S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/03/2016 - 21:51

త్రిలోక సంచారి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు.

07/03/2016 - 21:44

మంచి మాట చెప్పినా వినేవాడుండడు. ఒకవేళ వింటే విన్నవాడు గొప్పవాడవుతాడు. మారీచుడు రాముణ్ణి గురించి గొప్పగా చెప్పినా రావణుడు వినలేదు. తన అనుభవంతో కలిగిన రామశబ్దం మహిమను గురించి ఎంత చెప్పినా వినలేదు. రావణాసురుడి చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం మంచిదని, రావణుడు చెప్పినట్లే బంగారు లేడిగా మాయదారిగా సీతారాముల ఆశ్రమం నందు తిరగడానికి మారీచుడు నిశ్చయంచుకుని వెళ్లాడు.

07/03/2016 - 21:41

సంతోషం కోసం ఎక్కడో వెతక్కర్లేదు. అది మన మనసులో ఉంది అంటారు విజ్ఞులు. మనిషికి తృప్తి ఉంటే చాలు సంతోషం అదే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సంతోషం ఉన్నా సరే పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు అందరూ ఆనందాన్ని కోరుకునేవారే. తృప్తి స్వర్గాన్ని ఇలలో కనిపింపచేస్తే అసంతృప్తి సంతోషంగా ఉన్న ఇంటిని కూడా నరకాన్ని చేస్తుంది.

06/27/2016 - 21:56

ఫ్లాష్‌బ్యాక్ @ 50

అమరావతి చిత్ర పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కథ వాల్మీకి రామాయణం ఆధారం.
రచన: వడ్డాది
నృత్యం: వేణుగోపాల్
కెమెరా: వెంకటి, జనార్ధన్
కూర్పు: తంగవేలు
కళ: గోడేగాంకర్
సంగీతం: ఘంటసాల
నిర్మాత: ఆర్‌సి రెడ్డి
దర్శకత్వం: వసంతకుమార్‌రెడ్డి

06/27/2016 - 21:47

సినిమా తారల క్రేజ్ అందరికీ తెలిసిందే. కెరీర్ సరైన గాడిలో పడిందంటే డబ్బుకు కొదవుండదు. డిమాండ్ చేసినంతా చెల్లించి కాల్షీట్లు తీసుకుంటారు. బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా ఇప్పుడలాంటి క్రేజ్‌నే ఎంజాయ్ చేస్తోంది. హాలీవుడ్‌కు వెళ్లొచ్చిన తరువాత -బాలీవుడ్ హీరోల రేంజ్‌ని మించిపోయి పాపులార్టీ వచ్చేసిందామెకు.

06/26/2016 - 21:52

భగవంతుణ్ణి ఆరాధించటం, స్తుతించడం, కీర్తించడం, అర్చించడంలాంటివాటిలో ప్రతిరోజూ భగవంతుని ముందు కూర్చుని దేవుని షోడశోపచారాలు చేసి భగవంతునికి అషోత్తర శతనామావళులు పఠించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం భక్తులంతా చేసే పనే. కాని ఈ కొబ్బరి కాయ కొట్టడంలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఈ క్రియను నిర్వర్తిస్తే పూజాఫలితం పూర్తిగా అందుతుందంటారు పెద్దలు.

06/19/2016 - 22:04

ఈ విశాల విశ్వంలోని సమస్త ప్రాణికోటి పీల్చే గాలి ఒక్కటే. త్రాగే నీరు ఒక్కటే, నివసించే నేల ఒక్కటే, పై కప్పు ఆకాశం ఒక్కటే. అందరికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడొక్కడే. చల్లదనాన్ని అందించే చంద్రుడొక్కడే. అదే విధంగా అందరి దైవం ఒక్కడే. ఆయనే భగవానుడు. అల్లా, గాడ్.

06/19/2016 - 22:02

భగవద్గీతలో ‘ సంభవామి యుగే యుగే’ అన్నట్లు ప్రజలు ఐహిక సుఖపరాయణులై ధర్మాన్ని, నీతిని మరచి భక్తిలోపించి, రక్తిలోబడి భగవంతుని మరిచిపోయినవారి ఉద్ధరణకు, సన్మార్గంలో పెట్టుటకు భూలోకంలో అవతరించారు సుప్రసిద్ధ వైష్ణవ భక్తులు ఆళ్వారులు.

06/12/2016 - 21:21

కుల వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళును కడిగేయడానికి జీవితాంతం అలు పెరగని కృషిచేసిన మహానీయుడు ‘‘గాడ్గేబాబా.’’ కర్మయోగి. సామాన్యుని దగ్గరలో తన జీవన విధానం ఆయన సొంతం అయినా గాడ్గే అసలు పేరు దేబూజీ. మహారాష్టల్రోని అమరావతి జిల్లా పరిత్ అనే రజక కులంలో 1876 ఫిబ్రవరి 23న జన్మించారు గాడ్గే.

06/12/2016 - 21:19

భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయా కాలాలలో ఋషితుల్యులైన మహనీయులెందరో జన్మించారు. వారిలో త్రిమతాచార్యులుగా ప్రసిద్ధి చెందిన శ్రీశంకరాచార్య శ్రీరామానుజాజార్య, శ్రీమధ్వాచార్యులు ముఖ్యులు. నాటి సనాతన ధర్మాన్ని బౌద్ధ, జైన, శూన్య, వామాచార సిద్ధాంతాలతో భ్రష్టుపరుస్తున్న సమయంలో జన్మించి వైదిక ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని పరీవ్యాప్తం చేశారు.

Pages