S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/02/2017 - 22:05

భ క్షకులు ఉండిన స్థలంలో రక్షకులు తప్పనిసరిగా ఉండాల్సిందే అంటాడు రాముడు. ఆయుధాలను ధరించి వనవాసానికి బయలుదేరిన రామలక్ష్మణులను సీతమ్మ అనుసరిస్తుంది. ఓ హంతకుడుగా మారిన ఓ సన్యాసి కథను చెప్పిన జానకి మునుల మాదిరి జీవితాన్ని గడపడానికి అస్తశ్రస్త్రాలు అక్కర్లేదంటుంది.

04/02/2017 - 21:57

ఏదైనా చేయకూడనిది చేస్తే ఎక్కడ పుట్టావు. నీ తల్లి దండ్రులెవరు?అనడం పరిపాటి. మరి భూమిజ యైన మైథిలి జనకునికి నాగేటిచాలులో దొరికింది. నారీ లోకానికే శిరోమణిగా నేటికీ భాసిస్తోంది. పటిష్టమైన గృహస్థాశ్రమానికి ఆదర్శం సీతారాములనే పేరు తెచ్చుకుంది. అంతఃపురాల్లో అపురూపంలో పెరిగిన ఆ తల్లి కష్టాలకొలిమిలో మలమలా మాడింది. రావణుని చెరలో బంధీ అయంది. అగ్నిలో దూకి పునీతగా నిలిచింది.

03/19/2017 - 23:39

ఆదిఅంతము లేని భగవంతుని వ్యక్తమునకు మితి లేదని అని తెలియ చేసేదే ఈ నరసింహా వతారము. సృషి టస్థితి లయాదులకు కారణుడైన పరమాత్మను ఏ విధంగా ఉపాసిస్తే ఆ విధంగానే సాక్షాత్కరిస్తాడు. ఆ స్వామి నిర్గుణుడు, నిరాకా రుడు, నిర్మలుడు, నిస్సంశయంగా భగవంతుని ప్రార్థిస్తే చాలు ఆ దైవం కోరినరూపంలో కనిపించ డం కాదు కోరిన కోర్కెలనెల్లా ఈడేరుస్తాడని ఎందరో భక్తుల కథలను అనాదిగా వినవస్తూనే ఉన్నాయ.

03/19/2017 - 23:37

తిరుప్పావై పాశుర వైభవం
రచన: పింగళి పాండురంగారావు
వెల : అమూల్యం
ప్రతుల ప్రాప్తిస్థానం
సాహితీ మంజరి 38వ ప్రచురణ
8.71, లాయరు పేట,
ఒంగోలు - 523002
మొబైల్ : 9440554113
**

03/19/2017 - 23:35

ఆదర్శపురుషోత్తమునిగా ఆరాధించే రాముని బంటు ఆంజనేయుడు. రామ భక్త హనుమంతునిగా పిల్లా పెద్దలకు సుపరిచితుడు. ఈ ఆంజనేయుణ్ణి ప్రతివారు పూజిస్తారు. రామాయణానికి నాయకుడు శ్రీరామచంద్రుడైతే సుందరకాండకు నాయకుడు ఆంజనేయస్వామి. చీడపీడలను గ్రహ దోషాలను భూతప్రేత పిశాచాల బాధనుంచి దూరంకావడానికి ఈ ఆంజనేయుని స్మరి స్తారు. ఆత్మ విశ్వాసానికి ధైర్యానికి మారు పేరు మారుతి.

03/12/2017 - 23:00

వివేకచూడామణిలో శంకరులు ‘స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే’- స్వస్వరూపమైన ఆత్మ తోటి ఏకరీతి అనుసంధానం నిష్ఠ-్భక్తి అని వర్ణించారు. ‘ప్రేమ’అనేదే భక్త్భివనకు నిర్వచనం. పరమాత్మయందు సామాన్యుడు కనబరిచే ‘ప్రేమ’ సాకారంలో పూజలుగాను, అర్చనలు, స్తుతులుగాను కనబడితే, జ్ఞాని కనబరిచే ప్రేమ వర్ణనలకతీతమైనది.

03/12/2017 - 22:59

సేవాధర్మానికిమారుపేరు మారుతి. అఖిలలోకాలను గడగడలాడించిన రావణాసురుని అతని అంతఃపురం లోనే బుద్ధి గరిపిన వాడు. సముద్రలంఘనంలో మానవులందరికీ ముందు చూపు ఎలా ఉండాలో జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించాడు. పట్టుదలకు, పరాక్రమానికి నిలువెత్తుసాక్ష్యంగా నిల్చుని రామునితో ఆలింగన మహాభాగ్యాన్ని పొందాడు. అపశబ్దమే లేని వాక్కుగలవాడు , వ్యాకరణ ఉద్దండుడీతడు అని రాముని చేత పొగడబడ్డాడు.

03/12/2017 - 22:58

తామస భక్తికి ఉదాహరణగా రావణుణ్ణి చెప్పుకుంటారు. ఈ రావణుడు గొప్ప తపస్సు చేశాడు. శివునివల్ల ఎన్నో వరాలు పొందాడు. తన బాహుబలంతో కైలాసానే్న కదిలించాడు. దిక్పాలురందరికీ రావణుడంటే భయం కల్గించాడు. తన తమ్ముడైన కుబేరుణ్ణి శాసించి లంకానగరాన్ని తీసేసుకున్నాడు. త్రిలోకా ధివీరుడుగా ప్రశంసలందు కోవాలను కొన్నాడు. మానవులంటే చులకనభావాన్ని పెంచుకున్నాడు. ఆ మానవునిగానే మహావిష్ణువు పుట్టి రాముడిగా ఎదిగాడు.

03/12/2017 - 22:50

నిగ్రహం, సదాచారం లాంటి సద్గుణాలు ఎవరికి ఉన్నాయని వాల్మీకి నారదుణ్ణి అడిగి తెలుసుకొని మరీ రామాయణాన్ని రచించాడు. కలియుగంలో ఉన్న మనం మాతృప్రేమ, పితృప్రేమ, భ్రాతృప్రేమ, ఏకపత్నీవ్రతం ఇలాంటి సజ్జన లక్షణాల గురించి తెలుసుకోవాలంటే ఆదర్శపురుషునిగా ఎదగాలంటే రామాయణం ఒక్కటి చదివితే చాలు. మనిషిగా బతకడమెలాగో తెలుస్తుంది.

03/12/2017 - 22:46

భ గవంతునికి రూపం లేదు. నామంలేదు. కాని ఎవరి ఇచ్ఛ వచ్చినట్లు వారికి భగవంతుడు కనిపిస్తాడు. వారికి కోరుకున్న రూపంలోను వారు కోరుకున్న నామంలో దర్శనమిచ్చి వారికి ఆనం దాన్ని ఇస్తాడు. ఫాల్గుణమాసపు పున్నమిరోజు మీనాక్షిదేవి ఎంతోకాలం తపస్సు చేసి సుందరేశ్వ రుణ్ణి తన భర్తగా చేసుకొందట. అందుకని ఈ పున్నమిరోజు మీనాక్షి సుందరేశ్వరుల వివాహ మహోత్సవాన్ని శివభక్తులు జరుపుతారు.

Pages