S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 02:19

అనంతపురం సిటీ, జనవరి 21: నేడు జిల్లాలో పర్యటన చూస్తున్న కేంద్ర కరవు బృందానికి అర్జీలు ఇవ్వాలనుకునే ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు 24వ తేదీన ఇవ్వవచ్చునని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8:30 గంటల నుండి 9 గంటల వరకు కేంద్ర కరవు బృందానికి అనంతపురం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇవ్వవచ్చునని తెలిపారు.

01/22/2017 - 02:18

అనంతపురం అర్బన్, జనవరి 21: టిడిపి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శిం చారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరవు తాండవిస్తోందన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన వాతావరణ బీమా ఇంతవరకు రైతుల ఖాతాల్లోకి చేరలేదన్నారు.

01/22/2017 - 02:17

కొండాపురం, జనవరి 21: కడప - తాడిపత్రి ప్రధాన రహదారిపై మండలపరిధిలోని గంగాపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి కృష్ణా జలాలు రోడ్డుపైకి చేరాయి. గత ఏడాది అక్టోబర్ 2 నుండి కృష్ణా జలాలు గండికోట జలాశయంకు చేరుతున్నాయి. ఈ నేపద్యంలో శనివారం నాటికి గండికోట జలాశయం 4.978 టి ఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. ఔట్‌ప్లోయింగ్ లేకపోవడంతో గండికోట జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో రోడ్డుపైకి నీరు చేరాయి.

01/22/2017 - 02:16

కడప,జనవరి 21: విద్యాశాఖలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలకు పాల్పడి అర్హులను గాలికి వదిలి, అనర్హులతో పోస్టులు భర్తీ చేయడంపై ఆరోపణలు రావడంతో జిల్లా అధికార యంత్రాంగంపై సిఐడి బృందం ఆధ్వర్యంలో వచారణకు సిద్ధమైనట్లు సమాచారం.

01/22/2017 - 02:16

సిద్దవటం,జనవరి 21: మార్చినెలాఖరులోగా మండలంలోని 10గ్రామపంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిచేయాలని ఎంపిడివో జయసింహా మండల అధికారులకు సూచించారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో శనివారం ఉపాధిహామీ, డ్వాక్రా, పంచాయతీరాజ్ అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరవుతాయన్నారు.

01/22/2017 - 02:15

కడప,(క్రైమ్)జనవరి 21:దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణాల్లో గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో జరిగిన క్రైమ్ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గస్తీ చేయడం వల్ల పలు నేరాలు జరగకుండా ఆపవచ్చునన్నారు. ఎస్సీ, ఎస్టీకేసులతోపాటు పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

01/22/2017 - 02:15

ప్రొద్దుటూరు టౌన్, జనవరి 21: విభజనచట్టంలో పొందుపరిచినవిధంగా కడపజిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ ఎంవి.మైసూరారెడ్డిలు పేర్కొన్నారు. శనివారం ఉక్కుపరిశ్రమ సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి మద్దతు తెలిపిన అనంతరం వారు ప్రసంగించారు.

01/22/2017 - 02:13

కాకినాడ, జనవరి 21: ‘గృహనిర్మాణంపై దృష్టి సారించి, ప్రగతి చూపండి’ అని జిల్లా అధికారులను గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. వివిధ గృహ నిర్మాణ పథకాల క్రింద జిల్లాలో సుమారు 35వేల ఇళ్ళు నిర్మించనున్నట్టు చెప్పారు. మార్చి నెలాఖరుకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

01/22/2017 - 02:12

కాకినాడ, జనవరి 21: జిల్లా కేంద్రం కాకినాడలోని రాజాట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శనలో ఏర్పాటుచేసిన అన్నవరం శ్రీ సత్యదేవుని నమూనా ఆలయంలో ప్రసాదం విక్రయించకపోవడం పట్ల రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల కోరిక మేరకు తక్షణం ఆలయంలో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని అన్నవరం దేవస్థానం ఇఒ కె నాగేశ్వరరావును ఆదేశించారు.

01/22/2017 - 02:12

సామర్లకోట, జనవరి 21: జిల్లాలో ఈ ఏడాది కాట్రేనికోన, అడ్డతీగల, రాజవొమ్మంగి, రంపచోడవరం మండలాల్లో రూ.40 లక్షల వ్యయంతో నోడల్ స్టోర్లు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) లైలీహుడ్ (్ఫమ్) డైరెక్టర్ శ్రీనివాస బాబా చెప్పారు.

Pages