S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/10/2019 - 04:27

ముంబయి : వారారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్థికాభివృద్ధి అవరోధాలను అధిగమిస్తామన్న భరోసాను ప్రభుత్వం కల్పించడంతో మదుపర్ల వైఖరిలో మార్పు వచ్చింది. పైనాన్షియల్, వాహన కౌంటర్లలో వాటాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు నష్టాల బాటలో గమ్యగోచరంగా ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం నుంచి గాడినపడ్డాయి.

09/09/2019 - 23:43

కోచ్చి, సెప్టెంబర్ 9: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)ను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పునరుద్ధరిస్తామని కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోమవారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

09/09/2019 - 23:40

ముంబయి, సెప్టెంబర్ 9: వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన విదేశాల్లోని చమురు, సహజవాయువుల ఆస్తులను విక్రయించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం నాడిక్కడ ఆదేశించింది.

09/09/2019 - 23:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: గడచిన ఆగస్టు మాసంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల వౌలిక విలువ రూ. 25.47 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఏడాది ఇదే నెలతో పోలిస్తే తాజాగా 4 శాతం వృద్ధి నెలకొంది. ఈక్విటీ, ద్రవ్య పథకాల్లోకి అత్యధికంగా వచ్చిన నిధుల కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 44 కంపెనీలున్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ గత జూలై అంతానికి ఆస్తుల విలువ రూ.

09/09/2019 - 04:56

న్యూఢిల్లీ : పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా విలీనం చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తికావచ్చింది. ఇలా బలోపేతం కావడం వల్ల సరికొత్త భారతావని అవసరాలకు అనుగుణంగా ఆ బ్యాంకులు పనిచేసేందుకు వీలుంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు.

09/09/2019 - 04:28

శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో మద్యనిషేధం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విజయభాస్కరెడ్డి హయాంలో సారాతో మొదలైంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఐఎంఎఫ్‌ఎల్‌కు బ్యాన్‌పెట్టి హెల్త్ పర్మిట్లకు మాత్రం కొంచెం సడలింపునివ్వగా, మామను మించిన అల్లుడు ఆపాటి వెసులుబాటునూ బంద్ చేశారు.

09/09/2019 - 01:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కనీసం 11 నిరర్ధక ఆస్తుల విక్రయాన్ని చేపట్టింది. తద్వారా సుమారు రూ. 1,234 కోట్ల రుణ బకారుూల్లో అధిక శాతం వసూలు చేయాలని తలపెట్టింది. ఈక్రమంలో ఆ బ్యాంకు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీలు), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది.

09/09/2019 - 01:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మన దేశ ప్రధాన మా ర్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌పోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) వాటాల ఉపసంహరణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనెల తొలి వారంలోనే మొత్తం రూ. 1,263 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం జరిగింది. కేంద్రం ఉద్దీపన చర్యలు చేపట్టినా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో ఎఫ్‌పీఐలు లాభాల స్వీకరణపై మొగ్గుచూపారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

09/09/2019 - 01:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: గనుల రంగంలో ప్రస్తుతం ఉపాధి లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని భారత ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఐఎంఐ) ఆదివారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఈ విషయంపై చొరవ తీసుకుని మరిన్ని సంస్కరణలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. నిజానికి ఈ రంగానికి కనీసం ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఉందని సమాఖ్య పేర్కొంది.

09/07/2019 - 23:17

రాయ్‌పూర్, సెప్టెంబర్ 7: చత్తీస్‌గఢ్‌లో పరిశ్రమల స్థాపనకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల కేటాయింపుల ధరలు 30 శాతం తగ్గించనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు.

Pages