S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/20/2018 - 04:25

కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఓ క్రికెట్ స్టేడియంలో జరిగిన పేలుళ్లలో ఎనిమిది మంది మరణించారు. జలాలాబాద్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు తెగబడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అనేక మంది మ్యాచ్ చూస్తుండగా పేలుళ్లు సంభవించాయని నాన్‌గర్‌హర్ ప్రభుత్వ ప్రతినిధి అత్తాహుల్ ఖోగ్యానీ వెల్లడించారు. వరుస పేలుళ్లలో 8 మంది చనిపోగా 45 మంది గాయపడ్డారన్నారు.

05/20/2018 - 02:23

చిత్రాలు..లండన్ సమీపంలోని విండ్‌సర్ కాజల్‌లోని సెయింట్ జార్జి
చాపెల్‌లో శనివారం జరిగిన బ్రిటీష్
యువరాజు హారీ, మేఘనా మార్కెల్ వివాహం దృశ్యం
*ఉంగరాలు మార్చుకుంటున్న నూతన దంపతులు

05/19/2018 - 04:13

వాషింగ్టన్, మే 18: అణ్వస్తన్రిరోధంపై చర్చల విషయంలో ఉత్తరకొరియా తన మనసు మార్చుకోవడానికి ప్రధాన కారణం చైనా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఉత్తరకొరియా తన వైఖరిని మార్చుకోకపోతే, తాము ముందస్తు ప్రణాళిక ప్రకారం తర్వాతి చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

05/18/2018 - 04:13

వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదార్లను ‘జంతువులు’ అంటూ డోనాల్డ్ ట్రంప్ వర్ణించారు. అందువల్ల ప్ర తిభావంతులు మాత్రమే అమెరికా కు రావాలని ఆయన గట్టిగా కోరా రు. మెక్సికో, క్యాలిఫోర్నియాలకు చెందిన అధికార్ల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ తన విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇప్పటివరకు బలహీనంగా ఉన్న వలస చట్టాలను మరింత బలోపేతం చేయాలని గట్టిగా కోరారు.

05/18/2018 - 02:04

వాషింగ్టన్, మే 17: హెచ్1-బి వీసా హోల్డర్ల భాగస్వాములకు పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని యూఎస్‌లో అత్యంత పలుకుబడి కలిగిన, భారతీయ అమెరికన్ కాంగ్రెస్ ఉమన్ ప్రమీ లా జయపాల్ నేతృత్వంలోని 130 మంది యూ ఎస్ ప్రజాప్రతినిధులు అధ్యక్షుడు ట్రంప్‌ను కో రారు. హెచ్1-బి వీసా హోల్డర్ల భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పి స్తూ గత ఒబామా ప్రభుత్వం చట్టం చేసింది.

05/16/2018 - 02:01

జెరూసలేం, మే 15: గాజా సరిహద్దులో జరిగిన హింసాకాండపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది. టెల్‌అవీవ్ నుంచి అమెరికా ఎంబసీని జెరూసలేంకు తరలించడాన్ని నిరసిస్తూ పాలస్తీనియన్లు చేపట్టిన ఆందోళన హింస్మాతంగా మారింది. సమారు 59 మంది గాజా హింసలో మరణించారు. తమ భద్రతాదళాల చర్యను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ఇందులో చట్ట ఉల్లంఘన ఏమీ లేదు’అని ప్రకటించింది.

05/16/2018 - 01:57

వాషింగ్టన్, మే 15: భారత్‌పై అమెరికా మీడియా వ్యతిరేక కథనాలను, ప్రతికూల వార్తలను ప్రచురిస్తోందని, అభివృద్ధిని మర్చిపోయి, ఏదో ఒక అరుదైన విషయాన్ని పట్టుకుని గోరంతలు కొండంతలుగా చిత్రీకరిస్తున్నాయని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సింగ్ శర్న అన్నారు. దుష్ప్రచార వార్తలను ప్రచురించరాదని ఆయన కోరారు.

05/16/2018 - 01:55

ఐక్యరాజ్య సమితి, మే 15: అక్రమ, సక్రమ వలసలను స్పష్టంగా విభజించడంతపై దృష్టి కేంద్రీకరించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని కోరింది. అక్రమ వలసదార్ల వల్ల, చట్టబద్ధ వలసదార్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొన్నదని భారత్ స్పష్టం చేసింది.

05/15/2018 - 04:48

ఇస్లామాబాద్: పర్యవసానాలు ఎలావున్నా తాను నిజం మాట్లాడి తీరుతానని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. 26/11 దాడుల వెనుక పాక్ హస్తం ఉందంటూ తాను చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్న షరీఫ్, తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ముంబయి పేలుళ్ల వెనుక పాక్ హస్తం ఉందంటూ బాహాటంగానే ఓ ఇంటర్వ్యూలో షరీఫ్ వెల్లడించిన నేపథ్యంలో పాక్‌లో హాహాకారాలు చెలరేగాయి.

05/15/2018 - 01:17

జెరూసలెం, మే 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య రక్తపాతమే సృష్టించింది. జెరూసలెంలో అమెరికా ఎంబసీని ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో మొదలైన ఈ ఘర్షణలు సోమవారం దీన్ని ప్రారంభించడంతో రక్తపాతానికే దారితీశాయి. ఈ ఎంబసీ ప్రారంభాన్ని నిరసించిన వేలాది మంది పాలస్తీనియన్లు ఆగ్రహోదగ్రులయ్యారు. దీని ఫలితంగా జరిగిన ఘర్షణల్లో గాజా ప్రాంతం రక్తమోడింది.

Pages