S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/27/2017 - 18:43

పదిహేడేళ్ల వయసులో మేఘన ఏర్పాటు చేసిన సంస్థ పేరు ‘ది వరల్డ్ వండర్‌ఫుల్‌‘. ఆమె దృష్టిలో ఇది అందమైన ప్రపంచం. ఈ అందమైన ప్రంపచాన్ని సృష్టించాలంటే తానొక్కర్తే సరిపోదు. తనతోపాటు కొంతమంది ఉండాలని భావించింది. ఇందుకోసం సోషల్‌మీడియాను ఉపయోగించుకున్నది. ఐటీ హబ్స్ సాయం కూడా తీసుకున్నది. ఆమె ప్రయత్నం ఫలించింది.

09/27/2017 - 18:42

దసరా అంటే సరదా పండగ. పిల్లలకు పరీక్షల తర్వాత వచ్చే దసరా సెలవులు వారికి ఆటవిడుపు. ఈ పండుగలో పెట్టే బొమ్మలకొలువు పిల్లల సృజనాత్మకతనూ, ఆసక్తినీ పెంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వారంతా సంక్రాంతి పండుగకి బొమ్మలకొలువు పెట్టే ఆచారం ఉంది. మద్రాసు, కర్ణాటక ప్రాంతాల వారంతా దసరాకే బొమ్మల కొలువు పెడతారు.

09/27/2017 - 18:39

కడప నగరం ప్రకాష్‌నగర్ క్లాసిక్ టవర్స్‌లో నివశిస్తున్న శ్రీమతి కె.విజయలక్ష్మి ఇంటికి వెళితే మట్టితో చేసిన బొమ్మల కొలువు దర్శనమిస్తుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదివి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి విజయలక్ష్మి గత తొమ్మిది సంవత్సరాలుగా బొమ్మల కొలువును నిర్వహిస్తూ వున్నారు. నాలుగు వందలకుపైగా మట్టితో చేసిన బొమ్మలుకొలువులో దర్శనం ఇస్తాయి.

09/26/2017 - 21:20

మానవ జీవితంలో ముఖ్యమైనది- వాక్కు, మాట. వాక్కు అంటే శబ్ద ‘శక్తి’. మాట తీరు మనస్సుకు అద్దం పడుతుంది. మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కు తీసికోవచ్చునేమోగాని, పెదవి దాటిన మాటను వెనక్కు మళ్లించటం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. మాట తీరును మధురతరం చేసి జీవన సరళిని ఆనందమయం చేసి, మనశ్శాంతినిచ్చే మహాశక్తి, వాగ్దేవి, చదువులతల్లి- సరస్వతీదేవి.

09/21/2017 - 19:34

అమ్మ అనే పిలుపులో ఉన్న కమ్మదనాన్ని ఆస్వాదించటానికి నేడు ఎన్నో ప్రక్రియలు వచ్చాయి. ఇందులో ఐవిఎఫ్ పద్ధతి ఒకటి. తరచూ గర్భస్రావం అయ్యే మహిళలు ఈ పద్ధతి ద్వారానే తల్లులవుతున్నారని తాజా అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక భారం, భావోద్వేగాలకు సంబంధించినదైనప్పటికీ మహిళలు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అమ్మ అయ్యేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు.

09/21/2017 - 17:18

ఎక్కడైనా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే మనవాళ్ళు ఊరేగింపుగా వెళ్లిపోతారు. ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ కొండకచోట ‘ఒకటికొంటే ఒకటి ఉచితం’- ఇలాంటి ప్రకటనలు అన్నిటా ఎక్కువయ్యాయి. మన షాపుల్లోనే కాదు ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా ఇది మరీ ఎక్కువైంది. మగవారికన్నా ఆడవారిలోనే ఈ ప్రకటనల ఆకర్షణ ఎక్కువైంది. ఇది మనకి ఇప్పుడు అవసరమా? అని ఆలోచించుకోరు. చవగ్గా వస్తోందనుకుంటారు.

09/21/2017 - 17:09

సమిష్టి జీవన విధానం అపార్ట్‌మెంట్‌లలోనే కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నివశిస్తూ ంటారు కాబట్టి, అపార్ట్‌మెంట్ నాది, మనది అనే భావన అందరిలో కలగాలి. ఏదైనా సమస్య వస్తే ఈర్ష్యా, ద్వేషభావాలు వీడి అందరూ కలిసి సందర్భోచితంగా మాట్లాడుకుంటే మంచిది. స్వంత నిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసిపోతుంటే ఎలాంటి సమస్యలు రావు. మనం మాట్లాడే ప్రతి మాటా ఎదుటివారి హృదయానికి పువ్వులా తాకేవిధంగా ఉండాలి.

09/21/2017 - 17:06

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

09/15/2017 - 23:05

ప్రకృతి పరంగా లభించే పండ్లు ఆరోగ్య పరంగా మంచిది. సమతుల్య ఆహారం అంటే పండ్లు కూడా ఆహారంగా తీసుకుంటేనే సాధ్యం. పిల్లలు కొన్నిరకాల పండ్లను తినటానికి ఇష్టపడరు. నాలుగేళ్లు వచ్చాయంటే బడికి వెళతారు. దీంతో వారు ఏమి తింటున్నారో అని తల్లిదండ్రులు బెంగపడుతుంటారు. రోజుకు కొద్దికొద్దిగా ఆహారంతో పాటు అదనంగా పండ్లు తినిపిస్తుండాలి. ఆకలి అంటే అన్నమే పెట్టకుండా పండ్లను కూడా తినిపిస్తుండాలి.

09/15/2017 - 21:04

మీరు కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? పెయిన్ కిల్లర్స్ మింగలేక నానా అగచాట్లు పడుతున్నారా? ఆపరేషన్ చేయించుకోవటమే శరణ్యం అని పరేషాన్ అవుతున్నారా?- ఇపుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. అదే స్పోర్ట్స్ మెడిసిన్. ఆటలతో మీ నొప్పులన్నీ ఇక మటుమాయం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ మొవ్వ వెంకటేష్ ఈ వైద్యం చేయటంలో దిట్ట.

Pages