S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/05/2016 - 23:52

హిరణ్యకశ్యపుడు మహాతపస్వియై ప్రపంచం అంతటిలోనూ ఎదురులేని మహాశక్తివంతుడు అయినాడు. తనను ఎదిరించగల వ్యక్తి ఎవడైనా ఈ భూమి మీద ఉంటే వచ్చి తనను గెలవ వలసిందిగా సవాలు విసిరాడు.
హిరణ్యకశ్యపుణ్ణి ఎదిరించగల ధీరుడు ఎవ్వడూ ముందుకు రాలేదు. దానితో అతడు అహంభావంతో విర్రవీగి- ఈ త్రిలోకాలకూ అధిపతి తానే అనీ, ఈ సర్వసృష్టికీ కర్త తానేననీ ప్రకటించుకొనసాగాడు.

06/05/2016 - 23:50

దై వాన్ని ప్రార్థించడం మనిషికి పెద్ద ఉపశమనం. పొద్దుట లేవగానే ‘నా ఈ జీవితం సుఖ సంతోషాలతో సాగించాలని శతకోటి దేవతలకి వందనాలు’ అని మనసులోనే చెప్పుకోవటంలో మనిషికి ఒక తృప్తి లభిస్తుంది. ఆపదలో వున్నపుడు ఇష్టదైవాన్ని స్మరించడంతో మనసు స్వాంతన పొందుతుంది. ప్రార్థించడమంటే ప్రత్యేకించి గుడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడ వున్న ఏం చేస్తున్నా దైవాన్ని ఆరాధించడం సాధ్యమే. ఇది మూఢ నమ్మకం కాదు. బలహీనత కాదు.

06/05/2016 - 23:46

ఛేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడమో లేక ఆ ఉపకారాన్ని చేసిన మనిషిని సదాగుర్తుంచుకోవడం వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండడమే కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు. అనేకానేకవిధాలుగా మనిషికి సాయం చేస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికే అనేక రకాల పండుగలు పుట్టుకొచ్చాయి.అట్లానే ప్రతి చెట్టూ ఏదోఒక రకంగా మానవునికి ఉపయోగపడేది. ఆయుర్వేదశాస్తమ్రూ ప్రతిచెట్టూ మనిషి అవసరాలకు పనికి వచ్చేదని చెప్తుంది.

05/30/2016 - 23:53

శ్రీసీతారాముల అనన్యభక్తుడైన హనుమంతుడు అఖండ బ్రహ్మచర్య వ్రతపాలకుడు. అత్యంత శక్తి సంపన్నుడు. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు అవనిధి. పరమనీతిజ్ఞుడు, పరాక్రమధీశాలి. శాస్త్ర పారంగత విద్వాంసుడు. సరళ స్వరూపుడు. జీవిత సర్వస్వాన్నీ రామాంకితమొనర్చినవాడు. ఆయన రోమ రోమం రామమయం.

05/30/2016 - 23:51

* మనిషి ఆయుర్దాయం 100 సం.లు అయితే కృతయుగంలో 1000 సం. ఎలా బ్రతికారు?
- సి.వాసుదేవరావు, శ్రీకాకుళం

05/22/2016 - 21:58

ప్రతి కార్యంలోనూ తొలి పూజలందుకునే దైవం, విఘ్ననాశకుడు శ్రీ వినాయకుడు. ఈయనకి 64 రూపాలున్నాయంటారు. వాటిలో 32 రూపాలు ముఖ్యమైనవనీ, మళ్ళీ అందులో షోడశ రూపాలు అతి ముఖ్యమైనవని చెబుతారు. వీటిలో శే్వతార్క గణపతిని - తెల్ల జిల్లేడు వృక్షాలు 100 సంవత్సరములపైన వున్నట్లయితే వాటి మూలంలో గణపతి ఆకారం తయారవుతుందని ప్రశస్తి. అయితే ఇలాంటి గణపతి రూపం దొరకటం దుర్లభమని పెద్దలు చెబుతారు.

05/22/2016 - 21:55

అది సిక్కుల గురువు అర్జునదేవ్ కాలం. ఆఫ్‌ఘనిస్థాన్‌లోని కాబూల్ నించీ అమృతసర్‌లోని స్వర్ణమందిర దర్శనానికి భక్తులు బయల్దేరారు. వాళ్ళు దారిలో ఒక సిక్కును, అతని భార్యను కలిశారు. ఆ దంపతులు ఆ సమూహానికి (సిక్కు పరిభాషలో ‘‘సంగత్’’కు) సేవ చేశారు. ఆ సిక్కు భక్తుల పాదాలు ఒత్తాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే విసనకర్రతో విసిరాడు. వాళ్ళకోసం నీళ్ళుతెచ్చాడు. ఇంకా ఎన్నో అనుకూలాలు కల్పించాడు.

05/15/2016 - 23:10

‘‘్ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’’ జగత్తును నడిపేది ధర్మం. ‘్భక్తి’్భవం అనేకత్వంలోంచి ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శింపచేసే వెలుగును, చైతన్యాన్నిస్తుంది. ఇదిగో ఈ భిన్నంలో అభిన్నాన్ని దర్శించటానే్న ‘అద్వైత’ మన్నారు. దీన్ని బోధించిన జగద్గురువు- శంకరాచార్యులు. మానవ జాతి బహుజన్మల నోము ఫలం- జగద్గురు శ్రీమచ్ఛంకర భగవత్పాదుల అవతారం.

05/08/2016 - 21:37

ప్రాచీన భారతీయ శాస్త్రాలలో అఖిలేశ్వరుని సంగ్రహముగా ఈశ్వరుడనియే అందురు. ఈశ్వరుడు అనగా శివుడు విష్ణువు కాదు. ఇత్యాది భావాలకు తావివ్వరాదు. ఈశ్వరుడు అనగా సమస్తమునకు ప్రభువు అని అర్థము. మనము ఉండే బ్రహ్మాండమే ఆద్యాంతములు తెలియనిది.

05/02/2016 - 03:17

జన్మలన్నింటిలో మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. దీనిని సఫలం చేసుకోవడానికై ప్రతి ఒక్కరు విశేషమైన కృషి చేసి తీరాలి. అలా తన జన్మను సార్ధకం చేసుకున్న విశిష్ట పురుషులలో బసవేశ్వరుని పేరు తప్పక చెప్పుకోవాలి.

Pages