S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్రంలో కొత్తగా 2132 కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపినందున ఈ పనులు వేగంగా జరిగేట్టు చూడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు.

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించాల్సిన ఎడ్‌సెట్-2017ను తాత్కాలికంగా సుప్తచేతనావస్థలో ఉంచినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఎడ్‌సెట్-2016 ప్రక్రియ పూర్తికాకుండానే ఎడ్‌సెట్-2017 నిర్వహించడంపై ఆంధ్రభూమి ప్రచురించిన వార్తాకథనానికి అధికారులు స్పందించారు.

01/21/2017 - 03:45

న్యూఢిల్లీ, జనవరి 20: ఎటిఎంను కలిగివున్న తొలి భారత యుద్ధనౌకగా అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య చరిత్ర సృష్టించనుంది. దీనిలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎటిఎంను శాటిలైట్ లింక్ ద్వారా నడపనున్నారు. ఈ ఎటిఎం సేవలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి. ఒకేసారి దాదాపు 1,500 మంది నావికులను తీసుకెళ్లే ఈ యుద్ధనౌక ఈసారి 2 వేల మంది సిబ్బందితో బయలుదేరేందుకు సిద్ధమైంది.

01/21/2017 - 03:44

న్యూఢిల్లీ, జనవరి 20: జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించిన చెప్పులను అమ్ముతూ భరత జాతిని అవమానించిన అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ ఎట్టకేలకు దిగివచ్చింది. సున్నిత మనస్కులైన భారతీయుల మనోభావాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంతో ఈ చెప్పుల అమ్మకాలను నిలిపివేసింది. విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

01/21/2017 - 03:43

న్యూఢిల్లీ, జనవరి 20: ప్రభుత్వ విభాగాలు ఏకాకి మనస్తత్వాన్ని విడనాడాలని, కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘దురదృష్టవశాత్తు ప్రభుత్వ విభాగాలు ఎవరికి వారుగా పని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాయి. ఒక్కోసారి ఒకే విభాగంలో పలు ముఠాలు ఉంటాయి. శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదు.

01/21/2017 - 03:42

న్యూఢిల్లీ, జనవరి 20: వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నేరడి ప్రాజెక్టు, కాట్రగడ వద్ద వరద కాలువ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వంశధార నదీ సంబంధించిన కేసులు ఇటు సుప్రీంకోర్టు అటు ట్రిబ్యునల్‌లో ఉండగానే ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని ఒడిశా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

01/21/2017 - 03:41

న్యూఢిల్లీ, జనవరి 20: ముదిరాజ్, ముత్తరాసి, తెనుగొల్లు, పూసల కులాలను బిసి(డి) నుంచి బిసి(ఎ) జాబితాలోకి చేర్చడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ బిసి కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ నాలుగు కులాలను బిసి(డి) నుంచి బిసి(ఎ) జాబితాలోకి చేరుస్తూ జీవో జారీ చేసింది.

01/21/2017 - 03:41

న్యూఢిల్లీ, జనవరి 20: రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా కాకుండా కేంద్ర బడ్జెట్‌తోకలిపి ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు చేసింది. కేబినెట్ సెక్రెటేరియట్ ఆదేశాల మేరకు దీనికి రూపకల్పన చేశారు.

01/21/2017 - 03:40

న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ,కాంగ్రెస్ పార్టీల పొత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. కలిసి పోటీ చేసేందుకు ఎస్‌పి అధినేత, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ వైపు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే శుక్రవారం 199 మంది పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసేశారు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నీలి నీడలు అలుముకున్నాయి.

01/21/2017 - 03:39

వాషింగ్టన్, జనవరి 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వేలాది మంది నిరసనల మధ్య జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాషింగ్టన్‌కు తరలి వచ్చిన జనం ఆ ప్రాంతాన్ని నిరసనలు, ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొత్త ప్రభుత్వం విచ్ఛిన్నకర విధానాలను అవలంబిస్తోందంటూ ఆక్రోషించారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు మిరియాల పొడిని చల్లాల్సి వచ్చింది.

Pages