S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/29/2017 - 23:19

ఈ జగత్తులోని జీవరాసులన్నింటికన్నా ఉత్కృష్టమయినది మానవ జన్మ. మనిషికి తక్కిన జీవరాసి కంటే అధికంగా ఉన్నవి, మేధోశక్తి, భావప్రకటనకి అనుకూలమైన శరీర నిర్మాణం. దానికి ఒక భాష, ఏ ప్రాంతాల వారికి వారి వారి భాష. అందువల్ల మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ లక్షణాలను వాడుకుని చక్కని జీవితం గడపడానికి వీలుగా మలుచుకోవడం మంచిది. జంతువులు బ్రతుకుతాయి. మనిషి జీవించాలి.

01/29/2017 - 23:17

చైత్రమాసంలో ధాతనే పేరుతోను, వైశాఖ మాసంలో అర్యయుడు అనే పేరుతోను, జ్యేష్టమాసంలో మిత్రుడు అనే పేరుతోను, ఆషాఢ మాసంలో వరుణుడు అనే పేరుతోను, తిరిగే సూర్యభగవానుడు మాఘమాసం పూముడు అనే పేరుతో సంచారం చేస్తాడు.

01/22/2017 - 22:49

తేలుకి కొండెంలోను, పాముకి నోటిలోని కోరలలోనూ విషం చిమ్మేలా వాటి అవయవ నిర్మాణం ఉంటుంది. ఆ విషాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో మాత్రమే వాటికి తెలిసిన విద్య. కేవలం తనకి ప్రమాదంజరగబోతోందనే అనుమానం వస్తే చాలు కాటువేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాయి. మానవునికున్న మేధోశక్తి అపురూపం, అపారం. దానిని సద్వినియోగం చేసుకున్నపుడే అతనికి మంచి విలువ వస్తుంది.

01/22/2017 - 22:44

త్యాగమునందు సంతోషంగలదని తాను గ్రహించుటయేకాక ప్రపంచమునకు చాటిన మహాఘనుడు అంగిరసుడు. ఈయన గొప్ప మహర్షి. సృష్టియందు ఎన్నింటిలో సృష్టించిన బ్రహ్మ సృష్టి రచన సమయమునందు తనకు అండగా యుండుటకు ముఖమునుండి కుమారుని సృష్టించి ఆయనకు అంగిరసుడు అని పేరిడెను. అంగిరస అనగా శరీరమునకు సారమయిన శ్వాస అని అర్థం.

01/15/2017 - 21:50

పరమేశ్వరుడు సర్వవ్యాపి, పూర్ణుడు మరియు నిత్యుడు. అందరిలోపలా, వెలుపలా వ్యాపించి ఉన్నాడు. అందరి అంతర్యామిగా అంతరాత్మ రూపములో అందరి హృదయ మందిరాలలో ఆవాసం చేస్తున్ననూ, ఆ పరమాత్మ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. మన వైద్య శాస్త్రం ప్రకారం చెప్పే గుండె, ఆధ్యాత్మికపరంగా చెప్పే హృదయము లేదని గ్రహించాలి.

01/15/2017 - 21:48

తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలో తిరువారూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగరాజు 1767లో జన్మించాడు. ఆయన తండ్రి రామబ్రహ్మం. తల్లి సీతమ్మ. రామబ్రహ్మం రామభక్తుడు. గంటల తరబడి శ్రీరామ పూజ చేసేవాడు. త్యాగరాజుకు కూడా తండ్రి చేసే రామపూజ అంటే చాలా ఇష్టంగా ఉండేది. తండ్రితోపాటు తానూ పూజాగృహ సమీపంలో కూర్చునేవాడు. తండ్రికి అవసరమయ్యే పూజాద్రవ్యాన్ని అందించేవాడు.

01/09/2017 - 00:07

భోగి పసి పిల్లల పండుగ. మకర సంక్రాంతి చిన్నాపెద్ద అందరికీ పండుగ. కనుమ పశువుల పండుగ. పసి పిల్లలకీ, కన్యకలకు, స్ర్తిపురుషులకీ, పశువులకీ చెందిన మకర సంక్రాంతి పండుగ మన పండుగల్లోనే పెద్దపండుగ. మనుషులికీ జంతువులకీ, పంటలకీ, వృక్షజాతికి, సర్వానికీ జీవప్రదాత అయిన సూర్యభగవానుడి ఆరాధనకోసం మన పూర్వులు రూపొందించిన మకర సంక్రాంతి సర్వులకూ పర్వదినమే!!

01/09/2017 - 00:06

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నుదుట విభూతి, చందనం కుంకుమ రేఖలతో అపర అయ్యప్ప స్వామిలాగా దర్శనమిచ్చే స్వాములు సమూహాలుగా శబరిమలకు వెళ్లి మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనంకోసం అర్రులుచాస్తారు. ఈ స్వామి హరిహర పుత్రుడుగా వాసికెక్కాడు. కోర్కెలను ఈడేర్చేస్వామిగా ఖ్యాతికెక్కాడు. పులిపాలను తెచ్చి తన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లితండ్రుల సేవ చేసాడు. తన భక్తులకు శనిదోషం తగలకుండా కాపాడతాడు.

01/09/2017 - 00:05

సంక్రాంతి పండుగకు ముందురోజు భోగి, దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరిరోజు. భోగి పండుగనాడే గోదా శ్రీరంగనాధుల వివాహం జరిగింది. ఆ జగజ్జనని జగన్నాయకుని చేరి భోగములందిన దినం.

01/08/2017 - 23:48

ఈ సకల చరాచర సృష్టికి మూలం భగవంతుడు. మనకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో ఆ భగవంతుడు ముందే నిర్ణయిస్తాడుఒకసారి ఒక వీధులు ఊడ్చేవాడి అనుభవంతెలుసుకొందాం. వీధులు ఊడ్చేవాడికి ఒకే పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. ‘‘రోజూ హాయిగా పూజలందుకొంటున్నావు, నా బతుకు చూడు ఎంత కష్టమో.. ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చేయి. నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు.

Pages