S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 02:47

వడ్డేపల్లి, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడాకారులకు తగిన వసతులను కల్పించి, క్రీడారంగ అభివృద్దికి కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి పద్మారావు అన్నారు.

01/22/2017 - 02:45

వాషింగ్టన్, జనవరి 21: అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ముందునుంచి చెబుతున్నట్లుగానే ఒబామా కేర్ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. శుక్రవారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ట్రంప్ ఒబామా కేర్ పథకానికి సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజన్సీలను ఆదేశించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

01/22/2017 - 02:42

నిర్మల్,జనవరి 21: జాతీయ గ్రామీన ఉపాధిహామీ పథకం నిధులతో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎంపి జి.నగేష్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్యలతో కలిసి శంకుస్థాపనచేశారు.

01/22/2017 - 02:42

ఆదిలాబాద్,జనవరి 21: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద లబ్దిదారులకు రెండు పడకల ఇండ్ల నిర్మాణం వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా అధికారులు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్‌రూం పథకం అమలుపై కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షించారు.

01/22/2017 - 02:41

మందమర్రి, జనవరి 21: రోడ్డుపై అప్రమత్తతో ప్రమాదాల నివారించావచ్చునని డిటి ఓ వెంకటయ్య అన్నారు. శనివారం కేకే - 1 గని వద్ద రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లనే వాహనాల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వాహన ప్రమాదాలు నివారించుటకు ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాద నివారణకు తోడ్పాడాలని ఆయన కోరారు.

01/22/2017 - 02:40

ఇచ్చోడ,జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేకంగా విద్యరంగంపై దృష్టిసారించిందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ అన్నారు. శనివారం ఇచ్చోడ మండలంలోని మల్యాల గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

01/22/2017 - 02:40

భీమిని, జనవరి 21: కనె్నపల్లి మండల పరిధిలోని ముత్తపూర్ శివారులో గత 8 సంవత్సరాల క్రితం మంజూరు అయిన కృష్ణపల్లి ప్రాజెక్ట్ పనులు రాష్ట్ర విభజనలో భాగంగా అర్థతరంగా నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు కోటి 70 లక్షలు మంజూరు చేసింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందకపోవడంతో నిర్వాసితులు శనివారం పనులను అడ్డుకోని నిరసన తెలిపారు.

01/22/2017 - 02:38

సిద్దిపేట, జనవరి 21 : సిద్దిపేట జిల్లా రైతాంగానికి గత సంవత్సరం కరవు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాకాలంలో కరవుతో దెబ్బతిన్న వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, కంది పంటలకు నష్టపరిహారం వర్తిస్తుందన్నారు.

01/22/2017 - 02:38

చిన్నశంకరంపేట, జనవరి 21: దేశంలో ఏరాష్ట్రంలో లేనివిదంగా మిషన్ భగీరత పథకం ద్వారా తాగునీరు అందించడం జరుగుతుందని అలాగే ప్రతి గ్రామానికి పైప్‌లైన్ కోసం 178కోట్ల నిదులను కేటాయించడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయ ఆవరనలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 38మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

01/22/2017 - 02:37

సదాశివపేట, జనవరి 21: ప్రజాసమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారిన చైర్ పర్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో తామే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతామని సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన మొత్తం 18 మంది కౌన్సిలర్లు సవాల్ విసురుతున్నారు. గత కొంత కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం చిలికిచిలికి గాలివానగా మారింది.

Pages