S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 21:13

బాలీవుడ్‌లో నువ్వా..నేనా? అన్న రీతిలో కెరీర్‌ను కొనసాగించిన అందాల భామలు దీపికాపడుకొనే, ప్రియాంక చోప్రాలకు హాలీవుడ్‌లోనూ ఇదే తంతు కొనసాగుతోందిట. హిందీ చిత్రాల్లో అగ్ర హీరోలనుంచి యువతరం కథానాయకులతో ఆడిపాడిన ఈ సుందరీమణులు నటించిన హాలీవుడ్ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ‘క్వాంటికో’ టీవీ సీరిస్ ద్వారా ఇప్పటికే హాలీవుడ్ జనాలకు బాగా పరిచయమైంది ప్రియాంక.

01/21/2017 - 21:10

వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు.. అన్నీ నీరుగారిపోయాయి అందాల భామ సలోని విషయంలో. అచ్చ తెలుగమ్మాయికి వుండవలసిన అన్నీ ఫీచర్స్ వున్నా కెరీర్‌ని మాత్రం నిలబెట్టలేకపోయాయి.

01/21/2017 - 05:14

నల్లగొండ, జనవరి 20: పులిచింతల ప్రాజెక్టులో కనీస నీటిమట్టం మేరకు జలాలు ఉండేలా చూడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఆ ప్రాజెక్టులో కనీసమట్టం మేరకు నీరు లేకపోతే తెలంగాణ పరిధిలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు పనిచేయవు. అందువల్ల ఈ ప్రాంత పరిథిలోని ఆయకట్టు రైతులు పంటలు నష్టపోతున్నారు.

01/21/2017 - 05:12

ధర్మారం, జనవరి 20: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నందిమేడారం చెరువుద్వారా హైదరాబాద్ వరకు వెళ్తున్న ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పైపు గేట్‌వాల్‌ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీరు కొన్ని మీటర్ల ఎత్తువరకు ఎగసిపడింది. పెద్దఎత్తున నీరు వృధాగా పోతోంది. విషయం తెలుసుకున్న ఎల్లంపల్లి నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

01/21/2017 - 05:09

టేక్మాల్, జనవరి 20: ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నిర్వహణ లోపంతో భ్రష్టపడుతోంది. టేక్మాల్ మండలంలోని బర్దీపూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంకోసం వాడుతున్న బియ్యం పురుగులు పట్టి రంగుమారాయి. నాలుగు నెలలుగా అదే పరిస్థితి.

01/21/2017 - 05:08

హైదరాబాద్, జనవరి 20:వామపక్షాలకు పనీ పాటా లేదని, వాటి అనుబంధ సంఘాలకు పని లేకుండా పోయిందని, అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అడ్డుకుందామా? అనే పనిలో ఉన్నాయని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశాల్లో విమర్శించారు. సిపిఎం పార్టీకి శాసన సభలో ఒకే సభ్యుడు ఉన్నా గంటకు పైగా మాట్లాడారని చెప్పారు.

01/21/2017 - 05:08

వరంగల్, జనవరి 20: ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులు ఇచ్చే హామీలు, చేసే ప్రమాణాలను ఎన్నికయిన తరువాత అమలు చేయకుంటే దానికి ఎన్నికల సంఘం జవాబుదారీ కాదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాజ్యాంగం, నిబంధనలు నిర్దేశించిన మేరకు ఎన్నికలు నిర్వహించటమే తమ పని అని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు మాదిరిగా దేశంలోని ప్రతి ఒక్కరికి సిటిజన్ కార్డు జారీ చేయాలనే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.

01/21/2017 - 04:59

ఒంగోలు/కందుకూరు,జనవరి 20: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పిసిపల్లిలో శుక్రవారం ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

01/21/2017 - 04:57

నెల్లూరు, జనవరి 20: నెల్లూరు శివారులో మైపాడు రోడ్డులో ఒక ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకుకు చెందిన ఎటిఎం కార్డులు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం కలకలం రేపింది. నెల్లూరు - మైపాడు రహదారిలో మూడో మైలు రాయి వద్ద ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన భారీ సంఖ్యలో రూపే కార్డుల గుట్టను శుక్రవారం సాయంత్రం స్థానికులు గమనించారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో జనం గుమికూడారు.

01/21/2017 - 04:55

సింహాచలం, జనవరి 20: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. 5 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో సుమారు అయిదు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నెడ్‌క్యాప్ పర్యవేక్షణలో హైదారాబాద్‌కి చెందిన ఒక సంస్థ ఈ పనులు చేపడుతోంది.

Pages