S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

08/28/2016 - 21:08

మహాభారత యుద్ధము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో జరిగినది. అది ఒక మహోన్నతమైన ధర్మక్షేత్రము. మానవ దేహము కూడా ఒక కురుక్షేత్రమే. ధర్మాధర్మములను గూర్చి ఆలోచించే అవకాశము ఒక్క మానవ శరీరమునకు మాత్రమే కలదు. అందువలన మానవ శరీరము ధర్మక్షేత్రము. ఈ ధర్మక్షేత్రమైన మానవ శరీరంలో మనస్సు అనెడి కురుక్షేత్రమున్నది.

08/27/2016 - 20:59

విశ్వసృష్టిలో భూభాగ, జలభాగాల విభజనలో ముప్పాతిక పాళ్లు నీళ్లే అని భౌగోళిక శాస్త్రం తెలియజేస్తోంది. జలం కారణంగా సమస్తజగతి వృద్ధి చెందుతున్నది, శుద్ధి చేయబడుతుంది. జలమే సర్వసృష్టికి జీవం, ప్రాణికి జీవనాధారం. ఒక్కమాటలో స్పష్టం చెయ్యాలంటే.. నీరు లేకపోతే సమస్త జీవ సమాజానికి అస్థిత్వమే లేదు. అందుకే జల ప్రాశస్త్యాన్ని మహత్తరంగా ‘సుజలాం సుఫలాం’ అని మహనీయులు కీర్తించారు.

08/25/2016 - 21:16

అంతటా వ్యాపించిన విష్ణువు చిన్నికృష్ణుడిగా కనిపించిన అవతారం కృష్ణావతారం. గోవిందావతారం దాల్చి, భక్తులకు ఆనందం కలిగించాడని, శంకరత్పాదులు ప్రతిపాదన చేసిన నామం గోవిందనామం.

08/24/2016 - 23:37

కంసాది రాక్షసుల విహారం ఎక్కువై భూభారం పెరిగింది. వారి అధర్మవర్తనంతో భూమాత తల్లడిల్లింది. ఆ తల్లి కన్నీళ్లు తుడవడానికి బ్రహ్మాదిదేవతలు ఒక్కచోట కూడారు. ఆ తల్లి కూడా వారితో చేరి నన్ను ప్రాణికోటిని రక్షించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించింది. సాధువుల ప్రార్థన విన్న అఖిలాండేశ్వరుడు, ఆదిమధ్యాంతరహితడు, సృష్టిస్థితిలయకారకుడైన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో వారికి అభయప్రదానం చేశాడు.

08/23/2016 - 21:25

నిరాశపడకుండా ఏ విషయాన్నయినా పట్టుదలతో సాధించగలిగిన శక్తిని అలవరచుకోవాలి. పదే పదే ప్రయత్నమే విజయానికి రహస్యం. నేటి సమాజంలో అనేకమంది నిరుత్సాహంతో నిరాశ చెంది తమ తనువులు బలిచేస్తున్నారు. నేటి విద్యార్థులు భావి భారత పౌరులుగా కీర్తింపబడాలంటే ఆత్మన్యూనత విడనాడాలి.

08/21/2016 - 22:40

భగవంతుణ్ణి ఐదు రూపాలలో దర్శించవచ్చునని పురాణాలలో చెప్పబడింది. 1.పరస్వరూపం 2.వ్యూహాస్వరూపం 3.విభవ స్వరూపం 4.అంతర్యామి స్వరూపం 5.అర్చా స్వరూపం పరస్వరూపం, వ్యూహాస్వరూపం రెండు పరలోకానికి చెందినవి. ముక్తులు, దేవతలు ఉండే లోకాలు.

08/20/2016 - 21:19

కాలగమనంలో ధర్మాలు మారుతూ వుంటాయన్నది నిజం. కాలంలో రాత్రింబగళ్ళు ఒకేలా వున్నా దాని గమనంలో జీవుల చావు పుట్టుకల చక్రభ్రమణంలో, తరాలు మారుతున్నకొద్దీ అంతరంగాల విభేదాలతో పోరాటాలు పెరిగి శాస్త్రాలు, చట్టాలు మారుతాయన్నది సత్యం, అందరికీ అనుభవైకవేద్యం.

08/19/2016 - 23:36

ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రతిభ అంతర్లీనంగా వుంటుంది. ప్రతిభను గుర్తించి సానబెట్టాలి. అప్పుడే వ్యక్తిలోని ప్రతిభ వెలుగొందుతుంది. చాలామంది తమలోని ప్రతిభను గుర్తించకుండా సామాన్య మానవులుగా జీవిస్తుంటారు. మరికొందరు తమ ప్రతిభ వెలికితీయుటకు అవకాశాలకోసం ఎదురుచూస్తుంటారు. తమలోని ప్రతిభను కొందరు ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని జోడించి వెలికితీస్తుంటారు.

08/18/2016 - 21:11

శ్రావణ మాసం పవిత్రతను సంతరించుకున్న మాసం. ఎక్కు వ పర్వదినాలు వచ్చేది శ్రావణ మాసంలోనే. శివునికీ, విష్ణువుకు, మంగళగౌరికీ, మహాలక్ష్మికీ ప్రీతికరమైన మాసం. హయగ్రీవ జయంతి, అనంత పద్మనాభ చతుర్దశి, శ్రీకృష్ణాష్టమి వంటి భగవత్సంబంధమైన పర్వదినాలతోపాటు సోదరీ సోదరుల అనురాగానికి గుర్తుగా జరుపుకునే రక్షాబంధనం కూడా ఈ మాసంలోనే వస్తుంది.

08/17/2016 - 23:04

శ్రావణపూర్ణిమనే రాఖీపౌర్ణమి వ్యవహరింపబడుతోంది. పూర్వం వేదవిద్య అధ్యయనాన్ని ఈ శ్రావణపూర్ణిమతో ప్రారంభించేవారు. దీనికి ఆరంభసూచికగానే అప్పట్లో పండితులు రాజులను, జమీందారులను, స్థితిమంతులను, పలుకుబడిగలవాళ్లను, వూరిపెద్దలను ఆశీర్వదించేవారు. వారి పాండిత్యానికి మెచ్చి ప్రభువులు, జమీందారులు బ్రాహ్మణులకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొంది యధాశక్తిగా దానధర్మాలు చేసేవారు.పారితోషికాలను ఇచ్చేవారు.

Pages