరువు పరిమితిని 15 కిలో గ్రాముల నుంచి 25 కిలో గ్రాములకు పెంచారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 27న జారీ చేసిన నియమాల ప్రకారం, మెట్రో రైళ్లలో ఒక ప్రయాణికుడు 25 కిలోల బరువు వరకు ఉన్న ఒక బ్యాగును తీసికెళ్లవచ్చు.

Pages