S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/27/2016 - 07:59

హవానా, నవంబర్ 26: విప్లవ సైన్యానికి సారథ్యం వహించి క్యూబాకు అద్భుతమైన విజయాన్ని సాధించిన మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఇకలేరు. క్యూబాలో సోవియట్ తరహా కమ్యూనిస్టు వ్యవస్థను బలంగా పాదుకొల్పడంతోపాటు అధ్యక్షుడిగా అర్ధ శతాబ్దంపాటు దేశాన్ని ముందుకు నడిపి తన హయాంలో అగ్రరాజ్యమైన అమెరికాకు, ఆ దేశానికి చెందిన పదిమంది అధ్యక్షులకు సింహస్వప్నంగా నిలిచిన ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

11/27/2016 - 05:21

క్యూబా మహాయోధుడు క్యాస్ట్రో కన్నుమూత
ప్రపంచ వామపక్ష ఉద్యమానికి తీరని విఘాతం
నాలుగు రోజులపాటు సాగనున్న అంతిమయాత్ర
దేశమంతటా ఊరేగింపు, 4న అంత్యక్రియలు
ప్రపంచ దేశాధినేతల సంతాపాలు

11/25/2016 - 08:37

న్యూయార్క్, నవంబర్ 24: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు పోలయిన ఓట్లను తారుమారు చేసేందుకు సైబర్ దాడి జరగలేదని నిర్ధారించుకోవడానికి కీలక రాష్ట్రాలయిన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రీకౌంట్‌ను కోరాలని ఎన్నికల న్యాయవాదులు, డేటా నిపుణులు హిల్లరీ క్లింటన్‌కు సలహా ఇచ్చారు.

11/24/2016 - 08:29

వాషింగ్టన్, నవంబర్ 23: అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితమవుతాననుకున్న ఇండో అమెరికన్ నిక్కీహేలీకి ఐరాసలో అమెరికా రాయబారి పదవి దక్కింది.

11/24/2016 - 08:28

ఇస్లామాబాద్, నవంబర్ 23: ప్రపం చ వ్యాప్తంగా కాశ్మీర్ వివాదాన్ని ప్రధానాంశం చేయడంతో పాటు భారత్‌లో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘తీవ్రవాద విధానాల’ను వ్యతిరేకిస్తున్న ప్రజలను ఆకర్షించేలాగా కాశ్మీర్ వివాదంపై ఆచరణ సాధ్యమైన విధానాన్ని రూపొందించడానికి పాకిస్తాన్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

11/23/2016 - 02:16

టోక్యో, నవంబర్ 22: ఈశాన్య జపాన్ ప్రాంతాన్ని రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో తీవ్ర భూకంపం మంగళవారం కుదిపేసింది. దీని ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల కెరటాలు మీటరుకు పైగా ఎగిసి పడినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటి తీవ్రత ఎక్కువగా లేదని అధికారులు నిర్థారించారు. దాదాపు ఏడు గంటల తర్వాత సునామీ హెచ్చరికల్ని ఉపసంహరించారు.

11/22/2016 - 04:01

ఇస్లామాబాద్/లాహోర్, నవంబర్ 21: దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ సర్వసేన్యాధికారి రహీల్ షరీఫ్ వెల్లడించారు. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న రహీల్ సోమవారం నుంచి ఫేర్‌వెల్ విజిట్ ప్రారంభించారు. ఆయన పదవీకాలం పొడిగిస్తారని మీడియాలో కథనాలకు వెలువడ్డాయి. అయితే రహీల్ ఫేర్‌వెల్ టూర్‌తో పదవీకాలం పొడిగింపు లేనట్టే.

11/22/2016 - 03:59

కాబూల్, నవంబర్ 21: అఫ్గాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరగడంతో 28 మంది మృతిచెందారు. పశ్చిమ కాబూల్‌లో షియాలు ప్రార్థనలు చేస్తున్న మసీదులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండస్థులున్న మసీదులోని కింది అంతస్థులో పేలుడు జరిగింది. ‘నేను మసీదులోనే ఉన్నారు. ఆ సమయంలో ముల్లా ప్రార్థనలు చదువుతున్నాడు. ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది..

11/20/2016 - 02:41

హ్యూస్టన్, నవంబర్ 19: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కృత్రిమ గుండె ఆపరేషన్ చేసిన డెంటాన్ కూలే (96) శనివారం కన్నుమూశారు. అమెరికాకు చెందిన కూలే టెక్సాస్‌లో హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. కార్డియోవ్యాస్కులర్ సర్జరీలో ఇప్పటికీ ఆయన వినియోగించిన టెక్నిక్‌నే వాడుతున్నారు. కూలే తన బృందంతో కలిసి 1,18,000 గుండె ఆపరేషన్లు చేశారు.

11/20/2016 - 02:40

న్యూయార్క్, నవంబర్ 19: మరణశిక్షపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం భారతీయ చట్టాలతోపాటు సొంత న్యాయ వ్యవస్థ ఏవిధంగా ఉండాలనే విషయాన్ని నిర్దేశించుకోవడంలో ప్రతి దేశానికి గల సార్వభౌమాధికార హక్కులకు విరుద్ధంగా ఉందని భారత ప్రతినిధి మయాంక్ జోషి స్పష్టం చేశారు.

Pages