S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/07/2016 - 23:24

దేవతలు దానవులు కలసి పాలసముద్రాన్ని మధించగా అదుండి మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ తల్లిని మహావిష్ణువు స్వర్గలక్ష్మిగా ఆరాధించాడు. దేవతలందరూ ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడానికి అనేకవిధాలుగా స్తుతించారు. ఆ తల్లిని మహావిష్ణువు తన ఇల్లాలిని చేసుకొన్నాడు. నారాయణుడిని మహాలక్ష్మి చూచిన దేవతలందరూ మహదానందంతో వీరిద్దరికీ కల్యాణమహోత్సవాలు జరిపించారు.

08/07/2016 - 23:21

శ్రీరమణ మహర్షి 1879-1950 మధ్యకాలంలో జీవించారు. శ్రీ నిర్గుణ చైతన్యస్వామిజీ 1947లో గుంటూరు జిల్లా, పెదపూడి గ్రామంలో జన్మించారు. అక్కడివారి ఆశ్రమములో ఇచ్చే బోధల ఆధారంగా వీరిరువురి ధ్యానపథముల ఫలితములను వివరించడమైనది. మానవ శరీరమునందు నేను - నేను అని ఏది తోచుచున్నదో అది ‘మనస్సు’ అన్నారు రమణులు. అసలు మనస్సు యొక్క ఉనికి హృదయమేనని స్పష్టపరిచారు నిర్గుణులు.

07/31/2016 - 21:36

పార్వతీ పరమేశ్వరుల ముద్దుబిడ్డడు కుమారస్వామి. కాని ఈ కుమారుని జననంలో ఎన్నో మలుపులున్నాయ. తారకాసురుని సంహారం కోసం దేవతలంతా పరమేశ్వరుని బిడ్డడిని ప్రసాదించమని వేడుకున్నారు. రాక్షససంహారం కోసం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు దేవతలు. కుమా రోదయంలో కాలయాపన జరుగుతూ వచ్చిం ది. ఆ కాలవిలంబనాన్ని భరించలేని దేవతలు పరమేశ్వరుని మళ్లీ మళ్లీ వేడుకున్నారు.

07/25/2016 - 00:25

అమ్మవారికి చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు, ఆశ్వీయుజమాసంలో జరుపబడే శరన్నవరాత్రులు (దేవీ నవరాత్రులు) లోక ప్రసిద్ధమైనవి. వసంత ఋతువు, శరధృతువులలో ప్రజలు నానా విధములైన రోగాల బారిన పడుతుంటారు. అలాంటి బాధలు రాకుండా ఉండడంకోసం అమ్మవారిని కొలుస్తారు. ఈ రెండు నవరాత్రులే ప్రసిద్ధమైనప్పటికి, దేవీ భాగవతంలో అమ్మవారి నవరాత్రి చతుష్టయం వివరించబడింది.
శ్లో॥ తథాషాడే మాఘే కార్యోమహోత్సవః,

07/17/2016 - 22:26

అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు- అదే మానవుడుగా నీవు చేయాల్సిన విధి అని చెప్పిన దివ్యతేజోరాశి సత్యసాయబాబ. అనంతపురం జిల్లాలో కుగ్రామం పుట్టపర్తి 1926 నవంబరు 23న వికసించిన దివ్యకమలం సత్యసాయబాబ. ఆ తేజోరాశి 2011 ఏప్రిల్ 24న అస్తమించి ఎందరికళ్లల్లో కన్నీళ్ల జలాశయాల ఉత్పన్నానికి కారణం అయంది. బాల్యావస్థనుంచి ఎనె్నన్నో దివ్య మహిమలను చూపిన సాయ ఎందరికో సద్గురువు.

07/17/2016 - 22:20

నిరాకారుడు, నిరంజనుడు, నిర్మలుడు, నిస్సంగుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు సుతుడై పుట్టి యశోదానందనుడై -పుట్టీ పుట్టక ముందు నుంచే ఎన్నో మహిమలను లీలా విశేషాలను చూపుతూ ఉన్న లీలామానుష వేషధారి అఖిలాండ కోటికి సద్గురువు శ్రీకృష్ణుడు.

07/17/2016 - 22:18

వ్యాసం వశిష్ఠ నప్తారం-
శక్తేః పౌత్ర మకల్మషమ్‌
పరాశరాత్మజం వందే-
శుకతాతం తపోనిధిమ్

07/10/2016 - 21:41

శ్రీరామచంద్రునిది నీలమేఘ్ఛాయ శరీరమైతే లక్ష్మణుడిది బంగారు వర్ణపు శరీరం. శరీర ఛాయే కాదు అతని గుణగణాలు బంగారానికి తీసిపోవు. లక్ష్మణునికి శ్రీరాముడు అనే్న కాదు, ఆదర్శమూర్తి కూడాను. అసలు రాముడు వేరు లక్ష్మణుడు వేరా అంటే కాదు, ఇద్దరూ ఒక అంశలో పుట్టినవారేనన్నది సత్యం.పుత్రకామేష్ఠి యాగం చేసియజ్ఞపాయస ప్రభావంతో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మించారు.

07/10/2016 - 21:38

పవిత్రమైన వేదాలను పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు వేదములు దొంగిలించి సముద్రగర్భంలో దాక్కున్నాడు. లోక కళ్యాణంకోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలు దొంగిలించిన రాక్షసుణ్ణి సంహరించాడు. తిరిగి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అందించి యుగ యుగాలకు ఆదర్శ దైవంగా నిలిచాడు. వేదం పఠనం వలన జ్ఞానం వికసిస్తుంది. వేదం ఒక విశ్వం. అపర విజ్ఞాన శాస్త్ర భాండాగారం. ‘విద్’ అనే ధాతువు నుండి ఏర్పడినదే ‘వేదం’ అంటారు.

07/03/2016 - 21:54

అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చందనోత్సవంతోపూరీ జగన్నాథుని రథాల తయారీకి శ్రీకారం జరుగుతుంది. దీని మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. నరేంద్రకొలనులో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి.

Pages