S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

02/26/2017 - 21:05

మనిషి పుట్టినప్పటి నుండి శరీర పోషణ విషయం తెలియడానికి ఆకలి, శరీర రక్షణకు దుస్తులు, ఇవి అవసరంగా వస్తున్నవి.
‘‘పగటి పూట ఆకలికి, ఆహారముకై, దుస్తులు- అవసరాలకై, సంపాదన చేసే మనిషి రాత్రిపూట ఆ శరీరాన్ని మరల శక్తివంతం చేయడానికి అన్నట్టు నిద్ర అవసరంగా భావిస్తారు. ఆ నిద్రకు ఒకచోటు ఉండాలి. కాబట్టి నివాసం ఏర్పరచుకోవడం జరుగుతోంది.

02/25/2017 - 21:08

శరణాగతి తత్వమునకు కాలము ప్రధానము. ‘కాలేన అనవచ్ఛే దాత్’ అంటే కాలమునకు లొంగనివాడు భగవంతుడొక్కడే. కాలానికి లొంగకపోవడమే కాదు, కాలాన్ని తన ఆధీనంలో వుంచుకుంటాడు భగవంతుడు. కాలవశుడు జీవుడు. కాలాతీతుడు దేవుడు. మృత్యుగ్రస్తుడు జీవుడు. అమృత స్వరూపుడు దేవుడు. అందువల్లే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడిన జీవతత్వము సార్థకం అవుతుంది. కాలకాలుడు అని కూడా భగవంతుని అంటారు.

02/24/2017 - 21:06

శంకరా! ఈ అవనీతలంలో నీకన్నా గొప్ప దైవము లేడు. నీ నామోచ్ఛారణ చేయువారికి అభయంకరుడివై, సురాసురల నెందరినో నీ కటాక్ష వీక్షణములతో కాపాడినావు. మానవులము మేము నీ ముందెంత తండ్రీ! నీ దయార్ద్ర హృదయంలో మాకింత చోటివ్వు స్వామి! ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం సర్వజనులకు మోక్షదాయం.

02/23/2017 - 20:35

సర్వ జగత్తు శివమయం. శివపార్వతులు ఆదిదంపతులు. శివాని సర్వమంగళ. శివుడు మంగళప్రదుడు. శివుడు విభూతి ధరించి ఆభరణాలుగా పాములను అలంకరించుకొని, పులిచర్మము కట్టుకుని చూపరులకు భీతికొల్పించేటట్లుగా దర్శనం ఇస్తాడు. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు పుట్టిన హాలాహలాన్ని కంఠాన పట్టి నీలకంఠేశ్వరునిగా పేరెన్నికగన్నవాడు. కాని, ఆ శివుడు భోళాశంకరుడు. భక్తులకు వరాలనిచ్చి భక్తవరదుడన్న ఖ్యాతి పొందినవాడు.

02/23/2017 - 06:15

‘శివ శివా!’ అన్నంతనే సకల పాపాలను హరింపజేయగల మహిమాన్వితుడు మహేశ్వరుడు. కేవలం కొన్ని నీళ్లను లింగంపై పోసి, ఒక్క మారేడు దళాన్ని శివలింగంపై ఉంచితే సంతోషించి కోరిన వరములను ఇచ్చే కొండంత దేవుడు. అభిషేక ప్రియుడైన పరమశివుని పంచామృతాలతో, చెరకురసంతో, వివిధ ఫలాల రసాలతో అభిషేకించటం శ్రేయోదాయకం. తుమ్మిపూలు, మల్లెలు, మందారాలు, పున్నాగ మొదలైన పువ్వులతో అర్చించటం శివునికి ప్రీతికరం.

02/21/2017 - 20:53

ఈ జీవితం భగవంతుడిచ్చిన గొప్ప వరం. జీవితం మైనం ముద్దలాంటిది. మనం మన చేతులతో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటామో.. అలాగే మలచబడుతుంది. మంచైనా చెడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఒక్క మనిషికే సాధ్యం. సకల జీవకోటి రాశిలో మానవ జనే్మ అత్యున్నతమైనది. అలాంటి జీవితాన్ని కేవలం క్షణికమైన సుఖాలకోసం.. వెంటరాని ఆస్తి అంతస్థుల హోదాల మైకంలో మనిషి జీవితాన్ని నరకం చేసుకుంటున్నాడు. అలాంటి జీవితం ఎందుకు? ఎవరికోసం?

02/19/2017 - 23:03

ఇలలో మనిషిగా జన్మించడం మహోన్నతం. బాల్యం నుండీ తల్లిదండ్రుల పెంపకంతో గుణగణాలు, మంచీ చెడుల విచక్షణలు అలవడి, వాటి ప్రభావంతో, నిత్య జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. అభిరుచులకనుగుణంగా, విద్య, వివాహం, జీవితంలో ఎదుగుదల ఇలాంటివన్నీ మానవుల కృషి ఫలితాలే. ఎంతో విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రతి క్షణం శ్రమించేవారికి, కష్టాలే సుఖాలుగా కనిపిస్తాయి.

02/18/2017 - 23:47

ప్రకృతిలోనున్న ప్రతి అంశమునకు ఒక శాస్త్రం వెల్లివిరిసింది. ఈ శాస్త్రాలవలన విజ్ఞానం వికసిస్తుంది. ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం ఎంతో విస్తృతమగుతున్నది. వైద్య శాస్తమ్రును ముఖ్యంగా రెండు భాగాలుగా విడదీశారు. ఔషధ చికిత్స, మరియు శస్తచ్రికిత్స. శరీరంలోని రోగాన్ని గుర్తించి తగిన ఔషధము నిచ్చుట ఔషధ చికిత్స. ఇక శరీరంలోపలనున్న రోగాన్ని గుర్తించి ఆ భాగాన్ని చికిత్సద్వారా తొలగించుటయే శస్త్ర చికిత్స.

02/17/2017 - 21:01

ప్రాచీన కాలంలో యుద్ధ రంగంలో సైనికులతోపాటు అశ్వికదళానికి, గజబలానికి ప్రాధాన్యత ఉండేది. మహాభారత యుద్ధంలో ఇలాంటి ఒక శక్తివంతమైన, మహత్తరమైన ఏనుగు కౌరవ పక్షాన పోరాడి పాండవ సేనలు ముప్పుతిప్పలు పెట్టింది. ఆ విశిష్ట గజమే సుప్రతీకం! ప్రాగ్జోతిష పాలకుడైన భగదత్తుని వాహనం ఇది. అన్ని ఏనుగులలాగా కాక దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉసిగొల్పగానే అది విరోధి మూకలపైన విజృంభిస్తుంది.

02/16/2017 - 21:23

జాతిరత్నాలు జగతి ప్రగతికి మూల స్తంభాలు. వారే సనాతన సంస్కృతిని విశ్వవికాసాన్ని కలుగజేసే మానవోత్తములు. పూవు పుట్టిన తోడనే పరిమళభరితాన్ని ప్రాణికోటికందిస్తున్న చందాన, మానవుడు పుట్టుకతోనే తన అపూర్వ లక్షణాల్ని అలరింపజేస్తారు. అట్టివానిని మహాత్ముడంటారు.

Pages