S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 02:11

రాజమహేంద్రవరం, జనవరి 21: కాతేరు గ్రామపంచాయితీలో జరిగిన రూ. కోటి 10లక్షల నిధుల దుర్వినియోగం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని వైసిపి నాయకుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పంచాయితీలో కుంభకోణం వెలుగుచూసినా అధికార పార్టీ నాయకుల వౌనంగా ఉండటం ఈ అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందన్నారు.

01/22/2017 - 02:10

రాజమహేంద్రవరం, జనవరి 21: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ ఈనెల 26వ తేదీన 4 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించనున్నట్లు కార్పొరేటర్ బొంతా శ్రీహరి చెప్పారు.

01/22/2017 - 02:08

ప్రత్తిపాడు, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ రామరాజ్యంగా అవతరించునున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని పాతమల్లాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు.

01/22/2017 - 02:08

గుంటూరు (కల్చరల్), జనవరి 21: ‘దేవాదిదేవ నిను కీర్తించి భజింప మాకు తరమా, సకల లోక రక్షకా, చైతన్య స్వరూప, అభీష్ట భక్తవరదాయకా’ అంటూ పలువురు రంగస్థల నటీనటులు తమ గాత్ర మాధుర్యాలతో ఇష్టదైవాలను ప్రార్ధిస్తూ, పాత్రోచితమైన సహజ నటనాకౌసలాన్ని మేళవించి, సమర్పించి, ప్రదర్శించిన పద్య నాటకాలు భక్త్భివ భరితమై అలరారాయి.

01/22/2017 - 02:07

మంగళగిరి, జనవరి 21: మంగళగిరి మున్సిపల్ వైస్‌చైర్మన్ సంకా బాలాజీగుప్తా (టిడిపి) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావుకు బాలాజీగుప్తా అందజేశారు. బాలాజీగుప్తా రాజీనామా లేఖ అందిందని, వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారని కమిషనర్ టీవీ రంగారావు శనివారం రాత్రి తెలిపారు.

01/22/2017 - 02:07

గుంటూరు, జనవరి 21: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని పర్యటన చేసిన ప్రతిసారి టిడిపి నేతల వెన్నులో చలి పుడుతోందని, కంటిమీద కునుకు కరవవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు.

01/22/2017 - 02:05

కొత్తగూడెం, డిసెంబర్ 21: జిల్లాల విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పరిపాలనా సౌలభ్యంతోపాటు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం జరిగేలా చూసే లక్ష్యంతో ఏర్పడిన కొత్త జిల్లాలో రెండు నెలలు గడుస్తున్నా జిల్లా పంచాయతీల శాఖలో మాత్రం ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.

01/22/2017 - 02:05

భద్రాచలం, డిసెంబర్ 21: ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి, వారిలో విద్యా నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ రాం కిషన్ అన్నారు.

01/22/2017 - 02:04

ఖమ్మం(స్పోర్ట్స్), డిసెంబర్ 21: సమగ్ర క్రీడాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖేలోఇండియాను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఏటా అండర్-16 వయస్సు కేటగిరీలో జరిగే పోటీలను ఇప్పటి నుంచి కేంద్ర యువజన సర్వీసుల శాఖ నిర్వహించనుంది.

01/22/2017 - 02:04

నేలకొండపల్లి, డిసెంబర్ 21: గ్రామాలలోక్యాష్‌లెస్ లావాదేవీలు, ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పడాలని నేలకొండపల్లి ఎంపిడిఓ ఆళ్ళ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రామాలలో వ్యాపారం చేసేవారు తప్పకుండా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. దానికోసం డిజిటల్ వ్యవస్థ అమలు ఉందన్నారు.

Pages