S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/22/2017 - 22:26

భక్తి మార్గమునే ‘్భక్తి యోగమని’ అంటారు. నారదుడు, వాల్మీకి, హనుమంతుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, భక్త కన్నప్ప, భక్త రామదాసు, అన్నమయ్య, రామకృష్ణ పరమహంస, మీరాబాయి, పోతన వంటి వారంతా ఈ నవ విధములైన భక్తి మార్గములలో వారికి అనుకూలమైన మార్గములలో పయనించి ఆత్మజ్ఞానాన్ని పొంది మనకు మార్గదర్శకులైనారు. మనకు ఆధ్యాత్మిక రహదారిని చూపించారు.

05/22/2017 - 22:24

‘‘త స్మద్వా ఏతస్మాదాత్మనః ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభోన్నం అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్నరసమయః’’ పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. పురుషాది ప్రాణికోటి అంతా అన్నరసమయము.

05/22/2017 - 22:17

శ్రీమన్నారాయణుని అవతారాలలో శ్రీకృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుడు లీలా మానుష రూపధరుడై తాను భగవానుడినని చాటి ఒప్పించి పూజలందుకున్న ఇతిహాస నాయకుడు. కొడుకుగా, ప్రజా నాయకునిగా, ఆపన్న రక్షకుడిగా, ఒక మంచి స్నేహితునిగా.. ప్రేమపాత్రుడుగా, గోపికలకు మనోరంజకునిగా రాధకు హృదయే శ్వరునిగా, గోవులకు గోపాలునిగా శ్రీకృష్ణునిగా పుట్టిన మహావిష్ణువు కృష్ణావతారంలో చేయని కృత్యం లేదు.

05/14/2017 - 21:36

భయము, నమ్మకం కోల్పోవడం, చేయవలసిన విధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం, అసహనము, ఋణబాధలు, ఉద్రేకం కలగడం మొదలైనవి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూ వుంటాయి. అటువంటి సమయంలో ఏవిధమైన ఆలోచనలతో చేయాలి, ఏవిధంగా ముందుకు వెళ్లాలి, ఏవిధమైన దేవతను ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వాహనాన్ని అధిరోహించాలి అనే ఆలోచన చేయాలి. వాహనమంటే ఉపాసన దేవతను మన దగ్గరకు తీసుకువచ్చే మంత్రము.

05/14/2017 - 21:34

చిత్తశుద్ధితో- మనస్ఫూర్తిగా- మనస్సాక్షిగా ఇతరులకు చేయు సాయానే్న సేవగా మనం చెప్పుకోవచ్చు. ఉపకారానికి ఉపకారమే కాక అపకారికి కూడా ఉపకారం చేయువాడు నేర్పరి అని సుమతీ శతకకారుడు చెప్పాడు. సేవా కైంకర్యానికి ఎంతో మంది భక్తులు బారులు తీరుతారు. మానవ సేవే మాధవ సేవ అని నరుల్లో నారాయణుని అంశను చూస్తూ తోటివారికి సాయాన్ని చేయడమనేది భారతీయుల్లో అనాదిగా వస్తూనే ఉంది.

05/08/2017 - 22:50

మేఘచ్ఛాయబోలుదేహంకలవాడు. ఆజానుబాహుడు. పుంసాం మోహన రూపాయ... గొప్పరూపవంతుడు.గొప్ప గుణవంతుడు కోట్లాది పున్నమి చంద్రులకు సమానమైన కాంతివంతమగుమోము కలవాడు. సత్వగుణప్రధానుడు. ఇలా పదహారు శుభలక్షణాలతో ఒప్పారువాడు శ్రీరాముడు. దశరథుడు ఎన్నో పుణ్యకర్మలు, యజ్ఞయాగాది కార్యాలు చేసి భగవంతుని పుత్రుని రూపంలో శ్రీరాముడిని పొందాడు. పుట్టినప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

05/08/2017 - 22:48

అపార కృపావత్సలుడు కరుణానిధి అయిన మహావిష్ణువు తన భక్తుని కష్టాలను తీర్చడంకోసం ఓసారి నరసింహరూపంలో ఆవిర్భవించాడు. హిరణ్యకశ్యపుడు దానవేంద్రుడు. ఎంతో కాలం తపస్సు చేశాడు. తనను మించినవారెవరూ వుండకూడదని అనుకొన్నాడు. తన కన్నా బలవంతులు ఉండకూడదనుకొన్నాడు. అంతేకాదు తనను మానవులుకాని రాక్షసులుగాని దేవతలుగాని ఎవరూ వధించలేని వరాన్ని కోరుకున్నాడు.

05/08/2017 - 22:47

వేదాంతానికి, వైదిక ధర్మ ప్రవృత్తికి చెదపురుగుల్లా వేద విహిత మతాలు పుట్టి స్వైర విహారం చేస్తున్న కాలంలో వేదాంత విరుద్ధ శాస్త్రాలన్నింటినీ సమూలంగా నాశనం చేసి అద్వైత సిద్ధాంతం ద్వారా సర్వత్రా జ్ఞాన మార్గాన్ని ప్రతిష్ఠింపచేసారు శ్రీ శంకర భగవత్పాదులు.

04/30/2017 - 22:29

శ్రీ రామాయణంలో హనుమంతుని పాత్రను వాల్మీకి మహర్షి మలిచిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో సుందరకాండ మొత్తం హనుమ చేసిన అనేకమైన గొప్ప గొప్ప పనులను తెలియజేస్తూ ఆద్యంతం ఆ సక్తికరంగాను, జనరంజకంగాను ఉంటుంది. శ్రీరామునిపట్ల అత్యంత భక్తి కలిగిన హనుమ భక్తికి మారుపేరుగా ప్రసిద్ధి చెందాడు.

04/30/2017 - 22:27

భగవంతుడిని భక్తుడు దేనితో పూజించాలి? దేనితో పూజిస్తే ఆయన త్వరగా ప్రసన్నమవుతాడు? అని చాలామందికి సందేహం కలుగుతుంది. సంపన్నులు వజ్ర వైడూర్యాలతో కొలుస్తారు. సామాన్యులు యధాశక్తి అంటూ తనకున్న దాంతో ఆ స్వామిని ఆరాధిస్తారు.

Pages