S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 02:26

కామారెడ్డి, జనవరి 21: రవాణాశాఖ నిబంధనలు పాటించి వాహనదారులు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శనివారం పార్శిరాములు కల్యాణ మండపంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, ప్రజలు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.

01/22/2017 - 02:25

కామారెడ్డి టౌన్, జనవరి 21: మాట కంటే పాటే గొప్పదని, కళాకారులు పాడే మాటలు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కౌడి రవీందర్ రచించిన కామారెడ్డి నూతన జిల్లాకు సంబంధించిన వీడియో అల్బమ్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. జిల్లాపై పాటలను చిత్రీకరించిన బృందాన్ని అభినందించారు.

01/22/2017 - 02:24

రామన్నపేట, జనవరి 21: పొలానికి నీళ్లు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంటుషాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కక్కిరేణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కట్ట భిక్షం (68) అనే రైతు గ్రామ శివారులో తమ వ్యవసాయ బావివద్ద మోటారు పెట్టడానికి వెళ్లి సోమవారం విద్యత్‌షాక్‌కు గురైయ్యాడు.

01/22/2017 - 02:23

భువనగిరి, జనవరి 21: గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సకాలంలో వినియోగించని అధికారులపై మంత్రి జూపల్లి క్రిష్ణారావ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం భువనగిరి మండలం బండసోమారం గ్రామంలో చేపడుతున్న గ్రామీణ ఉపాధి హామి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతు ఇజిఎస్ నిధులను ఉపయోగించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

01/22/2017 - 02:23

బీబీనగర్, జనవరి 21: ప్రజల ఆశయాలకనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర పంచాయతిరాజ్‌శాఖమంత్రి జూపల్లి క్రిష్ణారావ్ అన్నారు. శనివారం బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామంలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ 13లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయితి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

01/22/2017 - 02:22

నార్కట్‌పల్లి, జనవరి 21: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో కలసి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. శనివారం చెర్వుగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై సుమారు రెండు గంటల పాటు సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు అందించారు.

01/22/2017 - 02:21

నల్లమాడ, జనవరి 21: పదిమంది గొప్పగా చెప్పే విశేషాలు, వింతలు, యాత్రా స్థలాల గురించి విన్నప్పటికంటే వాటిని చూసినప్పుడు వాటిపై పెరిగే అవగాహన, వాటి వల్ల వచ్చే పరిజ్ఞానం ఎక్కువని చెప్పుకోవచ్చు.

01/22/2017 - 02:20

గుత్తి, జనవరి 21 : గుత్తి రైల్వే జిఆర్‌పి పోలీసు స్టేషన్ పరిధిలోని బసినేపల్లి పెద్దవంక సమీపంలో శనివారం తెల్లవారుజామున వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. ఈ ఘటన లో ఎస్1 బోగిలో ప్రయాణిస్తున్న కే శమ్మ మెడలో నుంచి రెండున్నర తు లాల బంగారు చైన్ అపహరించుకుపోయారు. ఈమేరకు బాధితురాలు కేశమ్మ తిరుపతి జిఆర్‌పి పోలీసు స్టే షన్‌లో ఫిర్యాదు చేశారు.

01/22/2017 - 02:20

ఉరవకొండ, జనవరి 21 : రానున్న ఎన్నికల్లో టిడిపికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి జో స్యం చెప్పారు. శనివారం పట్టణంలోని దేవాంగుల కల్యాణ మండపంలో హం ద్రీనీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద నియోజకవర్గ పరిధిలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డి మాండ్ చేశారు.

01/22/2017 - 02:19

అనంతపురంటౌన్, జనవరి 21: నగరపాలక సంస్థ కమిషనర్ సురేంద్రబాబుపై అధికార పార్టీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్‌లో దాడి చేయటాన్ని నిరసిస్తూ శనివారం విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయ గేట్లు మూసివేసి సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. కమిషనర్‌పై దాడికి పాల్పడిన కార్పొరేటర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Pages