S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 04:31

కలిదిండి, జనవరి 20: నిరుపేదలకు సైతం వేలిముద్ర లేదని క్రిస్మస్, సంక్రాంతికి చంద్రన్న కానుకలు అందక ఎందరో నిరుపేదలు ఎదురు చూస్తున్నారని కైకలూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపి అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కలిదిండి ప్రధాన సెంటరులో గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించారు.

01/21/2017 - 04:30

విజయవాడ (క్రైం), జనవరి 20: అంగవైకల్య ధ్రువీకరణ పత్రానికి నివేదిక ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ వైద్యాధికారితోపాటు అతని సహాయకుడు అవినీతి నిరోధక శాఖాధికారులకు శుక్రవారం రాత్రి దొరికిపోయాడు. ఎసిబి డిఎస్‌పి వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ప్రభుత్వాసుపత్రి ఆర్ధోపెడిక్ విభాగం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పివి దశరయ్య తన ప్రైవేట్ క్లినిక్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

01/21/2017 - 04:29

బెంజిసర్కిల్, జనవరి 20: ఆధునిక, శాస్ర్తియ విధానల ద్వారా అధిక దిగుబడులు సాధించిన పొగాలకు రైతులను ఘనంగా సత్కరించారు. అసాధారణ వ్యవసాయ విధానాలు స్వీకరించడంతో పాటు పంట దిగుబడులను సాధించిన 17మంది పొగాకు రైతులకు అవార్డులను అందజేళశారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టుబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేశారు.

01/21/2017 - 04:29

విజయవాడ, జనవరి 20: మైనర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీధి దీపాలకువచ్చే విద్యుత్ బిల్లులను, అలాగే అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఎపిసిఆర్‌డిఎ పరిధిలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు.గ్రామ సర్పంచుల కమిటీ రాష్ట్ర సమావేశం శుక్రవారం బందరు రోడ్డులోని మిడ్‌సిటీ హోటల్‌లో జరిగింది.

01/21/2017 - 04:25

విజయవాడ, జనవరి 20: విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం 2016 కింద వివిధ సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులను వీరికి కేటాయించా ల్సి ఉంటుందని రాష్ట్ర మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరిగింది.

01/21/2017 - 04:22

విజయవాడ, జనవరి 26: పోలవరం ప్రాజెక్టు గేట్లు, డయాఫ్రం వాల్ పనులు ఈ నెల 29 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఇప్పటికే ఇం దుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర జల సంఘం ఖరారు చేసిందన్నారు. ఒక ఒక బ్లాక్, ఒక పిల్లర్ నిర్మాణం పూర్తి అయిన తరువాత పూర్తి స్థాయి లో డిజైన్‌పై స్పష్టత వస్తుందన్నారు.

01/21/2017 - 04:21

విజయవాడ, జనవరి 20: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకై భారీగా పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్షణం తీరిక లేకుండా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. అయితే ఆయన వ్యవహారశైలి ఎలా ఉందంటే ఏనుగులు పోయే దారి వదిలి... చీమలు వెళ్లే దారి కోసం వెతుకుతున్నట్లుగా వుంది..

01/21/2017 - 04:21

విజయవాడ, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఎపి ఎన్‌జివో అసోసియేషన్) రాష్ట్ర సంఘానికి ఫిబ్రవరి 19వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారి కె.దాలినాయుడు శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు.

01/21/2017 - 04:20

విజయవాడ (క్రైం), జనవరి 20: రాష్ట్రంలో 11మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు లభించాయి. వీరిలో పలువురుకి స్థానం చలనం కలిగింది. వెయిటింగ్‌లో ఉన్న ఎక్కువ మందికి కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ డిజిపి కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న కె కృష్ణప్రసన్న, ఎస్‌వి మాధవరెడ్డిలను పిసిఎస్ అండ్ ఎస్ విభాగంలో పోస్టింగ్‌లు ఇచ్చారు.

01/21/2017 - 04:20

విజయవాడ, జనవరి 20: రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు అకాడమీ శాఖను తిరుపతిలో ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకతిక శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశించారు. వెలగపపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సిబ్బందికి శిక్షణ వంటివి నిర్వహించేందుకు ఈ కేంద్రం ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు.

Pages