S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

09/08/2016 - 21:20

హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
సర్వమానవాళికి నిత్యజీవన దివ్యవాణి గీత. ఒక పరమ రహస్య గ్రంథం సకల వేదసారం గీతా శ్లోకాలు. గీత అంతరార్థం అతి గంభీరం. వీటికి పండితులు భాష్యకారులు అంతరార్థాన్ని విడమర్చి చెప్పియున్నారు.

09/08/2016 - 03:58

పత్రముగాని, పువ్వునుగానీ, ఫలాన్నిగాని లేదా నీటినిగాని భక్తితో ఎవరైతే నాకు సమర్పిస్తారో వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని భగవద్గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు. అంటేఇక్కడ ఇచ్చేవస్తువు ముఖ్యంకాదు ఇవ్వాలనుకొన్న మనసే ముఖ్యం అని విజ్ఞులు అంతరార్థాన్ని గ్రహించాలని అంటారు. ఇంతకు ముందు యుగాల్లో భగవానుని కోసం కీర్తనలు పాడేవారు.

09/07/2016 - 02:08

పుట్టిన ప్రతి మనిషి జీవించడానికి ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధమైన పని చేసి జీవనోపాధి పొందుతారు. ఎవరి అభిరుచిని బట్టి వారు ఆ పని చేస్తారు. కొందరు ఏ పని చేసినా పనిలో నాకేం లాభం? అని ఆలోచిస్తారు. నాదంతా దాచుకోవాలని కొందరు భావిస్తే, మరికొందరు దొరికినంత దోచుకోవాలని ఆలోచిస్తారు. ఇంకొందరు స్వార్థం లేకుండా నిజాయితీగా తను సంపాదించిన సంపద, జ్ఞాన సంపద సమాజాభివృద్ధికి సమర్పిస్తారు.

09/04/2016 - 21:06

‘అవిఘ్నమస్తు’ అంటూ ఓం ప్రథమం వినాయక పూజ పండుగలకు నాంది పలుకుతుంది. భాద్రపద శుద్ధ చవితి హిందువుల పర్వదినాలలో ఎంతో విశిష్టమైనదితిథిగా చెప్పబడింది. ఈ పవిత్ర దినాన తారతమ్యాలు, తరతమభేదాలు లేకుండా అందరూకలసి దేశమంతా శ్రీ గణేశుని చతుర్థిని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు.

09/03/2016 - 21:06

శ్రీ ఆదిశంకరాచార్యులు విద్యాభ్యాసం చేసే రోజుల్లో బ్రహ్మచారులు భిక్షాటనం చేసి దొరికినదానితో వండుకుని తినాలన్న నియమం గురుకులాలలో నుండేది. శ్రీశంకరులు ఒక రోజు భిక్ష కొరకు ఒక పేద ముదుసలి ఇంటికి వెళ్తారు. ఆమె వద్ద భిక్ష వేయడానికి ఏమీ లేదు. బాధపడుతుంది. ఒక ఉసిరికకాయ మిగిలి ఉందని దాన్ని తెచ్చి అతని పాత్రలో వేసి ఇంతకుమించి నేనేమీ ఇవ్వలేనని విలపిస్తుంది.

09/02/2016 - 21:46

విద్యావినయాన్ని ఇస్తుంది. వినయగుణం మనిషిలోని మంచితనాన్ని వెలికితెస్తుంది. అందుకే విద్యావినయాలనే రెండింటికీ మానవ జీవితంలో సమాన ప్రాధాన్యం ఉంది. గీతలో శ్రీకృష్ణుడు విద్యావినయముల చేత సంపన్నుడైన వాడే గౌరవానికి పాత్రుడని పరోక్షంగాచెప్పిఉన్నాడు. విద్య అనగా జ్ఞానమే. కాని, కేవలం అక్షర జ్ఞానం ఒక్కటే విద్యకాదు.

09/01/2016 - 21:23

ఉ. దాని శరీర సౌరభము, దాని విలోల విలోకనంబులున్
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్
దాని విలాసముం గడు ముదంబునఁ జూచి మనోజబాణసం
తాన హతాత్ముఁడై నృపతి దానికి నిట్లనియెం బ్రియంబునన్

09/01/2016 - 21:17

వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పనిసరిగా చేయాలి.

08/31/2016 - 23:27

కోపాన్ని, స్వార్థాన్ని జయించిననాడే పరమార్థాన్ని కూడా జయించగలరు. ఒకానొక యువకుడు ఒక యోగిని దర్శించి అందరివలే తనకు భగవదర్శనము కలిగించే ఉపాయాన్ని తెలియజేయమని అడిగాడు. నీ కోర్కె చక్కగానే ఉంది. భగవదర్శనం కావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని యోగి తెలిపారు. ప్రతి నిత్యం ఏకాంత స్థానంలో కూర్చుని భగవన్నామ సంస్మరణను ఏడాదికాలంపాటు చేసి ఆ తరువాత తన సందర్శనం చేయమని ఆ యోగి ఆ యువకునికి తెలియజేశారు.

08/30/2016 - 19:53

మానవులు పుట్టినప్పటినుంచి మరణించేవరకు సంపాదించినదంతా సంపదయే. కొందరు తమ జీవితకాలంలో పుణ్యం సంపాదిస్తే, మరికొందరు పాప సంపదను సంపాదిస్తారు. మామూలు మానవులు సంపద అంటే ధనమని, భవంతులని, పొలాలని భావిస్తారు. మహాత్ములు సంపద అంటే త్యాగం, శీలము, పరోపకారం వంటి మంచి లక్షణాలను సంపదగా భావిస్తారు. అధర్మంగా, అన్యాయంగా సంపాదించిన సంపదంతా పాప సంపదవుతుంది.

Pages