S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/25/2017 - 22:52

గోవు హైందవజాతి తల్లి. భారతీయుల సంస్కృతి గోవుకు నమస్కరించటం. ‘గావో విశ్వస్య మాతరః’ అని ఈ దేశపు సనాతన ధర్మ దివ్యశంఖారావం. అంటే సమస్త విశ్వానికీ తల్లి గోవు అని ఎలుగెత్తి చాటింది. ‘సమస్త సంపదలకు మూలం గోవు’ అంటుంది అధర్వణ వేదం. ‘గోస్తుమాత్రా న విద్యతే’ ఆవుకు సాటియైనది లేదని యజుర్వేద మంత్రం. ‘సావిశ్వాయుః సావిశ్వకర్మ సా విశ్వాధాయాః’ ప్రపంచానికి శక్తిని ప్రసాదించేది గోవు అని వేదం ఉవాచ.

06/18/2017 - 22:08

ఆషాడం వచ్చిందంటే అమ్మ ఆరాధన మొదలైందనే చెప్పాలి. ప్రకృతి వసంతాగమనంతో కొత్తచిగుర్లు వేస్తుంది. గ్రీష్మం వచ్చి చెట్టుపుట్టలను వాగు వంకలను ఏరులను ఆఖరుకు నదులను కూడా ఎండగట్టిస్తుంది. భూతలం అంతా నీటి ఎద్దడికి అల్లలాడిపోతుంటుంది. వర్షదేవుడు ఎపుడు కనికరిస్తాడో అని ఆకాశం వైపు ఒక్క రైతులే కాదు సర్వజనావళి ఎదురుచూస్తుంది. కాలగమనం వరుణిని వెంట బెట్టుకువస్తుంది.

06/18/2017 - 22:06

సుబ్రహ్మణ్యేశ్వరాధన అనాదిగా వస్తున్నదే. సంతానప్రదాతయని, ఆరోగ్యాన్నిచ్చే నిధి యని సుబ్రహ్మణ్యుని కొలుస్తుంటారు. భారతదేశంలో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుంది. తమిళనాడు మరింత విశేషంగా ఈ ఆరాధన మనకు గోచరవౌతుంది. ఆషాడమాసంలోని పంచమి తిథి స్కంధపంచమిగా పేర్కొంటూ సుబ్రహ్మాణ్యారాధన చేస్తుంటారు.

06/18/2017 - 22:02

ఒక జాతి సర్వతోముఖాభివృద్ధి పొందాలంటే సంస్కృతి, సంప్ర దాయం, సంస్కారాలు ఆభరణాలై విలసిల్లాలి. జాతి ఆచార సంప్ర దాయాలవల్ల శుభప్రదమైన, సుఖవంతమైన, ఆదర్శప్రాయమైన నాగరికత పరిఢవిల్లుతుంది. వ్యక్తుల సంస్కా రాలవల్ల జాతి జవ జీవాలతో ఉన్నతోన్నత శిఖరాలవైపు ప్రయాణి స్తుంది. తద్వారా కుటుంబ పురోభివృద్ధి, సమాజ పురోగతికి సోపానాలు చేకూరుతాయ.

06/11/2017 - 21:40

మన సనాతన వాఙ్మయం అద్భుతమైన ఉదంతాల సమాహారం. మానవుడు ఆచరించవలసిన ధర్మాన్ని, సమాజానికి చేయవలసిన సేవను, జ్ఞానానికి ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. కాని నేడు జ్ఞానం, మేధస్సు అనే వాటికి నిర్వచనాలే మారిపోయాయి. కపటం, మోసం, అనైతికత అనేవి రాజ్యమేలుతున్నాయి. ఫలితం అశాంతి. మానవ మేధస్సుకు విలువనిచ్చి సమాజానికి వినియోగించే క్రమంలో ఎన్నో కఠిన నిబంధనలను ఎదుర్కొన్న మేధావుల ఉదంతాలను మనం పరిశీలించవచ్చు.

06/11/2017 - 21:38

అన్నింటి ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను ధర్మసంస్థాపనకోసం అనేక రూపాలుగా సృజియించుకుంటుంటాడు. ఓసారి పరమాత్మ తనను దారువులో నిలుద్దామనుకొన్నాడు. దారువులో తనకు అత్యంత ఇష్టమున్నవాణ్ణి తన రూపాన్ని రూపొందించమనితన భక్తునితో చెప్పాడు. కాని ఓ నియమం పెట్టాడు. ఆ నియమం పాటించలేదన్న కినుకతో సగం సగం పూర్తయి న రూపాలతోనే పూరీ క్షేత్రంలో జగాలనేలే జగన్నాథుడిగా స్థిరపడ్డాడు.

06/04/2017 - 22:48

ప్ర తి అవతారం పరమార్ధంతో కూడి ఉంటుంది. అవధి లేని ప్రతి అనుభూతికి ఆనందమే పరమార్థం. దయాదక్షాలతో స్వామి రక్షణ ఉంటుంది. దేవతలైనా రాక్షసులైనా వారి అహంకార నిర్మూలనకు శిక్షపడుతుంది. ధర్మరక్షణకు, సాధు జన పోషణకు మహావిష్ణువు పదావతారములు ఎత్తవలిసి వచ్చింది. అందులోనిదే వామనావతారము. అవతారములోకెల్లా ఈ అవతారం విశిష్టమైనది. ఐదవాతారము.
‘మత్స్య కూర్మ వరాహశ్చనారసింహాశ్చ వామనః’’

06/04/2017 - 22:44

శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది.

06/04/2017 - 22:42

నే టి సమాజంలో రామాయణ, భారత కథ తెలియనివారు సర్వసాధారణంగా ఉండరంటే అతిశయోక్తి లేదు. సమాజంలోని ప్రతి వ్యక్తి రామాయణం చదవడం ద్వారా గాని,వినడమో నాటకం సినిమా లాంటి మాధ్యమాల వలన రామకైతను తెలుసుకుని జీవన సుధారసాన్ని గ్రోలినవారే.

05/29/2017 - 00:35

కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు... ధర్మరాజు కర్ణుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. పోరుభీకరంగా సాగుతోంది. కర్ణుడి ధాటికి తట్టుకోలేక పోయాడు ధర్మరాజు. సారధిని కోల్పోయాడు..ఆయన కర్ణుడి విజృంభణకు తట్టుకోలేక శిబిరానికి తిరుగుముఖం పట్టాడు. ధర్మనందనుడు గాయాలకు చికిత్స చేయించుకుని సేద తీరుతున్నాడు.

Pages