S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/28/2019 - 22:46

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మహీంద్రా భాగస్వామ్య కంపెనీల్లో కొత్తగా ఏర్పాటైన ‘మహీంద్రా హెల్త్‌కేర్’కు ఫిరోజ్‌షా సర్కారీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కంపెనీ బుధవారం నాడిక్కడ ప్రకటన విడుదల చేసింది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఫిరోజ్‌షా సర్కారీ సీఈవో బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ తెలిపింది.

08/28/2019 - 22:46

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో ముడి ఇనుము ఉత్పత్తి గడచిన జూలైలో 1.7 శాతం పెరిగి మొత్తం ఉత్పత్తి 9,215 మిలియన్ టన్నులకు చేరింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ విడుదలైన ప్రపంచ ఉక్కు పరిశ్రమల సంఘం తాజా నివేదిక వెల్లడించింది. గడచిన ఏడాది ఇదే కాలంలో 9,059 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. కాగా గడచిన జూలైలో 64 ప్రపంచ దేశాలు 1,56,697 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేశాయి.

08/28/2019 - 05:06

విశాఖపట్నం : ప్రముఖ బహుళజాతి, వృత్తి సేవల సంస్థ యాక్సెంచూర్‌కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి భారీ స్థాయిలో 311 మంది విద్యార్థులు ఎంపికై రాష్ట్రంలోనే సరికొత్త ప్లేస్‌మెంట్ రికార్డు సృష్టించారు. గీతం విశ్వవిద్యాలయం విశాఖ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన ప్రాంగణ ఇంటర్వ్యూలకు ఎక్సెంచూర్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు నేతృత్వంలో ప్రత్యేక బృందం హాజరైంది.

08/28/2019 - 04:38

ముంబయి : వరుసగా మూడోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. వాహన, లోహ, ఫైనాన్షియల్ స్టాక్స్ మంచి లాభాలను అందుకోవడం మార్కెట్ల ఫలితాలను ప్రభావితం చేసింది. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మంగళవారం నాడు 147.15 పాయింట్లు (0.39శాతం) లాభపడి 37,641.27 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 37.731.51 పాయింట్ల గరిష్టం, 37,449.69 పాయింట్ల కనిష్టం నడుమ కదలాడింది.

08/28/2019 - 03:43

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వరుసగా ఐదు రోజులపాటు రికార్డుల మోత మోగించిన బంగారం ధరలు ఎట్టకేలకు మంగళవారం స్థిరంగా సాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 29,670 పలికింది. సోమవారం నాడు ట్రేడైన ఆల్‌టైం రికార్డు స్థాయి ధరలో మంగళవారం ఎలాంటి హెచ్చుతగ్గులూ చోటుచేసుకోలేదు. వెండి ధర మాత్రం కిలోపై రూ. 190 పెరిగి మొత్తం ధర రూ. 46.740కి చేరింది.

08/28/2019 - 03:41

చిత్రం... పూణేలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

08/28/2019 - 03:39

ముంబయి, ఆగస్టు 27: ఇప్పటికే ఆర్థికంగా సంతృప్తికర స్థాయిలో ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి తాజా మూలధన సహకారం తమకు అవసరం లేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జిత్ బసు మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పునరుత్తేజానికి, ద్రవ్య లభ్యతను పెంచేందుకు, రుణ సామర్థ్యాన్ని రూ. 5ట్రిలియన్లకు పెంచేందుకు తక్షణ సాయంగా రూ.

08/28/2019 - 03:37

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఈ కామర్స్ సంస్థల వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త వినియోగదారుల రక్షణ చట్టంలో మరిన్ని సరికొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాఫ్ట్ సిద్ధమైంది. ఈమేరకు నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై సంబంధిత నియంత్రణ సంస్థ కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుకలుగుతుంది.

08/27/2019 - 04:54

ముంబయి : ఊహించిన విధంగానే కేంద్ర రాయితీలు, ప్రోత్సాహకాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నాడు పరుగు లంఘించుకుని ఒక రోజు అత్యుత్తమ ఆదిక్యతను నమోదు చేశాయి.

08/27/2019 - 04:28

సంగారెడ్డి, ఆగస్టు 26: ‘తెల్లవారకముందే వెళ్లిపోతోందీ.. అందరు పడుకున్నాక మళ్లీ వస్తోందీ’ అంటూ రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై నిట్టూరుస్తున్నారు. నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సునాయాసంగా రాకపోకలు నిర్వహించడానికి దక్షిణ మద్య రైల్వే ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Pages