S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 04:19

తిరుపతి, జనవరి 20: స్వాతంత్రోద్యమ కాలంలో తానునమ్మిన అహింసావాదంతోనే మహాత్మగాంధీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని గాంధీజీ మనవడు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత రాజ్‌మోహన్ గాంధీ అన్నారు. శుక్రవారం తన సతీమణి ఉషామోహన్‌గాంధీతో కలసి తిరుపతిలోని భారతీయ విద్యాభవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ను దుశ్శాలువతో కప్పి సన్మానించి, జ్ఞాపికతో సత్కరించారు.

01/21/2017 - 04:18

విజయవాడ, జనవరి 20: ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయల మంజూరు చేసి వేలాది మంది విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్‌టిఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద అర్హులైన విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

01/21/2017 - 04:18

రాజమహేంద్రవరం, జనవరి 20: సిద్ధాంతపరంగా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల హిందూ పండుగల విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంటోందని ప్రముఖ జ్యోతిష పండితులు దివంగత మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ కుమారుడు, విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం కార్యదర్శి పాలశంకరమూర్తి శర్మ పేర్కొన్నారు. తాజాగా ఉగాది విషయంలో కూడా పంచాంగకర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల వేరువేరు తేదీల్లో పండుగను జరుపుకోవాల్సి వస్తోందన్నారు.

01/21/2017 - 04:14

హైదరాబాద్, జనవరి 20: అనుకున్న స్థాయిలో లక్ష్యాలు సాధించ లేకపోతున్నామని, తమ ఆరాటానికి, జరుగుతున్న ఆవిష్కరణలకు మధ్య కొంత వెలితి ఉందని, అయినప్పటికీ ఇప్పుడిప్పుడే అనుకున్న మేరకు పని చేయగలుగుతున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్‌కు ఈటలతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

01/21/2017 - 04:07

భద్రాచలం, జనవరి 20: తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి అసలైన ప్రత్యామ్నాయం మేమే... ఒంటరిగానే పోటీ చేసి 2019లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటాం... అంటూ దక్షిణ అయోధ్య భద్రాచలం కేంద్రంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.

01/21/2017 - 04:05

హైదరాబాద్, జనవరి 20: మాజీ సైనికుల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా మాజీ సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీలో కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

01/21/2017 - 04:02

చెన్నై, జనవరి 20: జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా తీరం పోటెత్తింది. సంస్కృతిపై దాడిని నిరసిస్తూ, జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలన్న డిమాండ్‌తో తమిళులు భగ్గుమన్నారు. తీరం వేదికగా నాలుగు రోజుల క్రితం విద్యార్థులు మొదలుపెట్టిన ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభించటంతో శుక్రవారానికి ఉద్యమం మరింత ఊపందుకుంది.

01/21/2017 - 03:59

న్యూఢిల్లీ, జనవరి 20: జల్లికట్టుపై తీర్పును వారం వరకూ ఇవ్వొద్దన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించింది. పిటిషన్లపై విచారణలను వారంపాటు వాయిదా వేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి ఈ అంశంపై వాదనలు వినిపించారు.

01/21/2017 - 03:59

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్టు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఈ మేరకు వయో పరిమితి పెంచినట్టు చెప్పారు. వాలంటరీ రిటైర్‌మెంట్ ద్వారా వారసులకు ఉద్యోగాలు కల్పించే పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో సింగరేణిలో పునరుద్ధరించారు.

01/21/2017 - 03:58

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్య యుజి, పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు కన్వీనర్లను సైతం ఖరారు చేసింది.

Pages