S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/12/2016 - 00:19

అనేకమంది దేవతారాధన చేయాలని దేవతలను మెప్పించాలనివారి అను గ్రహం పొందాలని దీక్ష వహించి పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తుంటారు. ఇంకొం దరు ఎక్కడ మహిమలను బహిర్గతమవు తున్నాయని అంటే అక్కడికి వెళ్తుంటారు. దేవాలయా లకు వెళ్లి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తుంటారు. తండోప తండాలుగా దేవాలయాలకు వచ్చే భక్తులనో, లేక పుణ్యక్షేత్రాల కు వెళ్లేవారినో చూస్తే భక్తి మానవుల్లో ఎంతగా పెరిగి పోయందో అనిపిస్తుంది.

09/12/2016 - 00:15

శ్రీగణేశతత్త్వం
వ్యాఖ్యాత:
కాశీభొట్ల సత్యనారాయణ
మూల్యం: రూ.36/- లు
ప్రతులకు
శ్రీమతి కాశీభొట్ల లక్ష్మి
2-7ఎ-12, శివాలయం దగ్గర
వెంకట నగర్
కాకినాడ,
ఫోన్: 9247320421
***
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్
ఫోన్: 0866-2410652

09/12/2016 - 00:15

మానవుడు అజ్ఞానంతో అనేక పాపాలు చేస్తూ జ్ఞానోదయమైన తర్వాత తన పాపాలకు నిష్కృతి లేదని, అవి క్షమించబడవని నిరాశ చెందుతాడు. నిజానికి మనుషుల్లో అపరాధం చెయ్యని వారెవరూ లేరు. అయితే అత్యధికంగా దైవంవైపు మరలి క్షమార్పణ అర్థించేవారే మేలైన అపరాధులు అవుతారు.

09/12/2016 - 00:10

‘ఎరుక’ అను మాట వినగానే వేమనయోగి వంటి మహనీయులెందరో మనకు గుర్తుకొస్తారు. అసలు ఆ మాటకు గల శబ్దార్థములు తెలివి, జ్ఞానము, మెలకువ, పరిచయము, సోదె, గుర్తు, జోస్యము, Knowledge, understanding అన్నీ మనకు తెలిసినవే. ఎరుకను వ్యవహారిక ఫదముగా ఆలోచించినప్పుడు, ఎరుక మనకు రావాలంటే మనము ముందుగా సంపాదించుకోవలసిన విషయము ఓ అవగాహన మనకు తప్పక ఉండితీరాలి.

09/04/2016 - 21:18

భారతదేశ భూమి వేదభూమి, పుణ్యభూమి, దానినుంచే ఉద్భవించే మట్టి, త్రివేణి సంఘమంగల, పవిత్ర భూమి, నాలుగు వేదాలు పుట్టిన భూమి, గీతామృతము పంచిన భూమి, పంచశీల పంచిన భూమి.

09/04/2016 - 21:16

శ్రీగణేశ స్తోత్రములు
సంకలనం
కప్పగంతు వెంకట రమణమూర్తి
మూల్యం: రూ.60/-లు.
ప్రతులకు
గ్లోబల్ న్యూస్
బి2, ఎఫ్12, రామరాజానగర్,
సుచిత్రా సెంటర్ సుచిత్రా జంక్షన్ పోస్ట్
సికింద్రాబాద్ - 67 - ఫోన్: 9246165059
***

08/28/2016 - 21:39

రామచంద్రుని భక్తులలో అగ్రగణ్యుడు అంజనాసుతుడైన హనుమ. ఆయన హృదయంలో స్వామి ఎప్పుడూ కొలువుండిపోయాడు. హృదయం చీల్చినా కనబడేది ఆ రాముడే. శ్రీరాముని గుణగణాలు, శుభలక్షణాలను వివరించగల శక్తి ఆయనకున్నంతగా మరొకరికి లేదు.

08/28/2016 - 21:35

వౌనము మూర్తిమంతమైన దక్షిణామూర్తివంటివారు శ్రీరమణ మహర్షి. అతని వాక్కు ఋషుల ఉపదేశం. అద్వైత సారాన్నీ, ఉపనిషత్తులందించిన ఆత్మ తత్త్వాన్నీ, బోధామృతంగా ప్రపంచానికి పంచి ఇచ్చారు. ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి, కారుణ్యమూర్తి రమణ మహర్షి. నిరాధారుడై గగన సమానుడై, పూర్ణుడై, నిశ్శబ్దుడై, గురుస్వరూపమై వెలుగు పరబ్రహ్మము రమణమహర్షి.

08/21/2016 - 21:40

శ్రీకృష్ణావతారం సర్వులకూ ఆమోదయోగ్యమైంది. శ్రీకృష్ణుణ్ణి దుష్టులు సైతం తప్పుపట్టలేరు. శశిపాలుడు కృష్ణుని పైన 100 తప్పులు చెప్తానని చెప్పినా వాటిలోఎంత తప్పులున్నాయో వాటిని విన్నవారందరికీ బాగాతెలుసు. తప్పెరిదో తెలుసు. అందుకే ఎవరైనా సరే శ్రీకృష్ణుని తలవకుండా ఉండలేరు. హరహరబ్రహ్మాదుల నుండి, సామాన్యమానవులవరకు అంటే పండితులతోపాటు పామర జనం కూడా హరే కృష్ణా అని అనకుండా ఉండలేరు.

08/21/2016 - 21:35

శ్రీకృష్ణావతారంలో కృష్ణుడు పుట్టిన మొదలుకొని ఆయన నిర్యాణం దాకా జరిగిన ప్రతి సంఘటనా మానవలోకానికి ఆదర్శమైందే. జీవుడు ఏవిధంగా మానవలోకంలో మసులుకోవాలో తెలియచేసే సంఘటనలే కాదు మానవవికాసానికి, జీవాత్మనే పరమాత్మ అని తెలియజేసే వృత్తాంతాలే ఎక్కువ. లోకంలో ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నదానే్న ఉన్నసత్యాన్ని బహుకోణాల్లో విశే్లషించినట్లు ఉన్న సత్యాన్ని పలువురు పలువిధాలుగా చెప్తున్నారు. భగవంతుడు ఒక్కడే.

Pages