S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 02:56

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్ సెంటర్, కనె్వన్షన్ హాలు నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. నగరంలోని మణికొండలో ఆరు ఎకరాల వక్ఫ్ స్థలంలో 40 కోట్ల వ్యయంతో నిర్మించే ఇస్లామిక్ సెంటర్‌ను త్వరలోనే తానే శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు.

01/22/2017 - 02:56

మేడ్చల్, జనవరి 21: విద్యార్థులు స్వయంకృషితో ప్రయోగాల ద్వారా నూతన ఆవిష్కరణలకు నాంది పలికితేనే అవి వెలుగులోకి వస్తాయని తెలంగాణ ఐక్యకార్యచరణ సమితి (జెఎసి) చైర్మన్ కోదండరామ్ అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయ పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండవ జాతీయస్థాయి సైన్స్‌ఎక్స్‌పో2కె17 ముగింపు సెమినార్‌ను శనివారం నిర్వహించారు.

01/22/2017 - 02:55

విజయనగరం/గంట్యాడ, జనవరి 21: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం ప్రధాన గేట్లలో ఒకటి అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమెకోసం గాలిస్తూ ఓ కానిస్టేబుల్ నీటిలో మునిగి మరణించారు. శనివారం జరిగిన ఈ సంఘటన అధికారులను, స్థానికులను దిగ్భ్రాంత్రికి గురిచేసింది.

01/22/2017 - 02:54

హైదరాబాద్, జనవరి 21: వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు జలమండలి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో శనివారం ప్రధాన కార్యాలయంలో మీట్ యువర్, డయల్ యువర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

01/22/2017 - 02:51

ముంబయి, జనవరి 21: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశారన్న ఆరోపణ ప్రతీ రేప్ కేస్‌కూ వర్తించదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చదువుకున్న అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ముందు తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నప్పుడు దాన్ని రేప్ అనజాలరని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మృదులా భట్కర్ తెలిపారు.

01/22/2017 - 02:49

జనగామ టౌన్, జనవరి 21: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో ఉన్న పలువురు కంది రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

01/22/2017 - 02:49

వరంగల్, జనవరి 21: జిల్లాపరిషత్‌లో సభ్యులైన జడ్పీటిసిలకు విధులు, నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటిసిలు శనివారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి జిల్లాపరిషత్ కార్యాలయం ముందు బైఠాయించారు.

01/22/2017 - 02:48

రాజమహేంద్రవరం, జనవరి 21: జాతీయ జల రవాణా ప్రాజెక్టులో కదలిక మొదలైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నాలుగో జల మార్గం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరున శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని రకాల సర్వేలు పూర్తయ్యాయి. జిల్లాలవారీగా సర్వే పూర్తి చేసి అవసరమైన భూమిని గుర్తించామని గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ హరిబాబు తెలియజేశారు.

01/22/2017 - 02:48

నర్సంపేట, జనవరి 21: నర్సంపేటలోని పద్మశాలి గార్డెన్‌లో శనివారం జరిగిన కల్యాణలక్ష్మీ లబ్దిదారుల చెక్కుల పంపిణీలో అలజడి చోటు చేసుకుంది. సభాధ్యక్షత చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తొలుత రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు.

01/22/2017 - 02:47

వర్ధన్నపేట, జనవరి 21: రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను ఆయన సందర్శించారు.

Pages