S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/30/2019 - 04:16

నాగార్జునసాగర్, ఆగస్టు 29: నాగార్జునసాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గత నాలుగు, ఐదు రోజులుగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ సందర్భంగా జెన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు ఇంకా నిర్ణయించనందున గత నాలుగు రోజుల నుండి ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశామన్నారు.

08/30/2019 - 02:09

విజయవాడ (సిటీ), ఆగస్టు 29: వందల కోట్ల రూపాయల వ్యయం.. అందులోనూ ప్రభాస్ నటిస్తున్న సినిమా.. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, భారీ అంచనాల నడుమ వస్తున్న సాహో సినీ మానియా ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన తరువాత అదే హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో సినిమా చూడాలంటే టిక్కెట్ కోసం సాహసం చేయాల్సిందే. గంటలకొద్దీ క్యూలైన్లో నిలుచోవాలి.

08/30/2019 - 01:40

న్యూఢిల్లీ: పసిడి ధరల రికార్డుల మోత సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 250 పెరిగి ఏకంగా రూ. 40 వేల మార్కును అధిగమించింది. మొత్తం ధర రూ. 40,220కి చేరింది. దేశ బులియన్ మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా నమోదైంది.

08/29/2019 - 23:55

ముంబయి, ఆగస్టు 29: పాలను మరింత చిక్కగా తయారు చేసి సరఫరా చేసేందుకు తామేమీ వ్యతిరే కం కాదని, అదే సమయంలో స్వచ్ఛతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య (జీసీఎంఎంఎఫ్) గురువారం నాడిక్కడ పేర్కొంది. ఈ సమాఖ్య నేతృత్వంలో అముల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి.

08/29/2019 - 23:37

ముంబయి, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజైన గురువారం సైతం నష్టాల బాట పట్టాయి. ప్రధానంగా ఫైనాన్షియల్ స్టాక్స్‌లో పెద్ద స్థాయిలో అమ్మకాల వత్తిడి నెలకొంది. అలాగే ఆగస్టు ఫ్యూచర్స్ అండ్ అఫ్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టుల గడువు ముగిసిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు కూడా నష్టాలకు మరింత ఆజ్యం పోశాయని వాణిజ్య విశే్లషకులు పేర్కొంటున్నారు.

08/29/2019 - 23:35

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంతో బాండ్లను జారీ చేయడం ద్వారా రూ. 10 వేల కోట్లు సమీకరించేందుకు తమ కంపెనీ వాటాదారులు అంగీకారం తెలిపారని ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ గురువారం నాడిక్కడ తెలిపింది.

08/29/2019 - 04:18

ముంబయి : వరుసగా మూడు రోజులపాటు భారీ లాభాలు గడించి జోష్‌మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లోకి జారాయి. లోహ, విద్యుత్, బ్యాంకింగ్, వాహన కౌంటర్లు డీలా పడటంతోబాటు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయికి చేరడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

08/29/2019 - 01:49

విజయవాడ, ఆగస్టు 28: శతాబ్ది, గతిమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ తదితర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ల సదుపాయంలో సెప్టెంబర్ మాసాంతం నుంచి ప్రయాణికులకు రాయితీ పథకం వర్తించబోతున్నది. ఈ రాయితీలు కల్పించే అధికారాన్ని రైల్వే శాఖ తాజాగా జోనల్ రైల్వేల్లోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు ఇచ్చింది.

08/28/2019 - 22:50

చిత్రం... న్యూఢిల్లీలో బుధవారం ‘ట్రైబెర్’ మోడల్ కార్లను విడుదల చేస్తున్న రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి, వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) థామస్ డుబ్రియర్

08/28/2019 - 22:47

న్యూఢిల్లీ, ఆగస్టు 28: స్థిరాస్తి వ్యాపార దిగ్గజం డీఎల్‌ఎఫ్ హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో గల తన ఆస్తులన్నింటినీ లీజుకివ్వడం జరిగింది. మొత్తం 2.5 మిలియన్ చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల ద్వారా రూ. 375 కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని సంస్థ అంచనా వేస్తున్నట్టు డీఎల్‌ఎఫ్ గ్రూప్ అద్దెల వాణిజ్య విభాగం ఎండీ శ్రీరామ్ ఖట్టర్ బుధవారం నాడిక్కడ తెలిపారు.

Pages