• ప్యారిస్, జనవరి 21: ప్రకృతిసిద్ధమైన సహజ వనరులు మానవ వినియోగ కారణంగా అపారంగా హ

  • కొలంబో, జనవరి 21: తమిళ మిలిటెంట్ గ్రూపు (ఎల్‌టీటీఏ)ను అణచివేసే క్రమంలో జరిగిన

  • ఖట్మాండు: నేపాల్ పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది భారతీయులు ఓ హోటల్‌లో మృతి చెందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/21/2017 - 02:18

లాస్ ఏంజిల్స్, ఆగస్టు 20: అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధిని గుర్తించేందుకు శాస్తవ్రేత్తలు సరికొత్త పరీక్షను అభివృద్ధి చేశారు. కంటికి ఎటువంటి గాటు పెట్టకుండా నిర్వహించే ఈ పరీక్ష ద్వారా రోగుల్లో అల్జీమర్స్ లక్షణాలు ప్రారంభం కావడానికి ఎన్నో ఏళ్ల ముందే ఈ వ్యాధికి సంబంధించిన కీలక లక్షణాలను గుర్తించేందుకు వీలవుతుందని అమెరికాలోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు స్పష్టం చేశారు.

08/21/2017 - 02:17

సియోల్, ఆగస్టు 20: దక్షిణ కొరియాతో కలిసి వచ్చేవారం వార్షిక యుద్ధ విన్యాసాలను నిర్వహించాలని అమెరికా నిర్ణయించడం ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోయడమేనని ఉత్తర కొరియా ఆదివారంనాడు హెచ్చరించింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య గత పది రోజులుగా తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం సాగుతోంది.

08/21/2017 - 02:20

వాషింగ్టన్, ఆగస్టు 20: అమెరికాలో 2017లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) 2014లోనే ధ్రువీకరించింది. ఇప్పుడు ఆ మాట నిజమయ్యే క్షణం వచ్చేసింది. సోమవారంనాడు కోట్లాది మంది అమెరికన్లు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించబోతున్నారు. కెంటకీ, మిస్సౌరీ, ఇల్లినాయిస్‌తో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఈ గ్రేట్ అమెరికన్ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించబోతోంది.

08/21/2017 - 02:06

లండన్, ఆగస్టు 20: ‘ఎంత సూక్ష్మమో అంత పదును’ అన్నది ఆధునిక నానుడి. పెద్ద ఫోన్లు పోయి అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్లు పుంఖాను పుంఖాన్లుగా పుట్టుకొస్తున్న యుగమిది. గ్రామ్‌ఫోన్లు, టేప్‌రికార్డర్లు, సిడిల యుగం కూడా అంతరించి అన్నిచోట్లా చిప్‌లే రాజ్యం చేస్తున్నాయి. తాజాగా వైద్య విజ్ఞానంలోనూ ఈ అతిసూక్ష్మ పరికరం నిరుపమానం కాబోతోంది.

08/21/2017 - 01:46

వాషింగ్టన్, ఆగస్టు 20: ‘నవ్వడం ఒక భోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం’ అని అంటారు పెద్దలు. అయితే ఆ నవ్వే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చార్లెస్ ఎ హట్సన్ మిడిల్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న షరోన్ రెగోలి కిఫెర్నో సెలవు రోజులు గడిపేందుకు తన కుమార్తెతోపాటుగా మెక్సికోలోని తన స్నేహితుడి ఇంటికి వచ్చింది.

08/21/2017 - 01:31

లాహోర్, ఆగస్టు 20: పనామా పత్రాల కేసులో అవినీతికి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న పదవీచ్యుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం రెండోసారి కూడా దేశ అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ ఎదుట హాజరు కాలేదు.

08/21/2017 - 00:56

వాషింగ్టన్, ఆగస్టు 20: హెచ్1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించినప్పటికీ ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల్లో భారతీయులదే అగ్ర తాంబూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెచ్1బి వీసాల కోసం దాఖలైన దరఖాస్తుల్లో 74శాతం భారత్ నుంచి వచ్చినవేనని తాజాగా వెల్లడైన వివరాలను బట్టి తెలుస్తోంది.

08/20/2017 - 03:07

వాషింగ్టన్, ఆగస్టు 19: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు మతమార్పిడులు యథేచ్ఛగా కొనసాగుతుండటంపట్ల అమెరికా పార్లమెంటేరియన్ల గ్రూపు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌తో జరిపే చర్చల్లో ఈ అంశానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ గ్రూపు అమెరికా విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది.

08/20/2017 - 03:09

బార్సిలోనా, ఆగస్టు 19: స్పెయిన్‌లో రక్తపాతం సృష్టించిన ఇద్దరు ఆగంతకుల్లో ఒకడిగా అనుమానిస్తున్న మొరాకో జాతీయుడికోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని రెండవ పెద్ద నగరమైన బార్సిలోనాతోపాటు సముద్ర తీరప్రాంత పట్టణమైన కాంబ్రిల్స్‌లో గురువారం ఈ ఇద్దరు ఆగంతకులు తమ వాహనాలతో ఉద్ధేశ్యపూర్వకంగా పాదచారులపైకి దూసుకెళ్లి మారణ హోమాన్ని సృష్టించిన విషయం విదితమే.

08/20/2017 - 02:59

కరాచి, ఆగస్టు 19: కుష్ఠురోగులకు 57 ఏళ్లపాటు నిరుపమాన సేవలందించి ఈ నెల 10న మృతిచెందిన డాక్టర్ రూత్ కేథరీనా మార్తా ఫా అంత్యక్రియలు శనివారం కరాచీలోని పురాతన శ్మశాన వాటికలో జరిగాయి. అంతకుముందు రూత్ పార్థివ దేహాన్ని సెయింట్ పాట్రిక్స్ కేథడ్రల్ చర్చికి తీసుకువచ్చి పాకిస్తాన్ జాతీయ జెండాను ఉంచారు.

Pages