S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/12/2019 - 03:23

గౌహటి, సెప్టెంబర్ 11: ఓఎన్‌జీసీ నేతృత్వంలో అస్సాంలో చమురు, సహజవాయువుల అనే్వషణ (ఎక్స్‌ప్లోరింగ్) విస్తృత స్ధాయిలో జరుగనుంది. ఈ క్రమంలో రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 13వేల కోట్ల పెట్టుబడితో 220 బావుల తవ్వకాన్ని నిర్వహించనున్నట్టు బుధవారం నాడిక్కడ ఆ కం పెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించి అస్సాం ప్రభుత్వంతో మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు తెలిపింది.

09/11/2019 - 23:18

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: కేంద్రానికి పన్ను బకాయిపడిన వ్యాపార సంస్థలకు సదవకాశం కల్పించినట్టు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ డీకే శ్రీనివాస్ తెలిపారు. పన్ను బకాయిదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా చెల్లించాలని సూచించారు. విశాఖలోని పోర్టు ఆవరణలో ఉన్న జీఎస్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

09/11/2019 - 04:25

చెన్నై : రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు ఇక్కడ అన్నారు. ఒకపక్క దేశీయంగానూ అంతర్జాతీయంగానూ ఆర్థిక మాంద్య పరిస్థితులు తీవ్రమవుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్య సాధన దిశగా కేంద్రం బలంగానే ముందుకు వెళ్తోందని ఆమె అన్నారు.

09/11/2019 - 02:30

అమరావతి, సెప్టెంబర్ 10: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సింగపూర్ కన్సార్టియంలు దూరం కావాలని నిర్ణయించడం, ఇతర ప్రాంతాలకు తరలించే యోచనపై జరుగుతున్న ప్రచారంతో అమరావతిలో భూముల ధరలు కుదలయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో సుప్రసిద్ధ సంస్థలు అమరావతిపై దృష్టి కేంద్రీకరించాయి. పెట్టుబడులకు గత ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.

09/11/2019 - 02:10

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోద, స్వీయ ధ్రువపత్ర విధాన చట్టం 2014 (టీఎస్‌ఐపాస్)కు విశేష స్పందన లభించింది. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణకు వెల్లువెత్తాయి. టీఎస్‌ఐపాస్ పారిశ్రామిక అనుకూల విధానాలను కలిగి ఉండడమే కారణమని సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2019 ప్రకటించింది.

09/10/2019 - 23:18

విజయవాడ, సెప్టెంబర్ 10: రానున్న దసరా, వారాంతపు సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు మామూలుగా నడిపే రెగ్యులర్ బస్సులకు అదనంగా 1377 ప్రత్యేక బస్సులు నడుపనున్నామని, ఆపరేషన్స్ ఈడీ కేవీఆర్‌కే ప్రసాద్ తెలిపారు. వాస్తవానికి గత ఏడాది 1196 ప్రత్యేక బస్సులు మాత్రమే నడిపారు.

09/10/2019 - 22:49

చిత్రం...సరికొత్త పోర్చ్ టైకాన్ ఎలక్ట్రిక్ కారు గురించి ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ ఆటో షో సందర్భంగా వివరిస్తున్న జర్మనీకి చెందిన పోర్చ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆలివర్ బ్లూమ్

09/10/2019 - 22:47

ముంబయి, సెప్టెంబర్ 10: గడచిన ఆగస్టు మాసంలో వెంచర్ పెట్టుబడుల్లో 4.4 బిలియన్ డాలర్ల మేర లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 39 శాతం అధికం. అయితే జూలైతో పోల్చుకుంటే ఇందులో 47 శాతం తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ కనె్సల్టెన్సీ సంస్థ 3ఈఏ అండ్ ఐవీసీఏ2 మంగళవారం నాడిక్కడ విడుల చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది.

09/10/2019 - 22:45

ముంబయి, సెప్టెంబర్ 10: అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ ఉద్యోగులపై ఉన్నతాధికారులు (బాస్‌లు) ప్రేమానుక్తులతో మెలుగుతున్నప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం అధిక శాతం మంది తమ బాస్‌లు నిర్వర్తించే విధులను తామే అంతకంటే మిన్నగా చేయగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. మహిళా ఉద్యోగుల్లో 73 శాతం, పురుష ఉద్యోగుల్లో 70 శాతం మంది ఈ రకమైన నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.

09/10/2019 - 22:44

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థికాభివృద్ధి రేటును 6.6 శాతానికి కుదిస్తూ మంగళవారం ‘్ఫచ్ రేటింగ్స్’ నివేదిక వెలువరించింది. గత ఏడాది ఈ వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంది. గతి తప్పిన ఆర్థిక వృద్ధిరేటును గాడిన పెట్టేలా వార్షిక ఆర్థిక విధాన సరళీకరణకు ప్రభుత్వం వద్ద పరిమితమైన అవకాశాలే ఉన్నాయని, కారణం అధిక అప్పుల భారమేనని పేర్కొంది.

Pages