S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/10/2016 - 06:32

వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే దేశ చరిత్రలో అత్యంత నిర్లక్ష్యపు అధ్యక్షుడవుతాడని రిపబ్లికన్ పార్టీకి చెందిన 50మంది అత్యున్నత జాతీయ భద్రతా నిపుణులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్‌కు వ్యక్తిత్వం లేదని, స్వయం నియంత్రణ అసలు లేదని, అత్యంత ప్రమాదకరమైన గుణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

08/09/2016 - 12:16

వాషింగ్టన్‌ : ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో మరో అద్భుతాన్ని చూడొచ్చు. ఆకాశం మరింత ప్రకాశవంతం కానుంది. గంటకు సుమారు 200 వరకూ ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ఒక్కసారిగా భారీ వెలుగును ఉత్పత్తి చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

08/09/2016 - 02:49

వాషింగ్టన్, ఆగస్టు 8: ఈ వారంలో ఆకాశం ఉల్కాపాతంతో కాంతులు విరజిమ్ముతుందని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. గంటకు 200 ఉల్కలు భూవాతావరణాన్ని తాకుతాయని, దాదాపు గంటపాటు కాంతి వర్షాన్ని కురిపిస్తాయని నాసా పేర్కొంది. ఆగస్ట్ 11-12 తేదీలలో ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా శాస్తవ్రేత్త బిల్ కూక్ పేర్కొన్నారు. కచ్చితమైన పరిస్థితుల్లో గంటకు 200 ఉల్కల చొప్పున భూవాతావరణాన్ని తాకుతాయన్నారు.

08/09/2016 - 02:43

కరాచి, ఆగస్టు 8: పాకిస్తాన్‌లో సోమవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. మానవ బాంబు జరిపిన ఈ దాడిలో 70 మంది మృతి చెందారు. ఇందులో చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. బాలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని అయిన క్వెట్టా నగరంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ మానవ బాంబు దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

08/09/2016 - 02:39

కరాచీ, ఆగస్టు 8: భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య అణు తప్పదని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ వెల్లడించాడు. కాశ్మీర్ అంశమే ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసుకుందని సోమవారం ఇక్కడ తెలిపాడు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కాశ్మీర్ ప్రజలను పోరాడుతునే ఉంటారని హెచ్చరించాడు.

08/09/2016 - 02:35

ఖాట్మండు, ఆగస్టు 8: సెంట్రల్ నేపాల్‌లోని అటవీ ప్రాంతంలో సోమవారం ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో నవజాత శిశువు సహా అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఏడుగురూ దుర్మరణం చెందారు. ఫిష్‌టెయిల్ ఎయిర్ సంస్థకు చెందిన 9ఎన్-ఎకెఎ హెలికాప్టర్ చికిత్స నిమిత్తం తల్లీ, శిశువును ఖాట్మండుకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

08/08/2016 - 18:07

ఖాట్మండు: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయి పైలట్‌తో పాటు ఏడుగురు మరణించారు. మృతుల్లో ఓ శిశువు కూడా ఉంది. శిశువును నేపాల్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆమె తల్లి, బంధువులు హెలికాప్టర్ ఎక్కారు. బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయి.

08/08/2016 - 18:05

ఇస్లామాబాద్: కాశ్మీర్ విషయమై భారత్, పాకిస్థాన్‌ల మధ్య చిరకాలంగా ఘర్షణ నెలకొన్నందున భవిష్యత్‌లో ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని పాక్‌లోని హిజ్బుల్ ముజాహుద్దీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఆయన సోమవారం కరాచీలో మీడియాతో మాట్లాడుతూ, కాశ్మీర్ కోసం ఇప్పటికే భారత్, పాక్‌ల మధ్య పలుసార్లు పోరాటాలు జరిగాయని, ఇక అణుయుద్ధం తప్పేలా లేదని వ్యాఖ్యానించాడు.

08/08/2016 - 16:02

కాఠ్‌మాండూ: కాఠ్‌మాండూ వెళ్లే మార్గంలోని నువాకోట్‌ సమీపంలో సోమవారం ఉదయం ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో పైలట్‌ సహా ఆరుగురు ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.

08/08/2016 - 08:07

లండన్, ఆగస్టు 7: ఉగ్రవాదుల దాడులను ముందస్తుగా గ్రహించి, నిరోధించటానికి బ్రిటన్ నిఘా వ్యవస్థ ఎంఐ5 ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. బిహేవియిరల్ సైన్స్ యూనిట్ (బిఎస్‌యు) పేరుతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ థేమ్స్‌హౌస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది.

Pages